ఆయుష్

రేపు మెగా యోగా మహోత్సవ్ కు హైదరాబాద్ సంసిద్ధం


అంతర్జాతీయ యోగా దినోత్సవం-2023 కు 25 రోజుల కౌంట్ డౌన్ సందర్భంగా 'యోగా మహోత్సవ్'

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరు కానున్న తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్

సికింద్రాబాద్ లో జరిగే 'యోగా మహోత్సవ్' మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు వేదికను సిద్ధం చేస్తుంది: సర్బానంద సోనోవాల్

యోగా మహోత్సవ్ విజయవంతం కావడం ద్వారా హైదరాబాద్ యోగా కేంద్రిత పర్యాటక కేంద్రంగా మారడానికి మార్గం సుగమం అవుతుంది: కిషన్ రెడ్డి

"అంతర్జాతీయ యోగా దినోత్సవంలో యోగా భారత్ మాల భారత సైన్యం, భారత వైమానిక దళం, కోస్ట్ గార్డ్ మరియు బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ నుండి పాల్గొంటుంది": డాక్టర్ ముంజ్పారా మహేంద్రభాయ్ కలూభాయ్

"అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజున భారత సైన్యం, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, కోస్ట్ గార్డ్ ,బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్
ప్రాతినిధ్యాన్ని ఆవిష్కరించనున్న యోగ్ భారత్ మాల‘‘: డాక్టర్ ముంజ్పరా మహేంద్రభాయ్ కాళూభాయ్

ఈ ఏడాది ఐ డి వై ఇతివృత్తం 'వసుధైక కుటుంబం కోసం యోగా'.

Posted On: 26 MAY 2023 4:53PM by PIB Hyderabad

ఆయుష్ మంత్రిత్వ శాఖ పరిధిలోని మొరాజీ దేశాయ్ నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ యోగా (ఎం డి ఎన్ ఐ వై) రేపు (2023 మే 27) సికింద్రాబాద్ ఎన్ సి సి పరేడ్ గ్రౌండ్ లో మెగా 'యోగా మహోత్సవ్'ను నిర్వహిస్తోంది. 2023 జూన్ 21న మధ్యప్రదేశ్లోని జబల్పూర్ లో జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవానికి 25 రోజుల కౌంట్ డౌన్ ప్రారంభ కార్యక్రమంగా ఈ మెగా 'యోగా మహోత్సవ్'ను  నిర్వహిస్తున్నారు. కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్, జలరవాణా, ఆయుష్ శాఖల మంత్రి సర్బానంద సోనోవాల్ హైదరాబాద్ లో విలేకరుల సమావేశం లో ఈ విషయాన్ని వెల్లడించారు.

 

ఈ సందర్భంగా శ్రీ సర్బానంద సోనోవాల్ మాట్లాడుతూ, 'వసుధైక కుటుంబం కోసం యోగా' అనే ఈ ఏడాది ఐ డి వై ఇతివృత్తాన్ని ప్రకటించారు. ఈ ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని విస్తృత ప్రణాళికలు రూపొందిస్తున్నామని శ్రీ సోనోవాల్ వివరించారు.

 

జూన్ 21న ఓషన్ రింగ్ ఆఫ్ యోగాను ఏర్పాటు చేస్తామని, రక్షణ మంత్రిత్వ శాఖ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఓడరేవులు, నౌకాయాన, జలమార్గాల మంత్రిత్వ శాఖ సహకారంతో అనేక ఓడరేవుల్లో ప్రధాన యోగా ప్రదర్శనలు నిర్వహిస్తామని, ఈ కార్యక్రమంలో అనేక దేశాలు కూడా చేరే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ఆర్కిటిక్ నుంచి అంటార్కిటికా వరకు యోగా ప్రదర్శనలు జరుగుతాయని, ప్రధాన మెరిడియన్ రేఖపై లేదా సమీపంలో ఉన్న దేశాలు యోగా ప్రదర్శనలో పాల్గొంటాయని మంత్రి చెప్పారు. ఉత్తర, దక్షిణ ధ్రువ ప్రాంతాల్లో కూడా యోగా చేయనున్నారు. ఆర్కిటిక్ లోని స్వాల్బార్డ్ లో భారత పరిశోధనా స్థావరం అయిన హిమాద్రి,  , అంటార్కిటికా లోని మూడవ భారతీయ పరిశోధనా స్థావరమైన భారతి కూడా ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది తో కలసి ఈ ఉత్సవంలో పాల్గొనే అవకాశం ఉంది. ఐఎన్ఎస్ విక్రాంత్, ఐఎన్ఎస్ విక్రమాదిత్య ఫ్లైట్ డెక్స్ లో కూడా యోగా ప్రదర్శన ఉంటుందని తెలిపారు.

