వ్యవసాయ మంత్రిత్వ శాఖ

ప్రధాన పంటలకు సంబంధించి మూడవ ముందస్తు దిగుబడి అంచనాలు విడుదల చేసిన కేంద్ర మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్


2022–23 సంవత్సరానికి 330.54 లక్షల టన్నుల ఆహరధాన్యాల దిగుబడి రాగలదని అంచనా: శ్రీ తోమర్

రికార్డు స్థాయిలో వరి, గోధుమలు, సోయాబీన్, మొక్కజొన్నలు,ఆవాలు, రాప్సీడ్ ,చెరకు పంట దిగుబడి రానుంది: కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి

వ్యవసాయరంగం రోజురోజుకూ అభివృద్ధి చెందుతోంది. శాస్త్రవేత్తల సమర్ధత, రైతుల నిరంతర శ్రమ, ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు అనుకూల విధానాల వల్ల ఇది సాధ్యమౌతోంది
: శ్రీ తోమర్

Posted On: 25 MAY 2023 6:03PM by PIB Hyderabad

2022‌‌–23 పంట  కాలానికి సంబంధించి ప్రధాన పంటల విషయంలో మూడవ ముందస్తు దిగుబడి అంచనాలను కేంద్ర వ్యవసాయ , రైతు సంక్షేమ శాఖమంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత వ్యవసాయ సంవత్సరంలో  3305.34 లక్షల టన్నుల ఆహారధాన్యాల దిగుబడి రానున్నట్టు అంచనావేస్తున్నట్టు తెలిపారు.
వ్యవసాయ రంగం రోజు రోజుకూ పురోభివృద్ది సాధిస్తున్నదని, రైతుల నిరంతర శ్రమ, శాస్త్రవేత్తల సమర్ధత, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో  ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు అనుకూల విధానాలే ఇందుకు కారణమని ఆయన అన్నారు.


వివిధ రాష్ట్రాల నుంచి అందిన సమాచారం ఆధారంగా ఈ దిగుబడి అంచనాలను రూపొందించినట్టు మంత్రి తెలిపారు.
ఈ సమాచారాన్ని ఇతర సమాచారంతో పోల్చి చూసుకున్నట్టు ఆయన చెప్పారు.  రాష్ట్రాలనుంచి , ప్రత్యామ్నాయ మార్గాలనుంచి వచ్చే సమాచారం ఆధారంగా, ఎప్పటికప్పుడు దీనిని
సవరించనున్నట్టు ఆయ తెలిపారు.
మూడవ ముందస్తు దిగుబడి అంచనాల ప్రకారం 2022–23 సంవత్సరానికి వివిధ ప్రధాన పంటల దిగుబడి కింది విధంగా ఉండనుంది.
ఆహార ధాన్యాలు – 3305.34 లక్షల టన్నులు (రికార్డు)
ధాన్యం _ 1355 లక్షల టన్నులు (రికార్డు)
గోధుమలు ‌‌–1127.43 లక్షల టన్నులు (రికార్డు)
సజ్జలు – 111.66 లక్షల టన్నులు
న్యూట్రి,  తృణ ధాన్యాలు – 547.48 లక్షల టన్నులు
మైదా – 359.13 లక్షల టన్నులు
మొత్తం పప్పుధాన్యాలు –275.04 లక్షల టన్నులు
శనగలు – 135.43 లక్షల టన్నులు
పెసరపప్పు –37.40 లక్షల టన్నులు
నూనెగింజలు –409.96 లక్షల టన్నులు (రికార్డు)
వేరుశనగ – 102.82 లక్షల టన్నులు
సోయాబీన్ –149.76 లక్షల టన్నులు (రికార్డు)
రాప్సీడ్, ఆవాలు– 124.94 లక్షల టన్నులు (రికార్డు0
కాటన్ – 343.47 లక్షల బేళ్లు (ఒక్కొక్కటి 170 కెజీలు)
చెరకు –4943 .28 లక్షల టన్నులు (రికార్డు)
జనుము, గోగు– 94.94 లక్షల బేళ్లు (ఒక్కొక్కటి 180 కేజీలు)
2022623 మూడవ ముందస్తు అంచనాల ప్రకారం, దేశంతో మొత్తం ఆహార ధాన్యాల దిగుబడి రికార్డు స్థాయిలో 3305.34 లక్షల
 టన్నులుగా ఉండనుంది. ఇది 2021–22 సంవత్సరంతో పోలిస్తే 149.18 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి అధికం.


