కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
"అంతర్జాతీయ ట్రాఫిక్ నిర్వచనం"పై ట్రాయ్ జారీ చేసిన సంప్రదింపుల పత్రంపై స్పందనలు/ప్రతిస్పందనలు స్వీకరించే గడువు తేదీలు పొడిగింపు
Posted On:
30 MAY 2023 3:36PM by PIB Hyderabad
'టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా' (ట్రాయ్), ఈ నెల 02వ తేదీన, “అంతర్జాతీయ ట్రాఫిక్ నిర్వచనం”పై ఒక సంప్రదింపుల పత్రాన్ని విడుదల చేసింది. సంప్రదింపు పత్రంలో పేర్కొన్న అంశాలపై వాటాదార్ల నుంచి రాతపూర్వక స్పందనలు స్వీకరించడానికి చివరి తేదీని ఈ నెల 30గా, ప్రతిస్పందనల కోసం చివరి తేదీని జూన్ 13గా నిర్ణయించింది.
స్పందనలు సమర్పించే సమయం పొడిగించాలని పరిశ్రమ సంఘాలు చేసిన అభ్యర్థనను దృష్టిలో ఉంచుకుని, రాతపూర్వక స్పందనలు & ప్రతిస్పందనల చివరి తేదీని వరుసగా జూన్ 20, 2023 & జులై 04, 2023 వరకు పొడిగించాలని నిర్ణయించింది.
రాతపూర్వక స్పందనలు & ప్రతిస్పందనలను శ్రీ అఖిలేష్ కుమార్ త్రివేది, సలహాదారు (నెట్‌వర్క్, స్పెక్ట్రమ్ & లైసెన్సింగ్), ట్రాయ్‌కి పంపవచ్చు. ఎలక్ట్రానిక్ రూపంలో advmn@trai.gov.in ఐడీకి పంపాలి. ఈ విషయానికి సంబంధించి మరింత స్పష్టత లేదా సమాచారం కోసం శ్రీ అఖిలేష్ కుమార్ త్రివేదిని +91-11-23210481 టెలిఫోన్ నంబర్ ద్వారా సంప్రదించవచ్చు.
*****
(Release ID: 1928317)
Visitor Counter : 214