ప్రధాన మంత్రి కార్యాలయం

మే 18న అంతర్జాతీయ మ్యూజియం ప్రదర్శన ప్రారంభించనున్న ప్రధాన మంత్రి


నార్త్, సౌత్ బ్లాక్స్ లో సిద్ధమవుతున్న నేషనల్ మ్యూజియం గుండా వర్చువల్ నడకను ఆవిష్కరించనున్న ప్రధాన మంత్రి

Posted On: 16 MAY 2023 6:52PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ  ఈ నెల 18 న ఉదయం పదిన్నరకు న్యూ ఢిల్లీలోని ప్రగతి మైదాన లో అంతర్జాతీయ మ్యూజియం ప్రదర్శనను ప్రారంభిస్తారు.

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో  భాగంగా 47 వ అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం సందర్భంగా ఈ అంతర్జాతీయ మ్యూజియం ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఈ ఏడాది ప్రదర్శనకు ‘మ్యూజియంలు, సుస్థిరత, సంక్షేమం’ అనే అంశాన్ని ప్రాతిపదికగా తీసుకున్నారు. మ్యూజియంల మీద ఒక సమగ్ర అవగాహన కోసం మ్యూజియం నిపుణులతో చర్చించటానికి, మ్యూజియంలను భారత సాంస్కృతిక దౌత్యంలో కీలకమైన సాంస్కృతిక కేంద్రాలుగా తీర్చిదిద్దటానికి  తీసుకోవలసిన చర్యల మీద చర్చిస్తారు.

ఈ కార్యక్రమంలో భాగంగా నార్త్, సౌత్ బ్లాక్స్ లో సిద్ధమవుతున్న నేషనల్ మ్యూజియం గుండా వర్చువల్ నడకను ప్రధాని ఆవిష్కరిస్తారు. భారతదేశ గతాన్ని, అప్పటి సాధనాలను వ్యక్తులను, చారిత్రక ఘటనలను ప్రధానంగా ప్రస్తావించటం ద్వారా భారతదేశ ప్రస్తుత నిర్మాణాన్ని చూపటమే ఈ ప్రదర్శన లక్ష్యం.

అంతర్జాతీయ మ్యూజియం ప్రదర్శన మస్కట్ ను ప్రధాని ఈ సందర్భంగా ఆవిష్కరించారు. అదే విధంగా, ఎ డే ఎట్  ది మ్యూజియం, డైరెక్టరీ ఆఫ్ ఇండియన్ మ్యూజియమ్స్, పాకెట్ మాప్ ఆఫ్ కర్తవ్య పథ్ , మ్యూజియం కార్డ్స్ ని కూడా ఆవిష్కరించారు.

నాట్యం చేసే బాలిక బొమ్మను చెన్నపట్నం కళా శైలిలో చెక్కతో రూపొందించి అంతర్జాతీయ మ్యూజియం ఎక్స్ పో మస్కట్ తయారుచేశారు. నేషనల్ మ్యూజియం ను సందర్శించే పిల్లలు అక్కడి కెరీర్ అవకాశాలు తెలుసుకోవటం మీద నవలను ఆవిష్కరిస్తారు.  భారతీయ మ్యూజియంల సమగ్ర సమాచారంతో డైరెక్టరీ రూపొందించారు. కర్తవ్య పథ్ పాకెట్ మాప్ అక్కడి వేరువేరు సాంస్కృతిక ప్రదేశాలను సూచిస్తుంది. ఆ మార్గపు విశేషాలను తెలియజేస్తుంది. కీలకమైన అంశాల చిత్రాలఓ కూడిన 75 కార్డులు కూడా ఈ సందర్భంగా ఆవిష్కకరిస్తున్నారు. అన్ని వయోవర్గాల ప్రజలకూ మ్యూజియం ను పరిచయం చేయటానికి సంక్షిప్త సమాచారం ఈ కార్డులలో ఉంటుంది.

ప్రపంచం నలుమూలలనుంచీ వచ్చే  అంతర్జాతీయ  సాంస్కృతిక కేంద్రాల ప్రతినిధులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.  

 

******



(Release ID: 1927455) Visitor Counter : 107