విద్యుత్తు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రపంచ పర్యావరణ దినోత్సవ 50 వ వార్షికోత్సవం సందర్బంగా, ఈ –కుకింగ్ పరివర్తనలో వినియోగదారు ఆధారిత

విధానాలు అనే అంశంపై సదస్సు నిర్వహించిన ప్రభుత్వం.

భారతీయ వంటగదులలో ఈ –కుకింగ్ దే భవిష్యత్తు. ఇందుకు అందుబాటులో బిజినెస్ నమూనాలు అవసరం: అదనపు కార్యదర్శి, విద్యుత్

ఇండియాలో తక్కువ ఖర్చుతో , పరిశుభ్రమైన రీతిలో, ఇంధన సామర్ధ్యంతో కూడిన ఈ –కుకింగ్ పరిష్కారాలను మనం వేగవంతం వేగవంతం చేయడం ఎలా?

Posted On: 05 JUN 2023 12:02PM by PIB Hyderabad

ఈరోజు , ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్బంగా ,  కేంద్ర ప్రభుత్వానికి చెందిన, మినిస్ట్రీ ఆఫ్ పవర్ కింద గల బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ (బిఇఇ)
న్యూఢిల్లీలో ఒక సదస్సును ఏర్పాటు చేసింది. సిఎల్ఎఎస్ పి సహకారంతో దీనిని ఏర్పాటు చేశారు.
 ఈ సదస్సులో ఈ –కుకింగ్ కు సంబంధించి ఇంధన సామర్థ్యంతో కూడిన,
తక్కువ ఖర్చు కాగల, స్వచ్ఛతతో కూడిన పరిష్కారాల  విషయంలో వినూత్న పరిష్కారాలగురించి చర్చించడం జరిగింది.
‘ ఈ – కుకింగ్ పరివర్తనకు సంబంధించి వినియోగదారు కేంద్రిత విధానాలను ఈ సదస్సులో చర్చించారు. ఇందుకు సంబంధించి,
సంస్థాగత వినియోగదారులు, వినియోగదారు పరిశోధన గ్రూపులు, విధాన నిర్ణేతలు, ఆలోచనాపరులు, తయారీదారులు
పాల్గొన్నారు. వీరు విద్యుత్ ఆధారిత కుకింగ్కు పరివర్తన కు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు.
 విద్యుత్ మంత్రిత్వ శాఖకు చెందిన అదనపు కార్యదర్శి శ్రీ అజయ్ తివారి , ఈ సదస్సులో కీలకోపన్యాసం చేస్తూ, రానున్న రోజులలో

ఈ – కుకింగ్ అనేది భారతీయులకు పర్యావరణ హితకరమైన అలవాటుగా మారనున్నదని చెప్పారు.“కొంతమంది ఈ విషయాన్ని చాలా తేలికగా తీసుకోవచ్చు. కానీ,
గ్రామీణ, పట్టణ ప్రాంతాల కుటుంబాల విషయంలో ఈ –కుకింగ్కు ఎన్నో కోణాలు ఉన్నాయి. మన దేశంలో పెద్ద సంఖ్యలో ఉన్న జనాభాను దృష్టిలో ఉంచుకుని,
మన అలవాట్లలో చేసుకునే మార్పు , భూగోళంపై గొప్ప ప్రభావాన్ని చూపగలదు”అని ఆయన అన్నారు.

ప్రధానమంత్రి , 2021 లో గ్లాస్గో లో   ఐక్యరాజ్య సమితి 26వ యు.ఎన్. క్లైమేట్ ఛేంజ్ కాన్ఫరెన్స్ ఆఫ్ ద పార్టీస్ – కాప్ 26 సదస్సు సందర్భంగా
 మిషన్ లైఫ్ (ఎల్.ఐ.ఎఫ్.ఇ)ని ప్రారంభించిన విషయాన్ని ప్రస్తావిస్తూ,  ఇండియా ఇంధన పరివర్తనలో  నాయకత్వ స్థాయికి ఎదిగిందని ఆయన చెప్పారు.
–– మనం పునరుత్పాదక ఇంధన లక్ష్యాలను మనం నిర్దేశించుకున్న కాలానికంటే ముందే సాధించనున్నాం. ఇది
మనం జాతీయ స్థాయిలో తీసుకున్న నిర్ణయం అందుకు చేపట్టిన చర్యల వల్ల  లక్ష్యానికంటే 9 సంవత్సరాల ముందుగా,
సాధించనున్నాం. అలాగే పునరుత్పాదక ఇంధన వనరుల లక్ష్యాలనూ సాధించనున్నాం.”అని ఆయన అన్నారు.

24 గంటల విద్యుత్‌ అందుబాటు ప్రేరణతో ఈ`కుకింగ్‌ దిశగా అడుగులు:
మన ఇళ్లలో ప్రస్తుతం 24 గంటలూ విద్యుత్‌ నిరంతరాయంగా అందుబాటులో ఉంటుండడంతో  మనం ఈ `కుకింగ్‌ దిశగా అడుగులు వేయాలనుకుంటున్నటెఱఉ్ట అడిషనల్‌ సెక్రటరీ తెలిపారు.‘‘ ఇండియా కేవలం  18 నెలల కాలంలో,  విద్యుత్‌ కనెక్షన్లు లేని 26 మిలియన్లమంది  ప్రజలకు సౌభాగ్య కనెక్షన్లు ఇచ్చింది. ప్రపంచ చరిత్రలో మున్నెన్నడూ లేనంతగా  ఇంత స్వల్పవ్యవధిలో ఇంత ఎక్కువ ఇళ్లకు ఎప్పుడూ విద్యుత్‌ కనెక్షన్లు ఇవ్వలేదు.  దేశంలోని అన్ని పట్టణ ప్రాంతాలకు సగటున రోజులో 23.5 గంటలపాటు , ఎక్కువభాగం  గ్రామీణ ప్రాంతాలలో సగటున రోజుకు 23 గంటల పాటు విద్యుత్‌ సరఫరా అందించగలుగుతున్నట్టు ఆయన తెలిపారు. ఇది ఒక గొప్ప విజయమని ఆయన తెలిపారు. విద్యుత్‌ కోతలు అనేది ఒక గతమని ఆయన తెలిపారు. ’’ ప్రపంచంలో ఇప్పటికీ 700 మిలియన్ల మంది ప్రజలకు విద్యుత్‌ సదుపాయం అందుబాటులో లేదని , జి`20  దేశాలకు ఉమ్మడి ఇంధన అందుబాటు మన ప్రాధాన్యతాంశమని ఆయన తెలిపారు.

అందుబాటులో ఈ`కుకింగ్‌ బిజినెస్‌ నమూనాలు రూపొందించాల్సిన అవసరం ఉంది:
ఉజ్వల విజయవంతం అయిన తర్వాత , పరిశుభ్రమైన ఈ కుకింగ్‌ కు పరివర్తన చెందిన తర్వాత,వీటిని అందుబాటు ధరలోకి తేవడం ముఖ్య విషయంగా మారిందని ఆయన అడిషనల్‌ సెక్రటరీ అన్నారు.పునరుత్పాదక ఇంధన వనరుల నుంచి ఈ కుకింగ్‌ను మనం ప్రోత్సహించవలసి ఉందని ఆయన అన్నారు. సౌర విద్యుత్‌, థర్మల్‌ విద్యుత్‌ వాటినుంచి పునరుత్పాదక ఇంధనాన్ని ఈ కుకింగ్‌కు వినియోగించాల్సి ఉందన్నారు.  మనకు ప్రమాణీకృత , చవకైన ఇంధన నమూనాలు ఉంటే, మనం అన్ని పట్టణ ప్రాంతాలలో వీటిని రెండు లేదా మూడు సంవత్సరాలలో అమలు చేయవచ్చని తెలిపారు. 2030 నాటికి మనం ఈ కుకింగ్‌ కింద వీలైనన్ని ఎక్కువ ఇళ్లకు ఈ కుకింగ్‌ను వర్తింప చేయవచ్చని తెలిపారు. ఇది వాతావరణ మార్పులపై మనం సాగిస్తున్న పోరాటానికి  చెప్పుకోదగిన విధంగా తోడ్పాటునందిస్తుందని చెప్పారు.

