గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

" 100 స్మార్ట్ నగరాలు- కొత్త పట్టణ భారత దేశ అసలైన ఇంక్యుబేటర్లు" ~శ్రీ హర్దీప్ ఎస్. పూరి


స్మార్ట్ సిటీల నిర్మాణం ఒక ప్రయాణం, గమ్యం కాదు... 

~పార్లమెంటరీ సలహా సమావేశం లో శ్రీ హర్దీప్ ఎస్. పూరి

Posted On: 23 MAY 2023 12:46PM by PIB Hyderabad

గృహనిర్మాణం, పట్టణ వ్యవహారాలు, పెట్రోలియం, సహజవాయువు శాఖల మంత్రి శ్రీ హర్దీప్ ఎస్ పూరి, స్మార్ట్ సిటీస్ మిషన్ పురోగతి గురించి గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పార్ల మెంటరి సలహా ,సంప్రదింపుల కమిటీ సభ్యులకు వివరించారు. నగర స్థాయిలో స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్ పి వి ) ద్వారా మిషన్ అమలు జరుగుతోందని, ప్రాజెక్టులు పూర్తి సామర్థ్యాన్ని ఉపయోగించుకోవడానికి వాటిని పర్యవేక్షించడంలో ఈ మిషన్ ప్రధాన పాత్ర పోషిస్తుందని ఆయన పేర్కొన్నారు.

ఈ 100 స్మార్ట్ సిటీలలో అభివృద్ధి చెందుతున్న ఆవిష్కరణల నుండి భారతదేశ పట్టణ భవిష్యత్తు స్పష్టంగా కనబడుతోందని మంత్రి అన్నారు.

 

2015 జూన్ 25న ప్రారంభించిన స్మార్ట్ సిటీస్ మిషన్ 'స్మార్ట్ సొల్యూషన్స్' అన్వయింపు ద్వారా తమ పౌరులకు ప్రధాన మౌలిక సదుపాయాలు, పరిశుభ్రమైన , సుస్థిరమైన పర్యావరణం, గౌరవప్రదమైన జీవన నాణ్యతను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది.

స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేయడానికి రెండు దశల పోటీ ద్వారా ఎంపికైన 100 నగరాలు సంతృప్తికరమైన పురోగతిని కనబరుస్తున్నాయి.

(ఇమేజ్:2015 జూన్ 25న గౌరవ ప్రధాన మంత్రి చేతుల మీదుగా స్మార్ట్ సిటీస్ మిషన్ ప్రారంభం)

 

గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి నేతృత్వంలోని అపెక్స్ కమిటీ పర్యవేక్షించే స్మార్ట్ సిటీస్ మిషన్ రియల్ టైమ్ జియోగ్రాఫికల్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (జిఎంఐఎస్) ద్వారా ప్రాజెక్టుల అమలు స్థితిని క్రమం తప్పకుండా నివేదిస్తుంది.

ఎస్ సి ఎమ్ స్టేట్ మెంట్ , మార్గదర్శకాల ప్రకారం, వివిధ భాగస్వాముల మధ్య సలహాలు ,సహకారాన్ని ప్రారంభించడానికి నగర స్థాయిలో స్మార్ట్ సిటీ అడ్వైజరీ ఫోరం (ఎస్ సిఎఎఫ్) ఏర్పాటు అయింది. ఇందులో పార్లమెంటు సభ్యులు, శాసన సభ సభ్యులు, మేయర్, జిల్లా కలెక్టర్, స్థానిక యువత, సాంకేతిక నిపుణులు, ఇతర భాగస్వాములు మొదలైనవారు ఉంటారు. మొత్తం 100 స్మార్ట్ సిటీలు తమ ఎస్ సిఎఎఫ్ లను ఏర్పాటు చేశాయి. ఇప్పటి వరకు స్మార్ట్ సిటీస్ 756 ఎస్ సి ఏ ఎఫ్ సమావేశాలను నిర్వహించింది. రాష్ట్రస్థాయిలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన హైపవర్ స్టీరింగ్ కమిటీ (హెచ్ పీఎస్ సీ)ని ఏర్పాటు చేశారు. అంతేకాకుండా, బోర్డు ఆఫ్ స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్పీవీ)లోని గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నామినీ డైరెక్టర్లు ఆయా నగరాల్లో పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారు. ఇంకా, వివిధ స్థాయిలలో నగరాల పనితీరును అంచనా వేయడానికి , మెరుగుదల కోసం వాటిని అందించడానికి.రాష్ట్రాలు / స్మార్ట్ సిటీలతో వీడియో కాన్ఫరెన్స్ లు, సమీక్షా సమావేశాలు, క్షేత్ర సందర్శనలు, ప్రాంతీయ వర్క్ షాప్ లు మొదలైన వాటి ద్వారా మంత్రిత్వ శాఖ క్రమం తప్పకుండా సంభాషిస్తుంది.

 

స్మార్ట్ సిటీస్ మిషన్ వ్యూహం

 

'మండోవి రివర్ ఫ్రంట్ ప్రొమెనేడ్', 'ఫ్లడ్ మిటిగేషన్ వర్క్స్', గోవాలోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ తో సహా వివిధ ప్రాజెక్టు సైట్ లను కమిటీ సందర్శించి, 2023 మే 1 నాటికి ప్రస్తుత స్థితి , పురోగతిపై చర్చించింది, ఇందులో మిషన్ లో రూ.1.8 లక్షల కోట్ల విలువైన 7,800 ప్రాజెక్టులు ఉన్నాయని, వీటిలో 5,700+ ప్రాజెక్టులు (సంఖ్య ప్రకారం 73%) రూ.1.1 లక్షల కోట్ల విలువైనవి (73% విలువ ప్రకారం) పూర్తయ్యాయని వివరించారు. మిగిలిన ప్రాజెక్టులన్నీ 2024 జూన్ 30 నాటికి పూర్తవుతాయి. స్మార్ట్ సిటీస్ మిషన్ కింద 2023 మే 1 వరకు రూ.38,400 కోట్లు విడుదల చేశామని, అందులో రూ.35,261 కోట్లు వినియోగించామని సమావేశంలో వివరించారు.

గృహనిర్మాణం, పట్టణ వ్యవహారాలు, పెట్రోలియం, సహజవాయువు శాఖ మంత్రి శ్రీ హర్దీప్ ఎస్ పూరి అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. గృహనిర్మాణం, పట్టణ వ్యవహారాలశాఖ సహాయ మంత్రి శ్రీ కౌశల్ కిశోర్, వివిధ రాష్ట్రాల పార్లమెంటు సభ్యులు శ్రీ/ శ్రీమతి ఎంవీవీ సత్యనారాయణ, ఏకేపీ చిన్రాజ్, రమేష్ బిధురి, సంజయ్ కాకా పాటిల్, అబీర్ రంజన్ బిశ్వాస్, కల్పన సైనీ, వందనా చౌహాన్, గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ కు, చెందిన ఇతర సీనియర్ అధికారులు ఈ పార్లమెంటరీ సలహా సంఘ సమావేశానికి హాజరయ్యారు. శ్రీమతి శాలిని అగర్వాల్, కమిషనర్, సూరత్; ఇండోర్ స్మార్ట్ సిటీ సీఈఓ దివ్యాంక్ సింగ్; ఎం.ప్రతాప్, సి ఇ ఒ , కోయంబత్తూర్ స్మార్ట్ సిటీ ; ఆగ్రా స్మార్ట్ సిటీ సిఇఒ శ్రీ అంకిత్ ఖండేల్వాల్ తదితరులు ఆయా నగరాల్లో అవలంబించిన ఉత్తమ విధానాలపై అవగాహనతో కూడిన ప్రజెంటేషన్లు ఇచ్చారు.

