భూ శా స్త్ర మంత్రిత్వ శాఖ

కేంద్ర భూ విజ్ఞాన శాఖ మంత్రిగా ఈ ఉదయం బాధ్యతలు స్వీకరించిన శ్రీ కిరణ్ రిజిజు


'2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశం' లక్ష్యంలో ముఖ్య పాత్ర పోషించే మంత్రిత్వ శాఖను తనకు కేటాయించినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపిన రిజిజు

రాబోయే రోజుల్లో "వాతావరణ సూచనల వ్యవస్థ" మొత్తాన్ని పునర్వ్యవస్థీకరించేందుకు కృషి చేస్తానన్న మంత్రి

Posted On: 19 MAY 2023 2:11PM by PIB Hyderabad

కేంద్ర భూ విజ్ఞాన శాఖ మంత్రిగా శ్రీ కిరెన్ రిజిజు ఈ ఉదయం బాధ్యతలు స్వీకరించారు. తనకు చాలా ముఖ్యమైన శాఖను కేటాయించినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. '2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశం' లక్ష్యంలో ఈ శాఖ ముఖ్య పాత్ర పోషిస్తుందని చెప్పారు. 

 

బాధ్యతలు స్వీకరించిన అనంతరం శ్రీ రిజిజు మీడియాతో మాట్లాడారు. అపార ఖనిజాలతో కూడిన పాలీమెటాలిక్ నోడ్యూల్స్ అన్వేషణ కోసం సాగించే ప్రధాన మంత్రి దార్శనిక పథకమైన డీప్ ఓషన్ మిషన్‌ను అమలు చేయడం తన ప్రాధాన్యతగా చెప్పారు.

తాను ఏ విషయాన్నైనా సరళంగా, ప్రజలకు అందుబాటులో ఉంచాలని ప్రయత్నిస్తానని, మంత్రిత్వ శాఖ తీసుకునే ప్రతి నిర్ణయం ప్రభావం ప్రజలపై ఉండేలా చూస్తానని అన్నారు.

ఐఎండీ సహా మంత్రిత్వ శాఖలోని సీనియర్ అధికారులు శ్రీ రిజిజుకు అక్కడి విషయాలను క్లుప్తంగా వివరించారు. రాబోయే రోజుల్లో, మొత్తం “వాతావరణ సూచనల వ్యవస్థ”ను పునర్వ్యవస్థీకరించేందుకు కృషి చేస్తానని రిజిజు ప్రకటించారు.

తన పాఠశాల రోజుల నుంచి గూగుల్ ఎర్త్, వాతావరణం, సముద్రాలు, ప్రపంచ పటాల అధ్యయనంపై చాలా ఆసక్తిని ప్రదర్శించేవాడినని, కొత్త పాత్రలో పని చేయడాన్ని ఆనందిస్తానని మంత్రి తెలిపారు.

***



(Release ID: 1925663) Visitor Counter : 149