పౌర విమానయాన మంత్రిత్వ శాఖ

ప్రతిష్టాత్మక వింగ్స్ ఇండియా 2024 ఈవెంట్ కోసం పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కర్టెన్ రైజర్ ను నిర్వహించింది


ఆసియాలో అతిపెద్ద వాణిజ్య, సాధారణ మరియు వ్యాపార విమానయాన ఈవెంట్ జనవరి 2024లో జరగనుంది

రెగ్యులేటర్‌గా కాకుండా ఫెసిలిటేటర్‌గా మారడం ద్వారా సామర్థ్య పెంపుపై ప్రభుత్వం దృష్టి సారిస్తోంది: శ్రీ సింధియా

2047 నాటికి భారతదేశం అతిపెద్ద విమానయాన మార్కెట్‌గా అవతరించనుంది: శ్రీ సింధియా

Posted On: 19 MAY 2023 3:14PM by PIB Hyderabad

పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ & ఇండస్ట్రీ (FICCI) సహకారంతో వింగ్స్ ఇండియా 2024 ఈవెంట్ కి ప్రచారం లో భాగంగా న్యూఢిల్లీలో మే 18, 2023న కర్టెన్ రైజర్‌ను నిర్వహించింది.

 

కేంద్ర పౌర విమానయాన మరియు ఉక్కు శాఖ మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య సింధియా ఈవెంట్ మరియు ప్రోమో వీడియోను ఆవిష్కరించారు మరియు వింగ్స్ ఇండియా 2024 బ్రోచర్‌ను విడుదల చేశారు.

 

పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య ఎం. సింధియా మాట్లాడుతూ దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న విమానయాన మార్కెట్‌కు తన పాత్రను రెగ్యులేటర్ నుండి ఫెసిలిటేటర్‌గా మార్చడం ద్వారా సామర్థ్యాన్ని సృష్టించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని అన్నారు.

 

వింగ్స్ ఇండియా 2024 కోసం గురువారం న్యూఢిల్లీలో జరిగిన కర్టెన్ రైజర్ ఈవెంట్‌లో కేంద్ర పౌర విమానయాన మరియు ఉక్కు శాఖ మంత్రి ప్రసంగిస్తూ, సామర్థ్యాలను సృష్టించడం, అడ్డంకులను తొలగించడం మరియు ప్రక్రియలను సులభతరం చేయడం వంటి 3 విధాల వ్యూహాన్ని ప్రభుత్వం అవలంబించిందని, ఇది ఈ రంగం మరింత వేగంగా దూసుకుపోవడానికి సహాయపడిందని అన్నారు. గత తొమ్మిదేళ్లలో 74 విమానాశ్రయాలనుండి నేడు 148 విమానాశ్రయాలు కాగా రాబోయే మూడు, నాలుగేళ్లలో విమానాశ్రయాలు, హెలిపోర్ట్‌లు, వాటర్‌డ్రోమ్‌ల సంఖ్య 200కు పైగా పెరుగుతుందని పరిశ్రమకు ఆ దిశగా లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామన్నారు.

 

2047 నాటికి ప్రపంచంలోనే అగ్రగామి ఏవియేషన్ మార్కెట్‌గా ఎదగడానికి పరిశ్రమకు ఉన్న అవకాశాలపై తన ఆలోచనలను పంచుకున్న మంత్రి, “భారతదేశం అమృత్ కాల్ నుండి శతాబ్ది కాల్ (2047) వైపుగా ప్రయాణం చేస్తున్నప్పుడు, భారతీయ విమానయానం కూడా  మారుతుంది. మూడవ అతిపెద్ద దేశీయ మార్కెట్/పద్దెనిమిదవ అతిపెద్ద అంతర్జాతీయ మార్కెట్/ఏడవ అతిపెద్ద దేశీయ మరియు అంతర్జాతీయ మార్కెట్, ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద విమానయాన మార్కెట్‌గా అవతరించింది. దేశంలో అంతర్జాతీయ విమానయాన హబ్‌ను సృష్టించేందుకు ప్రభుత్వ నిబద్ధతను పునరుద్ఘాటిస్తూ, భారతదేశం మరియు ఇతర దేశాల మధ్య భారీ సంఖ్యలో విమాన సేవలు మరియు ఓపెన్ స్కైస్ ఒప్పందాలు ఈ వృద్ధి లక్ష్యాన్ని సులభతరం చేస్తాయని ఆయన అన్నారు.

 

పౌర విమానయాన శాఖ కార్యదర్శి శ్రీ రాజీవ్ బన్సాల్ తన ప్రసంగంలో దేశంలోని ప్రధాన విమానాశ్రయాలు అభివృద్ధి చెందుతున్నాయని, వాటిలో చాలా ఇప్పటికే విస్తరణ ప్రణాళికలను అమలు చేశాయన్నారు. ప్రస్తుతం భారతదేశం ప్రపంచవ్యాప్తంగా 100 కంటే తక్కువ గమ్యస్థానాలకు అనుసంధానించబడి ఉందని, అయితే అంతర్జాతీయ కనెక్టివిటీని మెరుగుపరచడానికి భారీ సామర్థ్య అవకాశాలు ఉన్నాయని ఆయన అన్నారు.చిన్న ఎయిర్‌క్రాఫ్ట్ సెగ్మెంట్‌లో వృద్ధి ఉందని శ్రీ బన్సాల్ తెలిపారు, “ఉడాన్ ప్రాంతీయ కనెక్టివిటీ పథకం కింద కొత్త విమానాశ్రయాలు ప్రారంభించబడుతున్నాయి మరియు ఇది టైర్ -2 మరియు టైర్ -3 నగరాల నుండి ఎక్కువ మంది దేశీయంగా విమాన ప్రయాణం చేసేలా చేస్తుంది.  భారతదేశంలో అంతర్జాతీయ హబ్‌లను సృష్టించాలనే ఈ కల త్వరలో సాకారమవుతుందని భారతీయ విమానయాన సంస్థల భారీ ఆర్డర్ సూచిస్తోందని ఆయన అన్నారు. ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ శ్రీ సంజీవ్ కుమార్, ఎయిర్‌బస్ ఎండి శ్రీ రెమి మైలార్డ్, ఫిక్కీ సెక్రటరీ జనరల్ శైలేష్ పాఠక్ మరియు ఎం ఓ సీ ఏ, ఏ ఏ ఐ నుండి అధికారులు, విదేశీ మిషన్లు మరియు పరిశ్రమల ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. వింగ్స్ ఇండియా 2024,  2024 జనవరి 18 నుండి 21వ తేదీ వరకు హైదరాబాద్‌లో జరగనుంది. కమర్షియల్, జనరల్ మరియు బిజినెస్ ఏవియేషన్‌ రంగాలకు సంంధించిన సివిల్ ఏవియేషన్‌పై ఆసియాలోనే అతిపెద్ద ఈవెంట్‌గా దీనిని భావిస్తున్నారు. వింగ్స్ ఇండియా 2024 సహకారాన్ని ప్రోత్సహించడానికి, ఆవిష్కరణలను ప్రదర్శించడానికి మరియు వ్యాపార అవకాశాలను అన్వేషించడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ లబ్దిదారులను మరియు విమానయాన పరిశ్రమ నుండి పాల్గొనేవారిని ఈ ఈవెంట్ ఒక వేదిక పైకి చేర్చుతుంది. 

 

***



(Release ID: 1925673) Visitor Counter : 197