రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ

ఆసియా పెట్రోకెమికల్ ఇండస్ట్రీ కాన్ఫరెన్స్ 2023కి అధ్యక్షత వహించిన కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా


ప్రపంచవ్యాప్తంగా పెట్రోకెమికల్స్‌కు కొత్త గమ్యస్థానంగా మారేందుకు భారతదేశం సిద్ధంగా ఉంది: డాక్టర్ మన్సుఖ్ మాండవియా

"మా వ్యాపార అనుకూల విధానాల కారణంగా ప్రపంచం భారతదేశాన్ని విశ్వసనీయ భాగస్వామిగా మరియు పెట్టుబడికి ప్రాధాన్యతా గమ్యస్థానంగా చూస్తుంది"

Posted On: 19 MAY 2023 2:55PM by PIB Hyderabad


"ప్రపంచవ్యాప్తంగా పెట్రోకెమికల్స్‌కు కొత్త గమ్యస్థానంగా మారడానికి భారతదేశం  సిద్ధంగా ఉంది. వ్యాపార అనుకూల విధానాల కారణంగా ప్రపంచం భారతదేశాన్ని విశ్వసనీయ భాగస్వామిగా మరియు పెట్టుబడికి ప్రాధాన్యతా గమ్యస్థానంగా చూస్తోంది"అని కేంద్ర రసాయనాలు మరియు ఎరువుల మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా తెలిపారు. ఈ రోజు ఇక్కడ జరిగిన ఆసియా పెట్రోకెమికల్ ఇండస్ట్రీ కాన్ఫరెన్స్ 2023కి హౌసింగ్ మరియు అర్బన్ అఫైర్స్, పెట్రోలియం మరియు నేచురల్ గ్యాస్ మంత్రి శ్రీ హర్దీప్ సింగ్ పూరి సమక్షంలో కేంద్ర రసాయనాలు మరియు ఎరువుల మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా అధ్యక్షత వహించారు. ఈవెంట్ యొక్క థీమ్ "సుస్థిరమైన భవిష్యత్తును అందించడం". ఏడు సభ్య దేశాల నుండి 1200 మంది ప్రతినిధులు అలాగే యూరప్, చైనా, అమెరికా, మిడ్ ఈస్ట్ మరియు ఇతర ఆసియా దేశాలతో పాటు కీలక దేశాల నుండి సీనియర్ ప్రభుత్వ అధికారులు అలాగే ప్రాంతీయ మరియు ప్రపంచ భాగస్వాములు ఈ సదస్సులో పాల్గొన్నారు.

 

image.pngimage.png


మేక్ ఇన్ ఇండియా మరియు మేక్ ఫర్ వరల్డ్‌పై గౌరవనీయ ప్రధాన మంత్రి చేసిన క్లారియన్ కాల్‌ను గుర్తుచేసుకుంటూ డాక్టర్ మన్సుఖ్ మాండవియా మాట్లాడుతూ..భారతీయ రసాయనాల తయారీ పరిశ్రమ నిజంగా పెట్రోకెమికల్స్ కోసం అభివృద్ధి చెందుతున్న గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌లో ఒకటిగా ఉందని చెప్పారు. “పెట్రోకెమికల్ ఉత్పత్తి మన దైనందిన జీవితంలో భాగమైపోయింది. ప్రభుత్వ జోక్యాన్ని తగ్గించడం ద్వారా మరియు పన్నును తగ్గించడం, సమ్మతి భారాన్ని తగ్గించడం మరియు విధాన మార్పుల వంటి అనేక ఇతర చర్యల ద్వారా భారత ప్రభుత్వం పరిశ్రమకు అనుకూలమై విధానాలను అవలంభిస్తోంది. తద్వారా సులభతర వ్యాపారాన్ని ప్రోత్సహిస్తోంది. రసాయనాలు మరియు పెట్రోకెమికల్స్ యొక్క ప్రపంచ సరఫరా గొలుసులో ప్రపంచంలో విశ్వసనీయ భాగస్వామి కావడానికి భారతదేశం కట్టుబడి ఉందని ఆయన తెలిపారు.

ఇంత భారీ జనాభా ఉన్న భారతదేశంలో పెట్టుబడులు పెట్టేందుకు ఇదే సరైన సమయమని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి ఉద్ఘాటించారు. “భారతదేశం పెట్టుబడి పెట్టడానికి పెద్ద మార్కెట్. మేము అనేక దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను చేసుకుంటున్నాము. కొత్త సాంకేతికతలను స్వీకరించే భారతీయుల సామర్థ్యం..కొత్తగా అభివృద్ధి చెందుతున్న నైపుణ్యం కలిగిన పారిశ్రామికవేత్త ప్రతి ప్రపంచ భాగస్వామికి కొత్త శక్తిని ఇవ్వగలరు. పెట్రోకెమికల్ లభ్యత యొక్క ప్రధాన సమస్యను పరిష్కరించడానికి దేశీయ మరియు విదేశీ వనరుల నుండి పెట్టుబడులను ఆకర్షించే విధానాలపై ప్రభుత్వం  పని చేస్తోంది. ప్రభుత్వం రసాయనాల కోసం ఉత్పత్తి అనుబంధిత ప్రోత్సాహక పథకం వంటి ముఖ్యమైన అవసరమైన మార్పులను చేసింది మరియు భారతదేశంలో కష్టతరమైన మరియు వ్యూహాత్మక రసాయనాల మధ్యవర్తుల తయారీని కూడా ప్రతిపాదించింది. సులువుగా దిగుమతి చేసుకునేందుకు, ఎగుమతి చేసుకునేందుకు కూడా భారత్ అవకాశం కల్పిస్తోందని ఆయన అన్నారు. ఇది జాయింట్ వెంచర్ల కోసం విదేశీ దేశాలకు విజయం-విజయం పరిస్థితిని అందిస్తుందని చెప్పారు.

డాక్టర్ మన్సుఖ్ మాండవియా రాబోయే 25 సంవత్సరాల ప్రభుత్వ దీర్ఘకాలిక ప్రణాళికను వివరిస్తూ భారతదేశం విధానాలను రూపొందిస్తోందని, స్థిరమైన అభివృద్ధిపై దృష్టి సారించి వర్తమానం మరియు భవిష్యత్తుకు సంబంధించి నిర్ణయాలు తీసుకుంటోందని హైలైట్ చేశారు. " లాజిస్టిక్స్ ఖర్చులను తగ్గించడానికి సమన్వయ ప్రణాళిక మరియు మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల అమలు లక్ష్యంతో ఇటీవల భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన గతి శక్తి పథకం లేదా బహుళ మోడల్ కనెక్టివిటీ ప్లాన్ కోసం నేషనల్ మాస్టర్ ప్లాన్‌ను ప్రారంభించింది. ఇది పెట్రోకెమికల్ ఉత్పత్తులను ఉపయోగించే ప్రధాన పథకం. ఇది వస్తువులు, వ్యక్తులు మరియు సేవల తరలింపు కోసం కొత్త ఊపును మరియు అవాంతరాలు లేని కనెక్టివిటీని ఇస్తుంది. పెట్రోకెమికల్ పరిశ్రమ యొక్క భవిష్యత్తు వృద్ధి పథం గణనీయంగా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మేము సరసమైన మరియు మెరుగైన లైఫ్-సైకిల్ పెట్రోకెమికల్ ఉత్పత్తులను తయారు చేయడంపై దృష్టి పెడుతున్నాము, ఇది కార్బన్ ఉత్పత్తిని తగ్గించడంలో సహాయపడుతుంది. స్టేక్ హోల్డర్లందరూ స్థిరమైన రీతిలో పని చేయాల్సిన అవసరాన్ని ఆయన మరింత నొక్కి చెప్పారు. "పరిశ్రమలు పునరుద్ధరణ, పునర్వినియోగ మార్గాన్ని అనుసరించాలి, ఇది స్థిరమైన అభివృద్ధికి సహాయపడుతుంది" అని ఆయన చెప్పారు.