‘‘ ఈ `కుకింగ్‌ దిశగా సాంకేతికత విషయంలో స్వల్ప అడ్డంకులు’:

ఇంధన సమర్ధతకు సంబంధించి న బ్యూరో కు చెందిన డైరక్టర్‌ జనరల్‌ అభయ్‌ బాక్రే కీలకోపన్యాసం చేస్తూ, పర్యావరణ పరిరక్షణ విషయంలో మనం ఇప్పుడు ఒక కీలకదశకు చేరుకున్నామని అన్నారు. మనం మిషన్‌ లైఫ్‌తో ముందుకు వెళుతున్నామని చెప్పారు. విద్యుత్‌ను ఉపయోగించి వంట చేయడం గురించి ప్రస్తావిస్తూ, ఈ రంగంలో స్వల్ప పరిశోధన అవసరమని చెప్పారు. మనకు ఈ`కుకింగ్‌ ఉపకరణాలు ఉన్నాయని, వినియోగదారులకు సైతం వీటిపై అవగాహన ఉందని చెప్పారు. ఈ కుకింగ్‌ను చేపట్టడంలో వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్య ఆయా ఉపకరణాలలో తలెత్తే సమస్యలు, లోపాల గురించినవి. అలాగే అన్నిరకాల వంటకాలను ఈ కుకింగ్‌ ద్వారా వండుకోవచ్చునా అన్న సందేహమూ ఉంటుంటుంది.  మనం గో ఎలక్ట్రిక్‌ ప్రచారాన్ని నిర్వహించినపుడు, ఎలక్ట్రిక్‌ వెహికల్‌చార్జింగ్‌ కు సంబంధించిన మౌలిక సదుపాయాల కల్పన విషయంలో పలు సవాళ్లు ఎదుర్కొన్నట్టు తెలిపారు. అలాగే విద్యుత్‌ వాహనాల ధరలు,వాటి ఉత్పత్తి సామర్ధ్యం విషయంలోనూ సవాళ్లు ఎదుర్కొన్నట్టు చెప్పారు. అయితే ఇందుకు భిన్నంగా ఈ కుకింగ్‌ లో ఇలాంటి సవాళ్లు లేవని ఆయన తెలిపారు. సంప్రదాయ స్టవ్‌లపై వండే దాదాపు అన్ని రకాల వంటకాలను  ఈ కుకింగ్‌ విధానంలో వండవచ్చని తెలిపారు.  ఇక కావలసింది పెద్ద ఎత్తున వీటి ఉత్పత్తి.  ఎక్కువ సమయం వంటలు  చేసే ప్రదేశాలు, వంటగదులను ఈ కుకింగ్‌కు మార్చడంపై తమ ప్రాధాన్యత ఉన్నట్టు ఆయన తెలిపారు.
 రోజుకు 8నుంచి 10 గంటలు వంటలు చేసే ప్రదేశాలపై దృష్టిపెట్టినట్టు చెప్పారు.  పూర్తిస్థాయిలో వంటగదులను ఈ కుకింగ్‌కు మార్చడం కన్న వారు ఎలక్ట్రిక్‌ కుక్కర్ల ద్వారా కనీసం 50 శాతం ఈ కుకింగ్‌కు మారవచ్చన్నారు. దీనివల్ల వారు ఈ కుకింగ్‌ విషయంలో నమ్మకాన్ని పొంది క్రమంగా పూర్తి స్థాయిలో పరివర్త న చెందవచ్చన్నారు.