 

యోగా అందరికీ బంధం వేస్తుందని, ఇది అన్ని రకాల అడ్డంకులను కరిగించడానికి సహాయపడుతుందని ఆయుష్ మంత్రి అన్నారు. యోగా లోని ఈ స్వాభావిక లక్షణం,  మన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ  అలుపెరగని కృషీ  ఫలితంగానే యోగా ప్రభావం , ప్రపంచ సమాజం దానిని ఆమోదించడం అంతకంతకూ పెరుగుతోంది. నేడు, ప్రపంచం మొత్తం యోగాను సంపూర్ణ ఆరోగ్యం ,శ్రేయస్సు కు తిరుగులేని సాధనంగా  అంగీకరిస్తోంది. రేపు ఉదయం వేలాది మంది ఈ ఆరోగ్యకరమైన మానసిక, శారీరక యోగా ఉద్యమంలో చేరతారు, ఇక్కడ వారు కామన్ యోగా ప్రోటోకాల్ (సి వై పి)ని నిర్వహిస్తారు . మానవాళి శ్రేయస్సు కోసం సందేశాన్ని పంపుతారు. వసుధైక

కుటుంబం కోసం యోగా అనే ఈ సంవత్సరం నినాదం స్పష్టమైన ప్రతిబింబాన్ని హైదరాబాద్ ప్రజలు ప్రదర్శిస్తారు, ఎందుకంటే వారి ప్రత్యేక వ్యక్తిత్వాలతో సంబంధం లేకుండా, విశ్వ సోదరభావం ,స్నేహ భావాన్ని సాధించడానికి మనమందరం ఎలా చేతులు కలపవచ్చో వారు చూపిస్తారు.

హైదరాబాద్ ప్రజల నుంచి వచ్చిన విశేష స్పందనతో 2023 జూన్ 21న మధ్యప్రదేశ్ లోని జబల్పూర్ లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు రంగం సిద్ధమవుతుంది.

.

విలేకరుల సమావేశం లో పాల్గొన్న కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖల మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి మాట్లాడుతూ, యోగా మంచి మనసుకు, శరీరానికి అమృతం వంటిది అని అన్నారు. వేలాది మంది ఇతర యోగా ఔత్సాహికులతో కలిసి మనం  చేరుతున్నప్పుడు, వేలాది మంది మెరుగైన జీవన నాణ్యతను గడిపే యుగంలోకి మనం ప్రవేశిస్తాము. ఇంకా కొత్త, దృఢమైన , సానుకూల భారతదేశాన్ని నిర్మించడాలన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ ప్రధాన దార్శనికత లలో ఒకదాన్ని నెరవేరుస్తాము.

దేశవ్యాప్తంగా యోగా మహోత్సవాలు నిర్వహించే ఈ ప్రత్యేక ప్రచారంలో హైదరాబాద్ భాగస్వామ్యం కావడం అదృష్టం. ఈ యోగా మహోత్సవ్ పట్ల సాధారణ ప్రజల్లో ఆసక్తిని రేకెత్తించడమే కాకుండా, ఈ ప్రాంతంలో యోగా ఆధారిత పర్యాటకానికి హైదరాబాద్ కేంద్రంగా మారడానికి కూడా ఈ ఉత్సవం దోహదపడుతుంది‘‘ అన్నారు.

 

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగాభారత్ మాలలో భారత సైన్యం, భారత వైమానిక దళం, కోస్ట్ గార్డ్, బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ కూడా పాల్గొంటాయని విలేకరుల సమావేశం లో పాల్గొన్న కేంద్ర మహిళా ,శిశు అభివృద్ధి ,ఆయుష్ సహాయ మంత్రి డాక్టర్ ముంజ్పారా మహేంద్ర భాయ్ కాలూభాయ్ తెలిపారు. ‘భారతదేశంలోని 2 లక్షలకు పైగా గ్రామాల్లో కామన్ యోగా ప్రోటోకాల్ (సివైపి) లో ప్రజలకు శిక్షణ ఇవ్వడానికి ఏర్పాట్లు జరిగాయి‘ అని విలేకరుల సమావేశంలో చెప్పారు.

 

యోగా మహోత్సవ్ కు కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, డోనర్ శాఖల మంత్రి జి.కిషన్ రెడ్డి , కేంద్ర మహిళా శిశు అభివృద్ధి, ఆయుష్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ ముంజ్పారా మహేంద్రభాయ్ కాలూభాయ్, ఆయుష్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి వైద్య రాజేష్ కొటేచా తదితరులు హాజరవుతారు. యోగా మహోత్సవ్ ను ఎం డి ఎన్ ఐ వై డైరెక్టర్ డాక్టర్ ఈశ్వర బసవరెడ్డి నిర్వహించనున్నారు.

 

*******



(Release ID: 1927620) Visitor Counter : 137