ప్రధాన మంత్రి కార్యాలయం

ఒడిశా లో రూ. 8000 కోట్ల కు పైగా విలువ చేసే ప్రాజెక్టుల కు శంకుస్థాపన మరియు వాటిని దేశ ప్రజల కు అంకితం చేసిన ప్రధాన మంత్రి


పురీ మరియు హావ్ డా ల మధ్య వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను ఆయన ప్రారంభించారు

ఒడిశా లో 100%  విద్యుతీకరణ జరిగిన రైల్ నెట్ వర్క్ ను దేశప్రజల కు అంకితమిచ్చారు

పురీ మరియు కటక్ రైల్వే స్టేషన్ల పునరభివృద్ధికి శంకుస్థాపనచేశారు

“వందే భారత్ రైళ్ళు నడిచినప్పుడు భారత్ యొక్క జోరు మరియుప్రగతి ని గమనించవచ్చును”

“భారతీయ రైల్ అందరిని ఒక సూత్రం గా పెనవేస్తున్నది”

“అంతర్జాతీయంగా అత్యధిక ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీభారతదేశం తన అభివృద్ధి యొక్క వేగాన్ని  కొనసాగిస్తున్నది”

“స్వదేశీ సాంకేతికాభివృద్ధి సాధిస్తూ నవ భారతం దాన్ని దేశంలోమారుమూల ప్రాంతాలకు కూడా తీసుకు పోతోంది”

“దేశంలో నూరు శాతం రైల్వే లైన్ల విద్యుదీకరణ సాధించినరాష్ట్రాల్లో ఒడిశా ఒకటి”

“మౌలిక వసతులు ప్రజల జీవితాలను సుఖమయం చేయటంతో బాటుసమాజాన్ని సాధికారం చేస్తాయి”

“దేశం ‘మానవ సేవే మాధవసేవ’ నినాదం స్ఫూర్తి తోముందుకు సాగుతోంది”

“భారతదేశం వేగంగా అభివృద్ధి చెందాలంటే రాష్ట్రాల సమతుల్యఅభివృద్ధి అవసరం”

“ఒడిశా ప్రకృతి వైపరీత్యాలను సమర్థంగా ఎదుర్కోగలిగేలా కేంద్రప్రభుత్వం పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తోంది” 

Posted On: 18 MAY 2023 2:00PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న వీడియో కాన్ఫరెన్స్ మాధ్యం ద్వారా ఒడిశా లో రూ.8000 కోట్లకు పైగా విలువ చేసే అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన లు చేయడం తో పాటు దేశ ప్రజల కు అంకితం ఇచ్చారు. వీటిలో పురీ-హావ్ డా మధ్య వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలుకు జెండా ఊపి ప్రారంభించటం, పురీ, కటక్ రైల్వే స్టేషన్ల పునరభివృద్ధికి శంకుస్థాపన, ఒడిశా లో రైల్ నెట్ వర్క్ 100% విద్యుదీకరణ ని జాతి కి అంకితం చేయటం అంగుల్ -సుకిందా మధ్య కొత్త బ్రాడ్ గేజ్ రైలు మార్గం, మనోహర్ పుర్- రావుర్ కెలా-ఝార్ సుగుడా - జమ్గా ల మధ్య కొత్త మార్గం, బిఛుపాలీ-ఝర్ తరభా మధ్య కొత్త బ్రాడ్ గేజ్ మార్గం ఉన్నాయి.

 

ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, ఈ రోజు ఒడిశా, పశ్చిమ బంగాల్ ప్రజలకు వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు అందిస్తున్నామన్నారు. ఇది ఆధునిక, ఆకాంక్షాపూరితమైన భారతదేశానికి నిదర్శనమన్నారు. భారత దేశపు వేగాన్ని, పురోగతి ని వందే భారత్ రైలు రూపం లో చూడవచ్చుఅన్నారు. ఈ వేగాన్ని ఇప్పుడు ఒడిశా, పశ్చిమ బంగాల్ లో చూడగలుగుతున్నట్టు చెప్పారు. అభివృద్ధి పట్ల వైఖరిని ఇది పూర్తిగా మార్చి వేయటంతోబాటు ప్రయాణీకుల కొత్త అనుభూతికి కారణమవుతుందన్నారు. కోల్ కత్తా నుంచి పూరీ కి దర్శనం కోసమో మరో పనిమీదనో వెళ్ళేవారికి ప్రయాణ సమయం ఆరున్నర గంటలకు తగ్గిపోతుందన్నారు. దీనివలన సమయం ఆదా కావటంతో బాటు వ్యాపార అవకాశాలు, యువతకు కొత్త అవకాశాలు పెరుగుతాయని ప్రధాన మంత్రి వ్యాఖ్యానించారు.