గృహనిర్మాణం మరియు పట్టణ వ్యవహారాలు, పెట్రోలియం మరియు సహజవాయువు మంత్రి శ్రీ హర్దీప్ పూరి పెట్రోకెమికల్ పరిశ్రమ రంగంలో కొత్త, స్థితిస్థాపకత మరియు ఆత్మనిర్భర్ భారతదేశం ఎలా పురోగమిస్తోందని హైలైట్ చేశారు.

ఏపిఐసి గురించి:

ఆసియా పెట్రోకెమికల్ ఇండస్ట్రీ కాన్ఫరెన్స్ (ఏపిఐసి) అనేది భారతదేశం, జపాన్, కొరియా, మలేషియా, సింగపూర్, తైవాన్ మరియు థాయిలాండ్  ఏడు భాగస్వామ్య దేశాల నుండి సభ్యత్వంతో కూడిన విస్తృత ఆధారిత పెట్రోకెమికల్ పరిశ్రమ సమావేశం.

సంబంధిత వాణిజ్య సంస్థల ద్వారా అనుబంధం:

భారతదేశం (సిపిఎంఏ) - కెమికల్స్ మరియు పెట్రోకెమికల్స్ తయారీదారుల సంఘం:
వెబ్‌సైట్: https://www.cpmaindia.com/

జపాన్  (జెపిసిఏ) - జపాన్ పెట్రోకెమికల్ ఇండస్ట్రీ అసోసియేషన్:
వెబ్‌సైట్: http://www.jpca.or.jp/english/index.htm

కొరియా  (కెపిఐఏ) - కొరియా పెట్రోకెమికల్ ఇండస్ట్రీ అసోసియేషన్:
వెబ్‌సైట్: http://www.kpia.or.kr/index.php/main/eng

మలేషియా  (ఎంపిఏ) - మలేషియా పెట్రోకెమికల్ అసోసియేషన్:
వెబ్‌సైట్: http://www.mpa.org.my/

సింగపూర్  (ఎస్‌సిఐసి) - సింగపూర్ కెమికల్ ఇండస్ట్రీ కౌన్సిల్:
వెబ్‌సైట్: http://www.scic.sg/index.php/en/

తైవాన్  (పిఏఐటి) - పెట్రోకెమికల్ ఇండస్ట్రీ అసోసియేషన్ ఆఫ్ తైవాన్:
వెబ్‌సైట్: http://www.piat.org.tw/index.html

థాయిలాండ్ (ఎఫ్‌టిఐపిసి)- పెట్రోకెమికల్ ఇండస్ట్రీ క్లబ్ ది ఫెడరేషన్ ఆఫ్ థాయ్ ఇండ్.
వెబ్‌సైట్: http://www.ftipc.or.th/public/en

40 సంవత్సరాల క్రితం 1979లో జపాన్, కొరియా మరియు తైవాన్‌లచే తూర్పు ఆసియా పెట్రోకెమికల్ ఇండస్ట్రీ కాన్ఫరెన్స్ (ఈఏపిఐసి)గా స్థాపించబడింది. అనంతరం ఇది భారతదేశం, మలేషియా, సింగపూర్ మరియు థాయ్‌లాండ్‌లను కలుపుకుని 2000లో ఆసియా పెట్రోకెమికల్ ఇండస్ట్రీ కాన్ఫరెన్స్ (ఏపిఐసి)గా పేరు మార్చుకుంది. ఏపిఐసి భాగస్వామ్య కంట్రీ అసోసియేషన్లచే ప్రతి సంవత్సరం రొటేషన్ ప్రాతిపదికన  నిర్వహించబడుతుంది.


 

*****



(Release ID: 1925667) Visitor Counter : 146