సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav g20-india-2023

రేపు ఢిల్లీలో 8వ జాతీయ పెన్షన్ అదాలత్ ను ప్రారంభించనున్న కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్


దీర్ఘ కాలంగా అపరిష్కృతంగా ఉన్న కేసులను పరిశీలించి పరిష్కరించనున్న పెన్షన్ అదాలత్
ఇంతవరకు జాతీయ స్థాయిలో 7 పెన్షన్ అదాలత్ లను నిర్వహించి 24218 కేసులను పరిశీలించి 17235 కేసులు పరిష్కరించిన మంత్రిత్వ శాఖ

అన్ని మంత్రిత్వ శాఖలు/విభాగాల్లో పనిచేస్తూ మరో ఆరు నెలల్లో పదవీ విరమణ చేయనున్న 1200 అధికారుల కోసం పెన్షన్, పెన్షనర్ల సంక్షేమ శాఖ నిర్వహించనున్న 50వ పీఆర్సీ (ప్రీ రిటైర్మెంట్ కౌన్సెలింగ్) వర్క్‌షాప్‌కు అధ్యక్షత వహించనున్న మంత్రి

Posted On: 16 MAY 2023 12:47PM by PIB Hyderabad

దీర్ఘ కాలంగా అపరిష్కృతంగా ఉన్న కేసులను పరిశీలించి పరిష్కరించడానికి ఏర్పాటైన 8వ జాతీయ పెన్షన్ అదాలత్ ను కేంద్ర శాస్త్ర సాంకేతిక, భూ శాస్త్రం, సిబ్బంది వ్యవహారాలు, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్లు, అణుశక్తి, అంతరిక్ష వ్యవహారాల శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) ప్రారంభించనున్నారు. 

సంక్లిష్టమైన కేసులను పరిశీలించడానికి దేశం వివిధ ప్రాంతాలలో మంత్రిత్వ శాఖలు/విభాగాలు ఏర్పాటు  చేసే పెన్షన్ అదాలత్ లకు జాతీయ పెన్షన్ అదాలత్ ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అనుసంధానం చేస్తారు. ఇంతవరకు మంత్రిత్వ శాఖ జాతీయ స్థాయిలో 7 సార్లు పెన్షన్ అదాలత్ లను నిర్వహించింది. 24218 కేసులను పరిశీలించిన పెన్షన్ అదాలత్ ను 17235 కేసులను పరిష్కరించింది. అన్ని మంత్రిత్వ శాఖలు/విభాగాల్లో పనిచేస్తూ మరో ఆరు నెలల్లో పదవీ విరమణ చేయనున్న 1200 అధికారుల కోసం పెన్షన్, పెన్షనర్ల సంక్షేమ శాఖ ఏర్పాటు చేసిన  50వ  పిఆర్‌సి   (ప్రీ రిటైర్మెంట్ కౌన్సెలింగ్) వర్క్‌షాప్‌కు మంత్రి అధ్యక్షత వహిస్తారు. రేపు ఢిల్లీలో జాతీయ పెన్షన్ అదాలత్, వర్క్‌షాప్‌ జరగనున్నాయి.

పదవీ విరమణ ప్రయోజనాలను సకాలంలో పొందేలా వర్క్‌షాప్‌ అధికారులకు సహకరిస్తుంది. దీనిలో పెన్షన్ పొందడానికి పూర్తి చేయవలసిన నిబంధనలు, భవిష్య  పెన్షన్ ఫారమ్‌లను ఎలా పూరించాలి, ఇంటిగ్రేటెడ్ పెన్షనర్స్ పోర్టల్, భవిష్య,పదవీ విరమణ తర్వాత లభించే  సిజిహెచ్ఎస్ /ఫిక్స్‌డ్ మెడికల్ అలవెన్స్‌,సీనియర్ సిటిజన్లు/పెన్షనర్‌లకు లభించే ఆదాయపు పన్ను ప్రోత్సాహకాలు, డిఎల్ఎస్, ఫేస్ అథెంటికేషన్, పెన్షనర్ల సంఘాలు, పని చేస్తూ అందించిన అత్యుత్తమ సేవలు గుర్తించే విధంగా ఏర్పాటైన అనుభవ్ వంటి అంశాలపై  వర్క్‌షాప్‌ నిర్వహిస్తారు. 

