హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కేరళలోని కోచిలో అమృతా హాస్పిటల్ రజతోత్సవాలలో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించిన, కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా .


‌‌–ఒడిషాలో జరిగిన రైలు ప్రమాదాఘటనలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు సంతాపం తెలిపిన శ్రీ అమిత్ షా.

–ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 9 సంవత్సరాలలో దేశంలో సమగ్ర దృష్టితో ఆరోగ్య రంగంలో
గొప్ప మార్పు వచ్చింది.

–స్వచ్ఛభారత్ అభియాన్, ఫిట్ ఇండియా మిషన్ , న్యూట్రిషన్ మిషన్, మిషన్ ఇంధ్రదనుష్, ఆయుష్మాన్ భారత్, జల్ జీవన్

మిషన్ వంటి పథకాలను శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలోని ప్రభుత్వం చేపట్టింది. ప్రజలను ఆరోగ్యవంతులుగా ఉంచేందుకు
వైద్య విద్యా మౌలికసదుపాయాల రంగంలో పెద్ద ఎత్తున ప్రగతి సాధించడం జరిగింది.

–125 పడకలతో ప్రారంభమైన అమృతా హాస్పటల్ ఇవాళ ప్రపంచంలోనే అత్యుత్తమ ఆస్పత్రులలో ఒకటిగా నిలిచింది. ఇందులో 1350 పడకలు ఉన్నాయి.
ఇది పేషెంట్లకు అత్యంత నాణ్యమైన సేవలు అందించడంలో , ప్రేమను పంచడంలో, వినూత్న ఆవిష్కరణలలో పేరు తెచ్చుకుంది. ఇండియాలో
ప్రముఖ ఆరోగ్య కేంద్రాలలో ఇది ఒకటి.

– ఆధ్యాత్మికత, సంప్రదాయం, సంస్కృతి, సేవల రంగంలో గత 5 దశాబ్దాలుగా అమ్మ చేస్తున్న కృషి అపారం. అందువల్లే
సనాతన సంస్కృతికి భారతదేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా అమ్మ మంచి పేరు తెచ్చారు.

–ప్రపంచవ్యాప్తంగా గల

Posted On: 04 JUN 2023 7:52PM by PIB Hyderabad

కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా ,ఈరోజు కేరళలో అమృతా హాస్పిటల్ రజతోత్సవాలలో ముఖ్యఅతిథిగా పాల్గొని
ప్రసంగించారు. తన ప్రసంగం ప్రారంభంలోనే శ్రీ అమిత్ షా, ఒడిషాలో రైలు ప్రమాదంలో  మరణించిన వారి కుటుంబాలకు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.
తను ఎప్పుడు కేరళవచ్చినా ఎంతో ప్రశాంతత, సంతోషం అనిపిస్తుందని శ్రీ అమిత్ షా అన్నారు.
తాను తన జీవితంలో ఎన్నో మార్లు అమ్మను కలుసుకున్నానని, వారిని కలుసుకున్న ప్రతిసారీ, వారి నుంచి తనకు కొత్త శక్తి, చైతన్యం వచ్చినట్టు ఉంటుందని చెప్పారు.

అమ్మ తన అనురాగాన్ని , ప్రేమను ప్రపంచంలోని కోట్లాదిమందికి పంచుతున్నారని అన్నారు. అమ్మ తనను కలసిన ప్రతి ఒక్కరి జీవితంలో నిజమైన

 ప్రేమను, మానసిక ప్రశాంతతను కల్పిస్తున్నారని అన్నారు. అమ్మ చేస్తున్న మంచిపనులను గుర్తుచేసుకోవడానికి తాను ఈరోజు ఇక్కడికి వచ్చినట్టు ఆయన తెలిపారు.
ఆధ్యాత్మికత, సంస్కృతి,  సంప్రదాయాలు,సేవా రంగాలలో గత 5 దశాబ్దాలుగా అమ్మ సాగిస్తున్న కృషితో ప్రపంచ వ్యాప్తంగా సనాతన సంస్కృతిని కొనియాడుతున్నారని అన్నారు.
భారతీయ సనాతన సంస్కృతి, సంప్రదాయానికి కొత్త కోణాన్ని అమ్మ జోడించారని ఇందులోని మంచి
 విషయాలను ఆమె ప్రపంచవ్యాప్తంగా తెలియజేశారని శ్రీ అమిత్ షా అన్నారు.

