మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ
పోషణ్ అభియాన్ కింద "పోషన్ ట్రాకర్ & ఎత్తు/బరువు కొలత"పై గౌహతిలో ఓరియంటేషన్ శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించిన ఎన్‌ఐపిసిసిడి
ఇండోర్‌లో జరిగిన సక్షం అంగన్‌వాడీ స్కీమ్‌లోని కార్యకర్తలకు మిషన్ పోషణ్ 2.0 కింద ఏడబ్ల్యూసిలో చైల్డ్ అసెస్‌మెంట్ స్ట్రాటజీస్‌పై శిక్షణ
Posted On:
01 JUN 2023 2:39PM by PIB Hyderabad
మే 29 నుండి 31 వరకు గౌహతిలోని ఎన్‌ఐపిసిసిడి ప్రాంతీయ కేంద్రంలో అంబ్రెల్లా ఐసిడిఎస్ కింద అంగన్‌వాడీ సేవల పథకంలో పనిచేసే వారి కోసం "పోషన్ ట్రాకర్ & ఎత్తు/బరువు కొలత"పై ఓరియంటేషన్ శిక్షణా కార్యక్రమం నిర్వహించబడింది.
పోషన్ ట్రాకర్ అనేది అంగన్‌వాడీ సెంటర్ (ఏడబ్ల్యూసి) కార్యకలాపాలను మరియు సేవా డెలివరీని వీక్షించడానికి అంగన్‌వాడీ కార్యకర్తలకు (ఏడబ్ల్యూడబ్ల్యూలు) అందించబడిన యాప్ అభివృద్ధి చెందిన సిస్టమ్ అన్ని ఏడబ్ల్యూసిలు,ఏడబ్ల్యూడబ్ల్యూలు మరియు లబ్ధిదారుల యొక్క నిజ సమయ పర్యవేక్షణ మరియు ట్రాకింగ్‌ను ఇది అనుమతిస్తుంది.
ఇండోర్‌లోని ఎన్‌ఐపిసిసిడి రీజినల్ సెంటర్‌లో మే 30 నుండి 31 వరకూవరకు సక్షం అంగన్‌వాడీ స్కీమ్‌లో పనిచేసే వారి కోసం"ఏడబ్ల్యూసిలలో పిల్లల అంచనా వ్యూహాలు"పై శిక్షణా కార్యక్రమం నిర్వహించబడింది. 32 మంది పార్టిసిపెంట్లు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
కార్యక్రమ ముఖ్యాంశాలు:
- అసెస్‌మెంట్ మరియు రిపోర్టింగ్ సూత్రాలు
- మదర్ అండ్ చైల్డ్ ప్రొటెక్షన్ కార్డ్ వాడకం
- డబ్ల్యూహెచ్‌ఓ గ్రోత్ చార్ట్
- చైల్డ్ అసెస్‌మెంట్ కార్డ్
***
(Release ID: 1929126)
Visitor Counter : 190