యు పి ఎస్ సి
కాంట్రాక్టు పద్ధతిన సంయుక్త కార్యదర్శి స్థాయి/ డైరెక్టర్/ డిప్యూటీ కార్యదర్శి స్థాయి పదవుల కోసం లేటరల్ (పార్శ్విక) నియామకం
లేటరల్ (పార్శ్విక) నియామకం ద్వారా నలుగురు సంయుక్త కార్యదర్శులు, 16మంది డైరెక్టర్లు/ డిప్యూటీ కార్యదర్శులను తీసుకుంటారు
प्रविष्टि तिथि:
18 MAY 2023 2:46PM by PIB Hyderabad
భారత సిబ్బంది & శిక్షణ (డిఒపి&టి) విభాగంనుంచి అందుకున్న విజ్ఞప్తి మేరకు, కాంట్రాక్టు ప్రాతిపదికన ప్రభుత్వంలో సంయుక్త కార్యదర్శి/ డైరెక్టర్/ డిప్యూటీ కార్యదర్శి స్థాయిలో దిగువన పేర్కొన్న ప్రభుత్వ విభాగాలు/ మంత్రిత్వ శాఖలలో చేరేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారుః-
వ్యవసాయ & రైతాంగ సంక్షేమ మంత్రిత్వ శాఖ పరిధిలోని వ్యవసాయం & రైతాంగ సంక్షేమ విభాగం
పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
రసాయనాలు & ఎరువుల మంత్రిత్వ శాఖ పరిధిలోని రసాయనాలు & పెట్రో కెమికల్స్ విభాగం
కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం & ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖకు చెందిన ఆహారం & ప్రజా పంపిణీ విభాగం
భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ
విద్యా మంత్రిత్వ శాఖలోని ఉన్నత విద్య విభాగం
గృహ & పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
చట్ట & న్యాయ మంత్రిత్వ శాఖలోని న్యాయ వ్యవహారాల విభాగం
వాణిజ్య & పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలోని పరిశ్రమలకు ప్రోత్సాహం & అంతర్గత వాణిజ్య విభాగం
రసాయనాలు & ఎరువుల మంత్రిత్వ శాఖ పరిధిలోని ఫార్మాస్యూటికల్స్ (ఔషధాల తయారీ) విభాగం
విద్యా మంత్రిత్వ శాఖ పరిధిలోని పాఠశాల విద్య & అక్షరాస్యత విభాగం
పైన పేర్కొన్న మంత్రిత్వ శాఖలు/ విభాగాలకు లేటరల్ (పార్శ్విక ) నియామకం ద్వారా నలుగురు సంయుక్త కార్యదర్శులు, 16 డైరెక్టర్లు/ డిప్యూటీ కార్యదర్శులను నియమించనున్నారు.
అభ్యర్ధుల కోసం దీనికి సంబంధించిన వివరణాత్మక ప్రకటనను, సూచనలను కమిషన్ వెబ్‌సైట్‌పై 20 మే 2023న అప్‌లోడ్ చేస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు 20 మే 2023 నుంచి 19 జూన్ 2023 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
అభ్యర్ధులు తమ ఆన్‌లైన దరఖాస్తుల ద్వారా ఇచ్చిన సమాచారం ఆధారంగా ఇంటర్వ్యూ కోసం షార్ట్ లిస్ట్ చేస్తారు. అందించిన సమాచారం సరైందని వారు నిర్ధారించాలి.
***
(रिलीज़ आईडी: 1925229)
आगंतुक पटल : 171