ఈ కుకింగ్‌ తో అటు విద్యుత్‌ రంగానికి, ఇటు వినియోగదారులకు మేలు :
సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు 7.1 పై మాట్లాడుతూ , డైరక్టర్‌ జనరల్‌, 2.1 బిలియన్‌ మంది ప్రజలు పరిశుభ్రమైన వంట వండకానికి నోచుకోలేకపోతున్నారని అన్నారు. వారు హానికరమైన  వంట పరిస్థితులను ఎదుర్కొంటున్నారన్నారు. ఈ `కుకింగ్‌ ను ప్రోత్సహించడమంటే, సుస్థిరాభివృద్ధి లక్ష్యాల దిశగా సహజసిద్ధంగా ముందుకు వెళ్లడమే నని అన్నారు.వీటిని 2030 నాటికి చేరుకోవలసి ఉందన్నారు.  తొలిదశలో సార్వత్రికంగా విద్యుత్‌ అందుబాటులో ఉండేట్టు చూడడం జరిగింది.  చాలావరకు మన ఇళ్లలో ఎల్‌.పి.జి కనెక్షన్‌లు ఉన్నాయి. ఇందుకు ఉజాల పథకానికి ధన్యవాదాలు. మనం ఈ కుకింగ్‌ దిశగా పరివర్తన చెందుతున్నపుడు, ఇది మరింత పరిశుభ్రమైన ఇంధనం కానుంది.  విద్యుత్‌ కుకింగ్‌ అనేది భవిష్యత్తు. ఇక్కడ వినియోగదారు  పాత్ర ఎంతో ముఖ్యమైనది.  ఈ కుకింగ్‌ ఇంధనాన్ని పొదుపు చేస్తుంది కూడా.  మొత్తంగా చెప్పుకున్నపుడు, మనం నగరాలనుంచి మొదలుపెట్టి, క్రమంగా టైర్‌ 2, టైర్‌ 3 పట్టణాలు, ఆ తర్వాత గ్రామాలకు ఈ పరివర్తనను తీసుకువెళ్లాలని చెప్పారు. 2030 నాటికి ఈ ` కుకింగ్‌ అటు విద్యుత్‌ రంగానికి, ఇటు వినియోగదారులకు మేలు చేకూర్చనున్నదని డైరక్టర్‌ జనరల్‌ తెలిపారు.
 ఈ `కుకింగ్‌ దిశగా పరివర్తనతో జీవన ప్రమాణాల పెంపు, కార్బన్‌ ఉద్గారాల తగ్గింపు, ఇంటిలోపలి వాయునాణ్యత పెంపు:
సిఎల్‌ఎఎస్‌పి కి చెందిన సీనియర్‌ డైరక్టర్‌ బిశాల్‌ థాపా మాట్లాడుతూ, మనం ఈ రోజు 50 వ ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని చెప్పారు. ఇది నిర్ణయాత్మక పరివర్తనాత్మక కార్యాచరణకు తగిన సమయమని చెప్పారు.  ఈ ` కుకింగ్‌కు పరివర్తన ఇందుకు అవకాశం కల్పిస్తోందన్నారు.  మిషన్‌ లైఫ్‌ గురించి ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించడం గురించి తెలియజేస్తూ, మిషన్‌ లైఫ్‌ దార్శనికతతో కూడినదని, గొప్ప కార్యక్రమమని అన్నారు. ఈ కుకింగ్‌కు పరివర్తన  పరిశుభ్రమైన, దార్శనికతతో కూడిన, హరితమయమైన ,పర్యావరణ హితకర జీవనవిధానానికి వీలు కలిగిస్తుందన్నారు. ఈ `కుకింగ్‌ అవకాశాలు కేవలం గ్రామీణ ప్రాంతాలలోనే ఎక్కువగా ఉండడం కాక పట్టణ ప్రాంతాలలోని వాణిజ్యప్రాంతాలలోనూ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. ఈ `కుకింగ్‌కు పరివర్తన వల్ల ఇంధన దిగుమతులపై ఆధారపడడం తగ్గుతుందని, సరఫరా ఇబ్బందులు తొలగుతాయని చెప్పారు. మొత్తంగా, ఇంధన పరివర్తన జీవన ప్రమాణాలను పెంచుతుందని , కార్బన్‌ ఉద్గారాల విడుదలను తగ్గిస్తుందని, ఇంటిలోపల గాలి నాణ్యతను పెంపొందిస్తుందని చెప్పారు.