అమ్మ తమ జీవితంలో ప్రాంరంభించిన ప్రతి పనీ విజయవంతమే. అందుకు ఈ సంస్థే గొప్ప ఉదాహరణ అని అమిత్‌ షా అన్నారు.  125 పడకలతో ప్రారంభమైన ఈ సంస్థ ప్రస్తుతం 1350 పడకల సామర్ధ్యం కలిగి ఉందని అన్నారు.  ఈ సంస్థ పేషెంట్లకు అద్భుతమైన సేవలు అందించేందుకు ఉద్దేశించినదని ప్రేమ ఆప్యాయతతో వారు సేవలు అందిస్తున్నారని అన్నారు. అలాగే భారతదేశంలో అత్యుత్తమ సేవలు అందిస్తున్న వాటిలో ఇది ఒకటని ఆయన అన్నారు. ఈ సంస్థ సాధించిన విజయాలను ప్రస్తావిస్తూ శ్రీ అమిత్‌ షా, ఆరోగ్య రంగంలో నవశకం ఆరంభమైందని చెప్పారు. ఇవాళ అమ్మ ఆశీస్సులతో కోచి క్యాంపస్‌, అమృత్‌ పురి క్యాంపస్‌ లలో అధునాతన సేవలు అందిస్తున్నట్టు చెప్పారు.  దీని మొత్తం విస్తీర్ణం 1.85 లక్షల  చదరపు అడుగులకు పైగా ఉంటుందని అన్నారు. అమృత మల్టీడిసిప్లినరీ రిసెర్చి ఇన్నొవేషన్‌, ట్రాన్స్‌లేషన్‌ హబ్‌ అంతర్జాతీయంగా పరిశోధన రంగంలో  ప్రతిష్ఠాత్మక సంస్థగా రూపుదిద్దుకుందని అన్నారు . అమృతపురిలో 1.85 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ సంస్థలు ఏర్పాటు కానున్నట్టు ఆయన చెప్పారు. అలాగే 20 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో చికాగోలో, 3 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఫరీదాబాద్‌ లో , పదిలక్షల చదరపు అడుగుల వీస్తీర్ణంలో కోచీలో ఈ సంస్థలు ఏర్పాటు కానున్నట్టు చెప్పారు.

కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్‌ షా మాట్లాడుతూ, ఈరోజు అమృతా ఆస్పత్రులు సేవా రంగంలో మహాద్భుత 25 సంవత్సరాలను పూర్తి చేసుకుంటున్నాయని చెప్పారు. 1998 నుంచి 2023 వరకు సుమారు 20 లక్షల మందికి పైగా పేషెంట్లకు ఈ ఆస్పత్రులు పూర్తిగా ఉచిత చికిత్స అందించినట్టు ఆయన తెలిపారు. 20 లక్షల మంది అత్యంత అవసరం ఉన్న పేషెంట్లకు  అమృత ఆస్పత్రి సేవలు అందించి వారి జీవితాలకు ఆశాకిరణంగా నిలిచిందని ఆయన అన్నారు. ఉచిత వైద్యానికి 800 కోట్ల రూపాయలు వెచ్చించారని, దీనిని బట్టి సేవా పరమోధర్మ అనే భారతీయ దాతృత్వం ఎంత గొప్పదో తెలుస్తోందని ఆయన అన్నారు.
అమ్మ సంస్థలలో ఈసూక్తిని ఆచరణాత్మకంగా అమలు చేసి చూపిస్తున్నారని ఆయన కొనియాడారు. అమ్మ అందిస్తున్న సేవల స్ఫూర్తితో వైద్య రంగంలో ఎన్నో నూతన ఆరంభాలను ఈ సంస్థ సుసాధ్యం చేసిందని ఆయన అన్నారు. అమృత ఆస్పత్రులు తొలి మైక్రో బ్లడ్‌ స్టెమ్‌ సెల్‌ ట్రాన్స్‌ ప్లాంట్‌ను ఇండియాలో చేపట్టిందని చెప్పారు. తొలి పూర్తిస్థాయి రోబోటిక్‌ లివర్‌ ట్రాన్స్‌ప్లాంట్‌, తొలి రోబోటిక్‌ మోకాలు కీలు మార్పిడి వంటివి సుసాధ్యం చేశారన్నారు. తొలి మెడికల్‌ 3 డి ప్రింటింగ్‌ సదుపాయాన్ని ఇండియాలో అందుబాటులోకి తెచ్చింది ఈ సంస్థేనని , ప్రపంచంలోనే ఇది తొలిసారి అని ఆయన చెప్పారు. 2022లో  అత్యంత చిన్న కృత్రిమ గుండె మార్పిడిని ఈ సంస్థ చేపట్టిందని కూడా శ్రీ అమిత్‌ షా తెలిపారు.

 ‘‘ అసంతృప్తి అనేది నిజమైన పేదరికమని, సంతృప్తి అనేదే అసలైన సంపద’’ అని అమ్మ చెప్పారని శ్రీ అమిత్‌ షా అన్నారు. అందువల్లే మాజీ రాష్ట్రపతి దివంగత ఎపిజె అబ్దుల్‌ కలాం, అమృతాపురి నుంచే తాను సేవల చేయడం నేర్చుకున్నానని చెప్పారని ఆయన గుర్తుచేశారు. అమ్మ చూపిన ఈ విలువలు ఎంతోమందికి ప్రేరణగా నిలవడమే కాక, నాలుగు కోట్ల మంది జీవితాలలో కొత్త ఆశలు, ప్రేమ, చిగురింప చేశాయని ఆయన అన్నారు.
ఇలాంటి గొప్ప విజయాలు సాధిస్తూ 50 సంవత్సరాలుగా సేవలు అందించిన అమ్మలో గొప్ప వినమ్రతను మనం చూస్తామని ఆయన అన్నారు. అమ్మ సేవలు ఇండియాకు మాత్రమే పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్తమయ్యాయ’’ని ఆయన అన్నారు.