 

దూరప్రయాణాలు చేయాలనుకునే పౌరులకు రైళ్ళు తొలి ప్రాధాన్యమని గుర్తు చేశారు. ఈరోజు శంకుస్థాపన చేసిన ఇతర రైల్వే ప్రాజెక్టులలో పురీ, కటక్ స్టేషన్ల పునరభివృద్ధి, రైల్వే లైన్ల డబ్లింగ్ పనులు, ఒడిశా లో 100 శాతం రైల్వే లైన్ల విద్యుదీకరణ ఉన్నాయని ప్రధాన మంత్రి చెప్పారు.

 

ఆజాదీ కా అమృత్ కాల్నడుస్తున్నదని గుర్తు చేస్తూ, దేశ సమైక్యతను, సమగ్రతను సుస్థిరం చేయాల్సిన అవసరముందన్నారు. దేశ ఉమ్మడి సామర్థ్యాలు శిఖర స్థాయికి చేరుకోవాలంటే దేశం యావత్తూ ఒక తాటిమీద నడవాలని పిలుపునిచ్చారు. వందే భారత్ రైలు అలాంటి భావనకు ప్రతిబింబమని వ్యాఖ్యానించారు. దేశ అభివృద్ధి ఇంజన్ గా వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను అభివర్ణించారు. అది ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్ నినాదానికి ప్రతీక అన్నారు.

 

భారత రైల్వేలు అందరినీ ఒక తానులో దారమై సంధానం చేస్తాయి. వందే భారత్ రైలు కూడా అదే ఆలోచనా ధోరణితో ముందుకు దూసుకుపోతోందిఅన్నారు. ఈ రోజు ప్రారంభించిన వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు పురీ- హావ్ డా మధ్య ఆధ్యాత్మిక, సాంస్కృతిక బంధాన్ని పెంచుతుందని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలోని వివిధ రాష్ట్రాలలో ఇప్పటికే 15 వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు నడుస్తున్నాయని గుర్తు చేస్తూ, అవి దేశ ఆర్థికాభివృద్ధిని ముందుకు నడిపిస్తాయన్నారు.

 

ఇటీవలి కాలంలో అంతర్జాతీయంగా ప్రతికూల పరిస్థితులున్నప్పటికీ భారత అభివృద్ధి వేగం కొనసాగుతోందని ప్రధాన మంత్రి అభిప్రాయపవడ్డారు. ప్రతి రాష్ట్రాన్నీ కలుపుకుంటూ ఈ యాత్రలో ప్రతి పౌరుడూ పాల్గొనటమే అందుకు కారణమన్నారు. ఇంతకు ముందున్న పరిస్థితికి భిన్నంగా స్వదేశీ సాంకేతికాభివృద్ధి సాధిస్తూ నవ భారతం దాన్ని దేశంలోని మారుమూల ప్రాంతాలకూ తీసుకు వెళుతోందన్నారు. వందే భారత్ రైళ్ళు కూడా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించటాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. సంక్షోభ సమయంలోనూ భారతదేశం కోవిడ టీకా మందు తయారు చేసిందని, 5 జి టెక్నాలజీ ని అందుబాటులోకి తెచ్చిందని చెప్పారు. ఈ ఆవిష్కరణలు కొన్ని ప్రాంతాలకో, కొన్ని నగరాలలో పరిమితం కాలేదని, దేశమంతటా సమానంగా అందుబాటులోకి తెచ్చామని చెప్పా రు. అదే విధంగా వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు కూడా దేశం నలుమూలలకూ వెళుతున్నాయన్నారు.

 

అభివృద్ధి లో వెనుకబడిన రాష్ట్రాలకు సబ్ కా సాథ్ , సబ్ కా వికాస్పాలసీ ఎంతగానో ఉపయోగపడుతున్నదని ప్రధాన మంత్రి అన్నారు. ఒడిశా లో రైల్వే పథకాలకు బడ్జెట్ కేటాయింపులు గణనీయంగా పెరిగాయన్నారు. 2014 కు పదేళ్ళ ముందు ఏటా సగటున 20 కిలోమీటర్ల రైలు మార్గమే నిర్మించగా 2022-23 లో అది 120 కిలోమీటర్లు అయిందన్నారు. దీర్ఘ కాలం పెండింగ్ లో పడిన ఖుర్దా బోలన్ గీర్ లైన్, హరిదాస్ పుర్ -పారాదీప్ లైన్ ఇప్పుడు వేగంగా పూర్తవుతున్నాయని గుర్తు చేశారు.

