శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
ప్రభుత్వ ప్రైవేటు నిధులు వినియోగించి ఉత్పత్తులు, పేటెంట్ రంగంలో సాధించిన విజయాలు వివరిస్తూ ఏర్పాటైన ఒకరోజు ప్రదర్శన
Posted On:
23 MAY 2023 10:54AM by PIB Hyderabad
ఇంపాక్టింగ్ రీసెర్చ్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ (ఇంప్రింట్) పథకం కింద ప్రభుత్వ ప్రైవేటు నిధులు వినియోగించి ఉత్పత్తులు, పేటెంట్ రంగంలో సాధించిన విజయాలు వివరిస్తూ ఐఐటీ ఢిల్లీలో 2023 మే 22న ప్రదర్శన నిర్వహించారు. ప్రభుత్వ ప్రైవేటు నిధులు ఉపయోగించి ఉత్పత్తులు, పేటెంట్లను అభివృద్ధి చేయడానికి గల అవకాశాలు వివరిస్తూ ప్రదర్శన ఏర్పాటయింది. ఉత్పత్తులు, పేటెంట్ల కోసం ప్రైవేటు, ప్రభుత్వ నిధులు వినియోగించి విజయం సాధించడానికి గల అవకాశాలు వివరిస్తూ ప్రదర్శన జరిగింది.
ఈ సందర్భంగా మాట్లాడిన సైన్స్ అండ్ ఇంజనీరింగ్ బ్రాడ్ (SERB) కార్యదర్శి, శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖ సీనియర్ సలహాదారు డాక్టర్ అఖిలేష్ గుప్తా ఇంప్రింట్ పథకం ప్రాధాన్యత, ప్రత్యేకతలు వివరించారు. " ఇంప్రింట్ ఒక ప్రత్యేకమైన పథకం. పథకం అమలులో భాగంగా పరిశ్రమ వర్గాలతో కలిసి ప్రభుత్వం, విద్యా సంస్థలు వివిధ ఉత్పత్తులు, సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి, మార్కెటింగ్ అంశాలపై కలిసి పనిచేస్తాయి. ఈ పథకం కింద అమలు చేసిన చర్యల వల్ల అనేక సాంకేతిక, ఇతర ఉత్పత్తులకు తగిన మార్కెట్ అవకాశాలు లభించాయి" అని డాక్టర్ అఖిలేష్ గుప్తా వివరించారు.
పరిశ్రమ సహకారంతో, పరిశ్రమ అవసరాల కోసం అమలు జరిగే కార్యక్రమాలు పీపీపీ విధానంలో నూతన ప్రాజెక్టులు చేపట్టడానికి అవకాశం కల్పిస్తాయని డాక్టర్ అఖిలేష్ గుప్తా తెలిపారు. దీనివల్ల భారత పారిశ్రామిక రంగంలో నూతన ఆవిష్కరణలు అభివృద్ధి చెందుతాయని, సాంకేతిక ఆధారిత అంకుర సంస్థలకు ప్రోత్సాహం లభిస్తుందన్నారు. అంతర్జాతీయ ప్రమాణాల మేరకు ఉత్పత్తులు సాగుతాయన్నారు.
కేంద్ర శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వ శాఖ, సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ బోర్డు కలిసి ఇంప్రింట్ ప్రదర్శన ఏర్పాటు చేశాయి. ఇంప్రింట్-II కింద 10 రంగాలలో చేపట్టిన 60 ప్రాజెక్ట్‌ల ఫలితాలను ప్రోటోటైప్/పోస్టర్/ఇతర సంబంధిత ప్రదర్శనలో ఉంచారు. శాస్త్ర, విద్య,పరిశోధన రంగాలకు చెందిన దాదాపు 300 మంది ప్రతినిధులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
ప్రజలు, సమాజం ఎదుర్కొంటున్న అనేక సమస్యలను సాంకేతిక పరిజ్ఞానం సహకారంతో పరిష్కరించవచ్చునని ఢిల్లీ ఐఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ రంగన్ బెనర్జీ, తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానం వల్ల సమాజంలో మార్పులు వస్తాయన్నారు. సమస్యలను గుర్తించడానికి చర్యలు అమలు కావాలన్నారు. మార్పు తీసుకురాగల సమాజంలో సమస్యలను గుర్తించాల్సిన ఆవశ్యకతను నొక్కిచెప్పారు మరియు ఇంప్రింట్ లో లభిస్తున్న అనేక అంశాలు సామాజిక సమస్యల పరిష్కారానికి దోహదపడతాయన్నారు. ఇంప్రింట్ అందిస్తున్న సేవల పట్ల ప్రదర్శన ద్వారా అవగాహన కలుగుతుందన్నారు. విద్యా మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి శ్రీమతి సౌమ్య గుప్తా మాట్లాడుతూ ఇంప్రింట్ వంటి కార్యక్రమాలు సమాజ అవసరాలకు అనుగుణంగా అమలు జరుగుతాయన్నారు. సమస్యల పరిష్కారానికి, సమాజంపై ప్రభావం చూపించే కార్యక్రమాలు సహకారం, సమన్వయంతో అమలు జరగాలన్నారు.
పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తులు సాగించడానికి మేక్ ఇన్ ఇండియా' కార్యక్రమంలో భాగంగా 2015 నవంబర్ 5న ' ఇనిషియేటివ్ కింద ఇంపాక్టింగ్ రీసెర్చ్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ (ఇంప్రింట్) ప్రారంభమయ్యింది. పోటీతత్వాన్ని మెరుగుపరిచి ఉన్నత ప్రమాణాలతో ఆవిష్కరణలను ప్రోత్సహించి భారతీయ తయారీ పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేయడానికి ఇంప్రింట్ కృషి చేస్తోంది.
దేశ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఎంపిక చేసిన 10 రంగాల్లో ఎదురవుతున్న, ఇంజనీరింగ్ , సాంకేతిక సవాళ్లను పరిష్కరించే లక్ష్యంతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ఉత్పత్తులు, పేటెంట్లను అభివృద్ధి చేసేందుకు అవసరమైన పరిశోధన ప్రాజెక్టుల కోసం సహకార నిధులు సమీకరించడానికి పథకం ద్వారా కృషి జరుగుతోంది. పర్యావరణం, ఇంధన భద్రత, ఆరోగ్య సంరక్షణ సాంకేతిక అంశాలు, స్థిరమైన ఆవాసాలు, నీటి వనరులు, అధునాతన పదార్థాలు, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, తయారీ సాంకేతికత, నానో-టెక్నాలజీ, భద్రత,రక్షణ రంగాలను నిధుల సమీకరణ కోసం గుర్తించారు.
***
(Release ID: 1926643)
Visitor Counter : 155