పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ

జమ్మూలో ఓ.ఎన్.జి.సి. నిధులతో నిర్మించనున్న యాత్రి నివాస్‌ కు శంకుస్థాపన చేసిన - శ్రీ హర్దీప్ సింగ్ పురి

Posted On: 06 JUN 2023 3:45PM by PIB Hyderabad

గౌరవనీయులైన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికత నుంచి ప్రేరణ పొందిన చమురు సహజ వాయువు సంస్థ (ఓ.ఎన్.జి.సి) జమ్మూ లోని సిధ్రా లో జాతీయ విపత్తు నివారణ కేంద్రం తో పాటు, యాత్రి నివాస్ నిర్మాణానికి నిధులు సమకూరుస్తోంది.  గౌరవనీయులైన కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు, గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ హర్దీప్ సింగ్ పురి మరియు గౌరవనీయులైన జమ్మూ-కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ మనోజ్ సిన్హా ఈ రోజు, 2023 జూన్, 6వ తేదీన జమ్మూలో ఈ కేంద్రానికి శంకుస్థాపన చేశారు.

ప్రతి సంవత్సరం లక్షలాది మంది పర్యాటకులు శ్రీనగర్, అమర్‌ నాథ్‌ లను సందర్శిస్తారు.  అయితే, ఈ ప్రాంతంలో రద్దీ అధికంగా ఉండడంతో, ముఖ్యంగా ఆ ప్రాంతం గుండా ప్రయాణించే పర్యాటకులు, యాత్రికులు చాలా కాలంగా రవాణా సవాళ్లను ఎదుర్కొంటున్నారు.   ఇప్పుడు ఓ.ఎన్.జి.సి. నిధులతో నిర్మిస్తున్న ఈ యాత్రి నివాస్ - ఒక సంవత్సరంలో 30,000 మంది పర్యాటకులకు వసతి కల్పించడం ద్వారా రవాణా సవాళ్ళను చాలా వరకు పరిష్కరిస్తుంది, తద్వారా పర్యాటకులు, యాత్రికుల రాకపోకలను క్రమబద్దీకరిస్తుంది. 

పర్యాటకులకు తగిన బస, పారిశుధ్యం, సురక్షితమైన తాగునీరు వంటి అవసరమైన సౌకర్యాలు కల్పించడంలో ఈ  ఓ.ఎన్.జి.సి. విపత్తు నిర్వహణ కేంద్రం కీలక పాత్ర పోషిస్తుంది.  అత్యవసర సమయంలో కీలక సమాచారాన్ని తెలియజేయడానికి, సహాయక చర్యలు అందించడానికి ఇది ఒక సమగ్ర కేంద్రంగా పనిచేస్తుంది.  అదనంగా, ఇది ట్రాఫిక్ నిర్వహణకు దోహదపడుతుంది.  అవసరమైన పర్యాటకులు / యాత్రికుల కోసం భోజన, వసతి సదుపాయాలను సులభతరం చేయడం పై ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు, ఎటువంటి ఇబ్బందులు లేని పర్యాటక, తీర్థయాత్ర అనుభవాన్ని నిర్ధారిస్తుంది

అంతేకాకుండా, నైపుణ్యం లేని, తక్కువ నైపుణ్యం కలిగిన, సంపూర్ణ నైపుణ్యం కలిగిన కార్మికులు, కళాకారులు, హస్తకళాకారులు, రోజువారీ కూలీలు, కార్మికులు, వీధి వ్యాపారులు, నేత కార్మికులతో సహా స్థానిక జనాభా కూడా ఈ ఓ.ఎన్.జి.సి. కల్పించే సౌకర్యాల ఫలితంగా పెరిగిన రద్దీ యొక్క సానుకూల ప్రభావాలను అనుభవిస్తారు.

జాతీయ విపత్తు నివారణ కేంద్రం, యాత్రి నివాస్‌ ల నిర్మాణం 1.84 ఎకరాలు అంటే 8,378 చదరపు మీటర్ల స్థలంలో, సుమారు 1.875 ఎకరాలు అంటే 8,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మితమై ఉంటుంది.  తన కార్పొరేట్ మౌలిక సదుపాయాల బృందం ద్వారా, ఈ ప్రాజెక్ట్ సకాలంలో, సమర్థవంతంగా పూర్తి అయ్యేలా చూసేందుకు, కార్పొరేట్ సామాజిక బాధ్యత (సి.ఎస్.ఆర్) పట్ల, తన నిబద్ధతను కూడా సమర్థించడం కోసం, ఈ ప్రాజెక్టు అమలును ఓ.ఎన్.జి.సి. పర్యవేక్షిస్తుంది.

తన విస్తృతమైన కార్పొరేట్ సామాజిక బాధ్యత (సి.ఎస్.ఆర్) కింద చేపడుతున్న కార్యక్రమంలో భాగంగా, ఓ.ఎన్.జి.సి. ప్రాజెక్టుకు మద్దతుగా 51 కోట్ల రూపాయల మేర నిధులు సమకూరుస్తోంది.  భారతదేశ ఇంధన రంగంలో మహారత్న ఓ.ఎన్.జి.సి. ద్వారా నిధులు సమకూరుస్తున్న ఈ గణనీయమైన బాధ్యత, దేశానికి సేవ చేయాలనే దాని అచంచలమైన నిబద్ధతను మరింతగా ప్రదర్శిస్తోంది.

ఈ కార్యక్రమంలో ఓ.ఎన్.జి.సి. చైర్మన్, సి.ఏ.ఓ. శ్రీ అరుణ్ కుమార్ సింగ్ తో పాటు పలువురు గౌరవనీయ అతిథులు పాల్గొన్నారు.  ఈ కార్యక్రమానికి కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూ-కశ్మీర్ తో పాటు, ఓ.ఎన్.జి.సి.కి చెందిన సీనియర్ అధికారులు కూడా హాజరయ్యారు.

 

 

*****



(Release ID: 1930337) Visitor Counter : 135