 

దేశంలో నూరు శాతం రైల్వే లైన్ల విద్యుదీకరణ సాధించిన రాష్ట్రాల్లో ఒడిశా ఒకటిఅని చెబుతూ, ఇదే తరహా ప్రగతి సాధించటానికి పశ్చిమ బంగాల్ లోనూ పనులు జరుగుతున్నాయన్నారు. ఒడిశా లో రైల్వే ప్రాజెక్టులమీద దృష్టిసారించిన ఫలితంగా ప్రయాణ రైళ్లతోబాటు సరకు రవాణా రైళ్ళ వేగం కూడా చెప్పుకోదగినంతగా పెరిగిందన్నారు. ఖనిజ నిల్వలు గణనీయంగా ఉన్న ఒడిశా రాష్ట్రం రైల్వే లైన్ల విద్యుదీకరణ వలన బాగా లాభం పొందుతుందని, అదే సమయంలో డీజిల్ వలన వెలువడే కాలుష్యం తగ్గుతుందని అన్నారు. మొత్తంగా రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధికి దోహదపడుతుందన్నారు.

 

మౌలిక వసతుల అభివృద్ధి గురించి కూడా ఈ సందర్భంగా ప్రధాన మంత్రి ప్రస్తావించారు. మౌలిక వసతులు ప్రజల జీవితాలను సుఖమయం చేయటంతోబాటు సమాజాన్ని సాధికారం చేస్తాయిఅన్నారు. మౌలిక వసతులు కుంటుబడినప్పుడు ప్రజల అభివృద్ధి కూడా వెనుకబడుతుందన్నారు. మౌలిక వసతులు అభివృద్ధి చేస్తే, అభివృద్ధి వేగం పుంజుకొని ప్రజలు అభివృద్ధి చెందుతారుఅని వ్యాఖ్యానించారు. అభివృద్ధి కోసం చేపడుతున్న చర్యలను ప్రస్తావిస్తూ, పిఎం సౌభాగ్య యోజనను గుర్తు చేశారు. దీని లో భాగం గా ప్రభుత్వం 2.5 కోట్ల ఇళ్ల కు ఉచిత విద్యుత్తు సౌకర్యాన్ని కల్పించింది. అందులో 25 లక్షల ఇళ్ళు ఒడిశాలో, 7.25 లక్షల ఇళ్ళు పశ్చిమ బంగాల్ లో ఉన్నాయిఅన్నారు.

దేశంలో విమానాశ్రయాల సంఖ్య 75 నుంచి ఈ రోజు 150 కి చేరిందని చెబుతూ, సామాన్య పౌరులు విమానాల్లో ప్రయాణిస్తూ సోషల్ మీడియా లో శేర్ చేస్తున్న ఫోటోలను గుర్తు చేశారు.

 

భారతదేశం మౌలిక వసతుల కల్పన లో సాధించిన ప్రగతి ని ఇప్పుడు అందరూ అధ్యయనం చేస్తున్నారన్నారు. బడ్జెట్ లో దీనికోసం 10 లక్షల కోట్లు కేటాయించామని చెబుతూ దీనివల్ల లక్షలాదిమందికి ఉద్యోగాలు లభిస్తాయన్నారు. రైల్వేలు, జాతీయ రహదారుల అభివృద్ధి ఫలాలు ఎంతో ప్రయోజనం కలిగిస్తాయని, రైతులను కొత్త మార్కెట్లతో అనుసంధానం చేస్తాయని, పర్యాటకులు కొత్త కొత్త ప్రదేశాలకు సులువుగా చేరుకోగలుగుతారని, విద్యార్థులు తాము కోరుకున్న కళాశాలలకు వెళ్లగలుగుతారని చెప్పారు.

 

దేశం మానవ సేవే మాధవ సేవనినాద స్ఫూర్తితో ముందుకు సాగుతోందని ప్రధాన మంత్రి అన్నారు. జగన్నాథ ఆలయం లాంటి దేవాలయాలు, పూరీలాంటి యాత్రా స్థలాలు వేలాది మంది పేదలకు శతాబ్దాల తరబడి ప్రసాదాలు అందిస్తున్నాయని గుర్తు చేశారు. అదే రకమైన స్ఫూర్తితో పిఎం గరీబ్ కళ్యాణ్ పథకం ద్వారా 80 కోట్ల మందికి ఉచిత రేషన్ పంపిణీ జరిగిందన్నారు. ఆయుష్మాన్ కార్డ్, ఉజ్జ్వల, జల్ జీవన్ మిషన్, పిఎం ఆవాస్ యోజన లాంటి పథకాలని కూడా ప్రధాని ప్రస్తావించారు. నిరుపేదలు ఎన్నో ఏళ్ల తరబడి ఎదురుచూసిన ప్రాథమిక సౌకర్యాలు ఇప్పుడు అందుకుంటున్నారుఅన్నారు.

