ప్రధాన మంత్రి కార్యాలయం
ఉక్రెయిన్ అధ్యక్షుడితో భారత ప్రధాని సమావేశం
प्रविष्टि तिथि:
20 MAY 2023 7:01PM by PIB Hyderabad
జపాన్ దేశం హిరోషిమాలో జి-7 దేశాల శిఖరాగ్ర సమావేశ వేదిక వద్ద శనివారం ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జిలెన్స్కి తో భారత ప్రధాని సమావేశమయ్యారు.
ఉక్రెయిన్ యుద్ధంవల్ల మొత్తం ప్రపంచంపై ప్రభావం పడిందని ప్రధానమంత్రి అన్నారు. అయితే ఇది తనకు రాజకీయ లేక ఆర్ధిక సమస్య కాదని, ఇది తనకు మానవతకు, మానవ విలువలకు సంబంధించిన సమస్య అని ప్రధాని అన్నారు.
ఉక్రెయిన్ లో విద్యాభ్యాసం చేస్తున్న భారతీయ విద్యార్థులను సురక్షితంగా ఇండియాకు చేర్చడంలో సహకరించినందుకు ఉక్రేన్ ను ప్రధానమంత్రి ప్రశంసించారు.
యుద్ధం అంతం చేయడానికి జరిపే చర్చలకు, దౌత్యానికి ఇండియా స్పష్టమైన మద్దతు ఇవ్వగలదని ప్రధానమంత్రి అన్నారు. ఈ సమస్యకు పరిష్కారం కనుగొనడానికి ఇండియా, ప్రధానమంత్రి వ్యక్తిగతంగా సాధ్యమైనంత సహాయం చేయగలదని జిలెన్స్కీ కి ప్రధానమంత్రి తెలియజేశారు.
ఉక్రెయిన్ ప్రజలకు ఇండియా మానవతా సహాయాన్ని కొనసాగించగలదని ప్రధాని తెలిపారు. ఉక్రెయిన్ లో ప్రస్తుత పరిస్థితిని గురించి అధ్యక్షుడు జెలెన్సీకీ భారత ప్రధానికి వివరించారు. సంబంధాలను కొనసాగించాలని ఇరువురు అంగీకరించారు.
******
(रिलीज़ आईडी: 1926076)
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam