ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఉత్తరప్రదేశ్ లోని ఫతేపూర్ రోడ్డు ప్రమాద మృతులకు ప్రధాని నివాళి పిఎం జాతీయ సహాయ నిధి బాధితుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ప్రకటనన

Posted On: 16 MAY 2023 7:15PM by PIB Hyderabad

ఉత్తర ప్రదేశ్ లోని ఫతేపూర్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయినవారి కుటుంబాలకు ప్రధాని ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి ( పిఎం ఎన్ ఆర్ ఎఫ్) నుంచి బాధితుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.

ప్రధాన మంత్రి కార్యాలయం ఇలా ట్వీట్ చేసింది:

“ఉత్తరప్రదేశ్ లోని ఫతేపూర్ జిల్లాలో జరిగిన రోడడిఉ ప్రమాదం అత్యంత బాధాకరమైనది. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు, బంధువులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా. రాష్ట్ర ప్రభుత్వం కూడా బాధితులకు అండగా నిలుస్తుంది : పి ఎం మోదీ “

“ఈ ఫతేపూర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా యిస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు.  గాయపడిన వారికి ఒక్కొక్కరికి రూ. 50,000 చొప్పున పరిహారం  అందిస్తారు.

***


(Release ID: 1927454) Visitor Counter : 123