 

ప్రధాన మంత్రి తన ప్రసంగాన్ని ముగిస్తూ, ఒడిశా. పశ్చిమ బంగాల్ తో బాటు యావత్ దేశం లో అభివృద్ధి వేగం మరింత పుంజుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశం సమైక్యంగా ఉండి నవ వికసిత భారత్ నిర్మాణ లక్ష్యాన్ని సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

 

ఒడిశా గవర్నర్ శ్రీ గణేశీ లాల్, ముఖ్యమంత్రి శ్రీ నవీన్ పట్ నాయక్, కేంద్ర రైల్వే శాఖ మంత్రి శ్రీ అశ్విన్ వైష్ణవ్, కేంద్ర విద్య, నైపుణ్యాభివృద్ధి , నవపారిశ్రామికత్వం శాఖమంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

నేపథ్యం

 

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పురీ-హావ్ డా మధ్య వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును జెండా ఊపి ప్రారంభించారు. ఈ రైలు ఒడిసాలోని ఖోర్ ధా, కటక్, జాజ్ పుర్, భద్రక్, బాలాసోర్ జిల్లాల గుండా, పశ్చిమ బంగాల్ లోని పశ్చిమ మేదినీపుర్, పూర్వీ మేదినీపుర్ జిల్లా ల గుండా ప్రయాణిస్తుంది. ఈ మార్గం లో రైలు ప్రయాణీకులకు వేగవంతమైన, సౌకర్య వంతమైన, అనుకూలమైన ప్రయాణ అనుభూతినిస్తుంది.అదే విధంగా పర్యాటక రంగాన్ని ప్రోత్సహించి ఈ ప్రాంత ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుంది.

 

పురీ, కటక్ రైల్వే స్టేషన్ల పునరభివృద్ధికి కూడా ప్రధాన మంత్రి శంకుస్థాపన చేశారు. ఇలా పునరభివృద్ధి చేసిన స్టేషన్లలో అత్యాధునిక సౌకర్యాలుంటాయి. రైలు ప్రయాణీకులకు అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి.

 

ఒడిశా లో 100 శాతం రైలుమార్గాల విద్యుదీకరణను ప్రధాన మంత్రి జాతికి అంకితం చేశారు. దీనివలన ఒడిశా లో రైలుమార్గాల నిర్వహణ వ్యయం బాగా తగ్గుతుంది. ముడి చమురు దిగుమతి భారం తగ్గుతుంది. ప్రధాన మంత్రి సంబల్ పుర్-టిట్ లాగఢ్ రైలు మార్గం డబ్లింగ్ ను కూడా జాతి కి అంకితం చేశారు. అంగుల్ -సుకిందా మధ్య కొత్త బ్రాడ్ గేజ్ మార్గాన్ని ప్రారంభించారు. మనోహర్ పుర్ రావుర్ కెలా-ఝార్ సు గుడా –జమ్గాలను కలిపే మూడో లైను ను ప్రారంభించారు. ఉక్కు, విద్యుత్తు, గనుల త్రవ్వకం రంగాలలో వేగంగా సాగుతున్న పారిశ్రామికాభివృద్ధి నేపథ్యంలో ఈ కొత్త మార్గాలు ట్రాఫిక్ డిమాండ్ ను తట్టుకోవటానికి ఉపయోగపడతాయి. దీనివలన ప్రయాణీకుల రవాణా మీద వత్తిడి తగ్గుతుంది.

 

Railway projects being launched in Odisha will significantly boost connectivity and enhance 'Ease of Travel' for the citizens. https://t.co/WWls5vqJNc

— Narendra Modi (@narendramodi) May 18, 2023

वंदेभारत ट्रेन, आधुनिक भारत और आकांक्षी भारतीय, दोनों का प्रतीक बन रही है। pic.twitter.com/wjtQHsOYiX

— PMO India (@PMOIndia) May 18, 2023

बीते वर्षों में भारत ने कठिन से कठिन वैश्विक हालातों में भी अपने विकास की गति को बनाए रखा है। pic.twitter.com/O8yk4MN0D7

— PMO India (@PMOIndia) May 18, 2023

आज का नया भारत टेक्नोलॉजी भी खुद बना रहा है और नई सुविधाओं को तेजी से देश के कोने-कोने में पहुंचा रहा है। pic.twitter.com/96bQksEbwJ

— PMO India (@PMOIndia) May 18, 2023

जहां infrastructure का विकास होता है, वहां लोगों का विकास भी तेजी से होता है। pic.twitter.com/7v1WRyWENU

— PMO India (@PMOIndia) May 18, 2023

जन सेवा ही प्रभु सेवा। pic.twitter.com/zDsViKHHKt

— PMO India (@PMOIndia) May 18, 2023

भारत के तेज विकास के लिए, भारत के राज्यों का संतुलित विकास भी उतना ही आवश्यक है। pic.twitter.com/UnU4xvlMaD

— PMO India (@PMOIndia) May 18, 2023

*****

DS/TS



(Release ID: 1925255) Visitor Counter : 128