పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
మధ్యప్రదేశ్ అటవీ విభాగం & ఎన్‌టిసిఎకు చిరుతలను ప్రవేశపెట్టడంపై సమీక్ష, పురోగతి, పర్యవేక్షణ, సలహాలను ఇచ్చేందుకు చిరుతల ప్రాజెక్టు స్టీరింగ్ కమిటీ ఏర్పాటు
Posted On:
26 MAY 2023 12:35PM by PIB Hyderabad
మధ్య ప్రదేశ్ అదనపు ప్రధాన కార్యదర్శి (ఎసిఎస్)తో అడవుల డిజి & ఎస్ఎస్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు నేషనల్ టైగర్ కన్సర్వేషన్ అథారిటీ (ఎన్‌టిసిఎ - జాతీయ పులుల పరిరక్షణ ప్రాధికారణ సంస్థ) చిరుతల ప్రాజెక్టు స్టీరింగ్ కమిటీని (సారధ్య సంఘం) ఏర్పాటు చేసింది. ఇది చిరుతల టాస్క్ ఫోర్స్‌పై 22 సెప్టెంబర్ 2022 సరిసంఖ్య నాటి ఒ.ఎంను పక్కకు పెట్టి ఈ నిర్ణయాన్ని తీసుకుంది.
పైన పేర్కొన్న కమిటీ సభ్యులను దిగువన పేర్కొనడం జరిగిందిః
డాక్టర్ రాజేష్ గోపాల్, న్యూఢిల్లీ లోని గ్లోబల్ టైగర్ ఫోరం సెక్రెటరీ జనరల్ ః చైర్మన్
శ్రీ ఆర్.ఎన్. మెహ్రోత్రా, రాజస్థాన్ అడవులు& హెచ్ఒఎఫ్ఎఫ్/ సిడబ్ల్యుఎల్‌డబ్ల్యు, మాజీ ప్రధాన పరిరక్షకుడు ః సభ్యుడు
శ్రీ పి.ఆర్. సిన్హా, డెహ్రాడూన్‌లోని వైల్డ్‌లైఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా మాజీ డైరెక్టర్ ః సభ్యుడు
డాక్టర్ హెచ్.ఎస్. నేగీ, మాజీ ఎపిసిసిఎఫ్ వైల్డ్ లైఫ్ ః ఎన్‌టిసిఎ సభ్యుడు
డాక్టర్ పి.కె. మాలిక్, డబ్ల్యుఐఐ మాజీ ఫ్యాకల్టీ ః ఎన్‌టిసిఎ సభ్యుడు
శ్రీ జి.ఎస్. రావత్, వైల్డ్ లైఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా మాజీ డీన్/ డెహ్రాడూన్ డబ్ల్యుఐఐ సొసైటీ సభ్యుడు ః సభ్యుడు
మిస్ మిట్టల్ పటేల్, సామాజిక కార్యకర్త, అహ్మదాబాద్‌లోని విచర్త సముదాయ్ సమర్ధన్ మంచ్ (విఎస్ఎస్ఎం) వ్యవస్థాపకురాలుః సభ్యురాలు
మధ్యప్రదేశ్ అడవులు(వైల్డ్ లైఫ్) ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ & చీఫ్ వైల్డ్‌లైఫ్ వార్డెన్ ః సభ్యుడు
ప్రొఫెసర్ కమర్ ఖురేషీ, డెహ్రాడూన్‌లోని వైల్డ్ లైఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో శాస్త్రవేత్త ః సభ్‌యుడు
న్యూఢిల్లీ ఎన్‌టిసిఎ ఇనస్పెక్టర్ జనరల్ ః సభ్యుడు
శ్రీ సుభొరంజన్ సేన్, ఎపిసిసిఎఫ్ - వైల్డ్ లైఫ్ ః మెంబర్ కన్వీనర్
అంతర్జాతీయ చిరుత నిపుణులతో కూడిన కన్సల్టింగ్ ప్యానెల్ (అవసరమైనప్పుడు సలహాల కోసం)ః
ప్రొఫెసర్ ఆడ్రియన్ టోర్డిఫ్, దక్షిణాఫ్రికాలోని ప్రెటోరియా యూనివర్సిటీలో వెటరినరీ సైన్స్ ఫ్యాకల్టీ, వెటిరినరీ వైల్డ్‌లైఫ్ నిపుణుడు
డాక్టర్ లారీ మార్కర్, సిసిఎఫ్, నమీబియా
డాక్టర్ ఆండ్రూ జాన్ ఫ్రేజర్, దక్షిణాఫ్రికాలోని ఫార్మ్ ఒలీవన్‌బోష్
మిస్టర్ విన్సెంట్ వాన్‌డాన్ మెర్వేః దక్షిణాఫ్రికాలోని మెటాపాప్యులేషన్ ఇనీషియేటవ్‌లో భాగమైన చీతా మెటా పాపులేషన్ ప్రాజెక్ట్ మేనేజర్
టాస్క్‌ఫోర్స్‌కు సంబంధించిన ఉల్లేఖన నిబంధనలు ఈ విధంగా ఉన్నాయిః
మధ్యప్రదేశ్ అటవీ విభాగానికి, ఎన్‌టిసిఎలో చిరుతలను ప్రవేశపెట్టడం పై సమీక్ష, పురోగతి, పర్యవేక్షణ, సలహాలు ఇవ్వడం
పర్యావరణ- పర్యాటకం కోసం చిరుతల ఆవాసాలను/ నివాస స్థలాలను తెరవడం, ఈ విషయంలో నిబంధనలను సూచించడం.
సమాజ వినిమయం సీమపై, ప్రాజెక్టు కార్యకలాపాలలో వారిని కలుపుకుపోవడం కోసం సూచనలు.
స్టీరింగ్ కమిటీ రెండేళ్ళ కాలం ఉనికిలో ఉంటుంది. అవసరమైనప్పుడు క్షేత్ర పర్యటనలు చేయడంతో పాటుగా నెలకొకసారి సమావేశాన్ని ఏర్పాటు చేస్తుంది.
అవసరమైనప్పుడల్లా నిపుణులను సంప్రదింపుల కోసం కమిటీ ఆహ్వానించవచ్చు.
నిర్ధిష్ట అవసరం కోసం అంతర్జాతీయ చిరుత నిపుణుల ప్యానెల్‌ను సలహా కోసం సంప్రదించవచ్చు లేదా భారత్‌కు ఆహ్వానించవచ్చు.
పర్యావరణ, అడవులు, పర్యావరణ మార్పు పరిధిలోని ఎన్‌టిసిఎ ఈ కమిటీ పనిని సులభతరం చేస్తుంది.
అనధికార సభ్యుల ప్రయాణ ఖర్చులు, ఇతర యాదృచ్ఛిక ఖర్చులను నిబంధనల ప్రకారం ఎన్‌టిసిఎ భరిస్తుంది.
***
(Release ID: 1927496)
Visitor Counter : 183