2022–23 లో మొత్తం ధాన్యం దిగుబడి అంచనా రికార్డు స్థాయిలో 1355.42 లక్షల మెట్రిక్ టన్నులు ఉండగలదని అంచనా.
ఇది ఇంతకు ముందు సంవత్సరం దిగుబడి కంటే 60.71 లక్షల టన్నులు అధికం.

గోధుమల దిగుబడి అంచనా దేశంలో రికార్డు స్థాయిలో 1127.43 లక్షల మెట్రిక్ టన్నులు ఉండగా ఇది గత ఏడాది ఉత్పత్తి కంటే,
50.01 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి అధికం.
మొక్కజొన్న దిగుబడి 2022623లో రికార్డు స్థాయిలో 359.13 లక్షల మెట్రిక్ టన్నులుగా ఉండనుంది. ఇది అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే,
21.83 లక్షల టన్నులు అధికం.
పోషక విలువలు కలిగిన తృణ ధాన్యాల దిగుబడి అంచనా 547.48 లక్షల టన్నులు, ఇది అంతకు ముందు సంవత్సరం కంటే 36.47 లక్షల టన్నులు  అధికం.
పెసరపప్పు దిగుబడి 37.40 లక్షల టన్నులు ఉండగలదని అంచనా .ఇది ఇంతకుముందు సంవత్సరం కంటే 5.74 లక్షల టన్నుల దిగుబడి అధికం.
మొత్తం పప్పు ధాన్యాల దిగుబడి 2022–23 సంవత్సరంలో 275.04 లక్షల మెట్రిక్ టన్నులు ఉంటుందని అంచనా . ఇది అంతకు ముందు సంవత్సరం కంటే
2.02 లక్షల టన్నులు అధికం. 2021–22లో ఇది 273.02 లక్షల టన్నులు మాత్రమే.
సోయాబీన్ దిగుబడి  149.76 లక్షల టన్నులు కాగా, రాప్సీడ్, మస్టర్డ్ దిగుబడి 124.94 లక్షల టన్నులుగా ఉండనుంది.
సోయాబీన్ దిగుబడి గత సంవత్సరం కంటే 19.89 లక్షల టన్నులు, రాప్సీడ్, మస్టర్డ్ దిగుబడి గత ఏడాది కంటే 5.31 లక్షల టన్నులు అధికం కానుంది.
మొత్తం నూనెగింజల దిగుబడి దేశంలో 2022–23లో
ఏమానే 409.96 లక్షల టన్నులుగా ఉండనుంది. ఇది అంతకు ముందు సంవత్సరం కంటే 30.03 లక్షల టన్నులు అధికం.
చెరకు మొత్తం దిగుబడి 2022–23 సంవత్‌సరంలో సుమారు 4942 లక్షల మెట్రిక్ టన్నులు ఉండగలదని అంచనా.
అంతకు ముందు సంవత్సరం కంటే ఇది 548.03 లక్షల మెట్రిక్ టన్నులు అధికం కానుంది.
పత్తి దిగుబడి  ఒక్కొక్కటి 170 కెజీల బస్తాతో 343.47 లక్షల బేళ్లు ఉత్పత్తి కానుంది. అలాగే జనపనార, గోగు దిగుబడి 94.94 లక్షల బేళ్లు (ఒక్కొక్కటి 180 కేజీలవి) దిగుబడి రానుంది.
2022–23 సంవత్సరానికి  సంబంధించిన మూడవ ముందస్తు దిగుబడి అంచనాలు ఇవి.

***



(Release ID: 1927703) Visitor Counter : 186