 

మొత్తం 100 స్మార్ట్ సిటీల్లో ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లను (ఐసిసిసి) విజయవంతంగా మోహరించడంలో మిషన్ మార్గదర్శక ప్రయత్నాన్ని సహాయ మంత్రి శ్రీ కౌశల్ కిశోర్ ప్రశంసించారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం ద్వారా ఐసిసిలు మెరుగైన పరిస్థితుల అవగాహనను పెంపొందిస్తాయి .పట్టణ విధులలో పౌర అధికారులకు రోజువారీ పని / సమస్యలు / అత్యవసరాలను వివరణాత్మక ఎస్ఓపిల ద్వారా నిర్వహించడానికి ఏకీకృత విజువలైజేషన్ ను అందిస్తాయి" అని ఆయన అన్నారు.

ఈ స్మార్ట్ సిటీలకు ఐసిసిలు నాడీ కేంద్రాలుగా మారాయని, పట్టణ నిర్వహణను బలోపేతం చేయడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకుంటున్నాయని కూడా ఆయన అన్నారు.

 

శ్రీమతి కల్పనా సైనీ స్మార్ట్ సిటీస్ మిషన్ కు మరిన్ని జోడించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు; శ్రీమతి వందనా చౌహాన్ కోవిడ్-19 ,ఇతర సంక్షోభాల సమయంలో మహమ్మారిని సమర్థవంతంగా నిర్వహించడానికి ఐసిసిసి వాటి పనితీరును ప్రశంసించారు; ఈ నగరాల్లో చలనశీలత, నీరు, వ్యర్థాల నిర్వహణ వంటి కీలక రంగాల్లో నైపుణ్యం సృష్టించాల్సిన అవసరాన్ని శ్రీ ఎకెపి చిన్ రాజ్ నొక్కి చెప్పారు.; ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్, క్లైమేట్ స్మార్ట్ సిటీస్ వంటి మార్గదర్శకాలతో స్మార్ట్ సిటీ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నారని రమేశ్ బిధురి ప్రశంసించారు.

ఇంకా, ఫలితం-ఆధారిత పనులను ప్రోత్సహించడానికి, ఆదర్శప్రాయమైన కీలకమైన కార్యక్రమాలను విస్తరించడానికి ఈ మిషన్ కు విస్తృతమైన ప్రచార ప్రయత్నాల అవసరాన్ని ఆయన వివరించారు.

 

స్మార్ట్ సిటీస్ మిషన్ అమలు పట్టణాభివృద్ధి రంగంలో ఒక కొత్త శకానికి నాంది పలికింది, ఈ రంగాన్ని సంస్కరించడానికి, మెరుగైన ఆర్థిక ప్రమాణాలు, స్మార్ట్ గవర్నెన్స్, వాతావరణ-సున్నితమైన సుస్థిర వాతావరణం, శక్తివంతమైన బహిరంగ ప్రదేశాలు, డిజిటల్ ప్రాప్యత , ఆరోగ్యం - పరిశుభ్రత, తద్వారా నగరాల ఫ్రేమ్ వర్క్ ను బలోపేతం చేస్తుంది. భారత ప్రభుత్వ గృహనిర్మాణ ,పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పౌరుల సేవలో సులభతర జీవన సూచికను పెంచడానికి కట్టుబడి ఉంది.

 

రూ.1,80,000 కోట్ల ప్రాజెక్టు పరిమాణంతో అభివృద్ధి చెందుతున్న ఈ మిషన్ కింద ఉన్న ప్రాజెక్టులు అమృత్ కాల్ దిశగా భారత్ ప్రయాణంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.

 

ఈ మిషన్ ఈ స్థాయిలో , భౌగోళిక వ్యాప్తిలో అత్యంత వేగవంతమైన ప్రాజెక్ట్ అమలును చూసింది. pic.twitter.com/7CawVBEPCY

- హర్దీప్ సింగ్ పూరి (@HardeepSPuri) మే 22, 2023

*******

RJ


(Release ID: 1926688) Visitor Counter : 206