2001 గుజరాత్ భూకంపం అనంతరం, అమ్మ పౌండేషన్, భూకంపాలను తట్టుకుని నిలబడగలిగే 1200 కు పైగా ఇళ్లను రెండు గ్రామాలలో నిర్మించిందని ఇప్పటికీ ఈ గ్రామాలను అమ్మ గ్రామాలుగా పిలుస్తారని
శ్రీ అమిత్ షా తెలియజేశారు. ఇలాంటి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయని ఆయన తెలిపారు. 2015లో నేపాల్లో భూకంపం సంభవించినపుడు, 2014లో జమ్ము కాశ్మీర్లో వరదలు సంభవించినపుడు, 2014లో ఫిలిప్పీన్స్ తుపాను సమయంలో, 2004లో ఇండియా, శ్రీలంకలలో సునామీ సంభవించినపుడు, ఇలా ప్రతిసారీ అమ్మ తన అనుచరులతో కలిసి బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు  ముందుంటూ వచ్చారని తెలిపారు.
ఇండియాలో స్వచ్ఛతా అభియాన్ను వేగవంతం చేసేందుకు అమ్మ 200 కోట్ల రూపాయలు ఇచ్చారని , ఇందులో 100 కోట్ల రూపాయలు గంగా నది ఒడ్డున గ్రామాలలో టాయిలెట్ల నిర్మాణానికి  ఇచ్చారని, మరో 100 కోట్ల రూపాయలు కేరళలో టాయిలెట్ల నిర్మాణానికి ఇచ్చారని వారు తెలిపారు.
ఇవి కాక 45 ,000 ఇళ్ల నిర్మాణం, ప్రతి ఏటా కోటి మంది పేద ప్రజలకు ఆహారధాన్యాలు సమకూర్చడం వంటివి అమ్మ చేస్తున్నారన్నారు.
  ఈ ఏడాది ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అని తెలియజేస్తూ శ్రీ అమిత్ షా, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
నాయకత్వంలో  గత 9 సంవత్సరాలలో దేశంలో ఆరోగ్య రంగంలో పెనుమార్పు సంభవించిందని, ఇది సమగ్ర దృక్పథంతో కూడినదని ఆయన తెలిపారు.
స్వచ్ఛ భారత్ అభియాన్, ఫిట్ ఇండియా మిషన్, న్యూట్రిషన్ మిషన్, మిషన్ ఇంధ్ర ధనుష్, ఆయుష్మాన్ భారత్,  జల్ జీవన్ మిషన్ వంటి కార్యక్రమాలను ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం తీసుకువచ్చిందని తెలిపారు.
దేశంలోని 60 కోట్ల మంది ప్రజలకు 5 లక్షల రూపాయల వరకు ఆరోగ్య ఖర్చును భరించ నవసరం లేకుండా ఆయుష్మాన్ భారత్ పథకం కింద  ఉచితంగా అందే ఏర్పాటు చేసినట్టు ఆయన తెలిపారు. వైద్య విద్యా రంగంలో మౌలికసదుపాయాల అభివృద్ధికి ఎన్నో చర్యలు తీసుకున్నారన్నారు.2013–14 సంవత్సరంలో దేశంలో 387 వైద్య కళాశాలలు ఉండగా, ప్రస్తుతం 648 వైద్య కళాశాలలు ఉన్నాయన్నారు.  ఎం.బి.బి.ఎస్ సీట్లు 51 వేల నుంచి 99,000 కు పెరిగాయని ఆయన తెలిపారు.
మరోవైపు పోస్టు గ్రాడ్యుయేట్ మెడికల్ సీట్లు 31 వేల నుంచి 64,000కు పెరిగాయన్నారు. దేశవ్యాప్తంగా 22 కొత్త ఎయిమ్స్ ఆస్పత్రులు ఏర్పాటయ్యాయని చెప్పారు. కోవిడ్ –19 మహమ్మారి సమయంలో, ఇండియాలోనే తయారైన 230 కోట్ల  కరోనా వాక్సిన్ లను 130  కోట్ల మందికి వేయగలిగినట్టు తెలిపారు.
 అమ్మ ఆశీస్సులతో ఈ సంస్థ స్వర్ణోత్సవాలను, శత వసంతాలను అత్యంత వైభవంగా జరుపుకోగలదన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు.

***


(Release ID: 1930096) Visitor Counter : 169