సిఎల్‌ఎఎస్‌పి సీనియర్‌ డైరక్టర్‌ మాట్లాడుతూ, ఈ `కుకింగ్‌ దిశగా పరివర్తనలో వినియోగదారుల చైతన్యం మరింతగా అవసరమని చెప్పారు. వినియోగదారుల చాయిస్‌లను ప్రోత్సహిస్తూ, అదనపు సరఫరాలను అందిస్తుందన్నారు. ఇంధన పరివర్తన దిశగా నూతన భాగస్వామ్యాలు ప్రస్తుతం అవసరమని చెప్పారు.
ఈ సమావేశంలో మిషన్‌ లైఫ్‌ కు సంబంధించి ప్రతిజ్ఞ చేపట్టారు.  పర్యావరణ హితకర జీవన విధానాన్ని అన్ని రూపాలలో అందిపుచ్చుకునేందుకు, ఇతర ప్రజలకు దీనిని తెలియజెప్పేందుకు ప్రతిజ్ఞ చేశారు.
బిఇఇ కార్యదర్శఇ, మిలింద్‌ దియోరా వందన సమర్పణతో ప్రారంభ సమావేశం ముగిసింది.
ఈ కుకింగ్‌ మిషన్‌ లైఫ్‌ కు కీలకం:

ఈ `కుకింగ్‌ అనేది మిషన్‌ లైఫ్‌కు (లైఫ్‌ స్టయిల్‌ ఇన్‌ ఎన్విరాన్‌మెంట్‌) కీలకమైనది. ఇండియా నాయకత్వంలో ముందుకు సాగే అంతర్జాతీయ ప్రజా ఉద్యమం ఇది. పర్యావరణాన్ని కాపాడేందుకు వ్యక్తులు, సమాజం ఒక ఉద్యమంగా కార్యాచరణతో స్పందించేందుకు సంబంధించినది ఇది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, దీనిని ఐక్యరాజ్యసమితి పర్యావరణ మార్పు 26వ సదస్సు`కాప్‌ 25 సందర్భంగా 2021లో గ్లాస్గోలో ప్రారంభించారు. మిషన్‌ లైఫ్‌ అనేది వ్యక్తులను, భూగోళ పర్యావరణ పరిరక్షణకు సానుకూల మైన వ్యక్తులుగా మారుస్తుంది. వీరు సుస్థిర జీవన విధానాలను అనుసరించి చూపుతారు.
ఇండియా ఇంధన పరివర్తనలో స్వచ్ఛ ఇంధనం అందుబాటులో ఉండడం ఎంతో కీలకమైనది.వంట ఇంధనానికి సంబంధించి ఇండియా ఎంపిక దేశసుస్థిర ఆర్థిక వ్యవస్థకు సంబంధించి చెప్పుకోదగిన ప్రభావాన్ని చూపనుంది. భారతదేశపు క్లీన్‌ కుకింగ్‌ పరివర్తన చెందడానికి,వ్యక్తులు, సమాజం స్థాయిలో పునరాలోచన అవసరం ఉంది. వారు తీసుకునే నిర్ణయాలు ఇంధన వినియోగం పై ప్రభావాన్ని చూపుతాయి.

ఈ `కుకింగ్‌ పరిష్కారాలకు సంబంధించిన విధానాలపై చర్చ:
ఈ `కుకింగ్‌ పరివర్తనకు సంబంధించి వినియోగదారు ఆధారిత విధానాలపై నిర్వహించిన ఒక రోజు సదస్సులో , ఈ కుకింగ్‌ పరిష్కారాలైన ఫైనాన్స్‌, డిమాండ్‌ అగ్రిగేషన్‌, కార్బన్‌ క్రెడిట్స్‌, బిజినెస్‌ నమూనాలను చర్చించారు. ఈ సదస్సు వినియోగదారు ఆధారిత విధానాలను, ఈ కుకింగ్‌ పరివర్తనలో వినియోగదారు వైఖరులపై కూడా మేధో మధనం చేసింది.  ఈ సదస్సులో ఇంధన సమర్ధతా సేవల లిమిటెడ్‌ ఈ కుకింగ్‌ మార్కెట్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ కార్యక్రమంపై ప్రజెంటేషన్‌ ఇచ్చింది. అలాగే ఈ `కుకింగ్‌ కు ప్రోత్సాహంపై బిఇఇ చేపట్టిన చర్యలపై ప్రజెంటేషన్‌  ఇచ్చింది.

ఇది కూడా చదవండి:
ఎలక్ట్రిక్‌ కుకింగ్‌ దిశగా ఇండియా పరివర్తన: ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా నిర్వహించనున్న సదస్సు. ఈ` కుకింగ్‌ పరివర్తన విషయంలో వినియోగదారు కేంద్రిత విధానాల అన్వేషణ.


(Release ID: 1930335) Visitor Counter : 164