పెన్షన్ల విభాగం ఇంతవరకు 49 సార్లు  పిఆర్‌సి వర్క్‌షాపులు నిర్వహించింది.ఢిల్లీలోని వివిధ మంత్రిత్వ శాఖలు/డిపార్ట్‌మెంట్‌ల కోసం 29  పిఆర్‌సిలు, న్యూఢిల్లీ, జలంధర్, షిల్లాంగ్, కోల్‌కతా, టెకాన్‌పూర్, జమ్ము, జోధ్‌పూర్ మరియు గౌహతిలో సీఆర్ఫీఎఫ్,బిఎస్ఎఫ్   అస్సాం రైఫిల్స్ లాంటి  సీఏపీఎఫ్ ల  కోసం 20  పిఆర్‌సిలు జరిగాయి. పిఆర్‌సిలకు పదవీ విరమణ  చేస్తున్న  మొత్తం 6972 మంది  సిబ్బంది ఈ  హాజరయ్యారు. 

పెన్షనర్ల సంక్షేమం కోసం ఏర్పాటైన వివిధ పోర్టల్‌లను ఏకీకృతం చేయాలని పెన్షన్, పెన్షనర్ల సంక్షేమ శాఖ నిర్ణయించింది.పెన్షనర్‌లకు సులభతరం జీవన అందించడడం లక్ష్యంగా పెన్షన్ డిస్‌బర్సింగ్ బ్యాంక్ పోర్టల్‌లు, అనుభవ్, సీపీఈఎన్ గ్రామ్స్, సిజిహెచ్ఎస్   మొదలైన అన్ని పోర్టల్‌లు కొత్తగా అభివృద్ధి చేసిన  “ఇంటిగ్రేటెడ్ పెన్షనర్స్ పోర్టల్” (https://ipension.nic.in)లో ఏకీకృతం చేయాలని మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. భారతీయ స్టేట్ బ్యాంక్, కెనరా బ్యాంక్ నిర్వహిస్తున్న పెన్షన్ సేవా పోర్టల్‌ ఇప్పటికే భవిష్య పోర్టల్‌తో అనుసంధానం అయ్యాయి. నూతన విధానం వల్ల ఇంటిగ్రేటెడ్ పెన్షనర్స్ పోర్టల్ ద్వారా పెన్షనర్లు ఇప్పుడు తమ పెన్షన్ స్లిప్, లైఫ్ సర్టిఫికెట్, ఫారం-16  స్థితి వివరాలు తెలుసుకోవచ్చు.పెన్షన్ పంపిణీ చేస్తున్న18  బ్యాంకుల  పోర్టళ్లు   ఇంటిగ్రేటెడ్ పెన్షనర్స్ పోర్టల్‌లో త్వరలో విలీనం అవుతాయి. 

పెన్షన్, పెన్షనర్ల సంక్షేమ శాఖ  2017లో ప్రయోగాత్మకంగా పెన్షన్ అదాలత్ కార్యక్రమాన్ని ప్రారంభించింది.  పెన్షనర్ల ఫిర్యాదులను సత్వరం పరిష్కరించ డానికి పరిష్కారం కోసం 2018లో నేషనల్ పెన్షన్ అదాలత్ ను  సాంకేతికతను ఉపయోగించి నిర్వహించారు. ఒక నిర్దిష్ట ఫిర్యాదుకు సంబంధించిన అన్ని వర్గాలను  ఉమ్మడి వేదిక పైకి తెచ్చి  పెన్షన్ చెల్లింపు జరిగేలా చూసే విధంగా  కేసు పరిష్కారానికి చర్యలు అమలు చేసి  పెన్షన్ సకాలంలో అందేలా చర్యలు అమలు చేశారు. 

 పారదర్శకత, డిజిటలైజేషన్ విధానంలో పెన్షన్ చెల్లింపు జరిగేలా చూడాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా మంత్రిత్వ శాఖ పెన్షన్ ప్రాసెసింగ్ , చెల్లింపు కోసం  భవిష్య ప్లాట్‌ఫారమ్ ప్రారంభించింది.  NeSDA అసెస్‌మెంట్ 2021 ప్రకారం అన్ని కేంద్ర ప్రభుత్వ ఇ-గవర్నెన్స్ సర్వీస్ డెలివరీ పోర్టల్‌లలో భవిష్య వ్యవస్థ  3వ స్థానంలో నిలిచింది. 

 

***



(Release ID: 1924515) Visitor Counter : 156