శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
అంకుర సంస్థల పోషణ, పురోగతిని అనుసరించడానికి త్వరలో ఒక యంత్రాంగాన్ని అభివృద్ధి చేయాలని కోరుతున్నట్లు డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు
ఇతివృత్తం ఆధారంగా క్లస్టర్ ప్రాజెక్టులను వచ్చే వారం ప్రారంభించాలని కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి ప్రతిపాదించారు
జాతీయ సాంకేతిక అవార్డులను అందజేసిన అనంతరం, ప్రగతి మైదాన్ లో నేషనల్ టెక్నాలజీ వీక్ ఎక్స్‌పో ముగింపు కార్యక్రమాన్ని ఉద్దేశించి కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి ప్రసంగించారు.
Posted On:
14 MAY 2023 4:02PM by PIB Hyderabad
అంకుర సంస్థల సంఖ్య లక్షకు పైగా పెరగడంతో వాటి పోషణ, పురోగతిని అనుసరించడానికి త్వరలో ఒక యంత్రాంగాన్ని అభివృద్ధి చేయాలని కేంద్ర శాస్త్ర, సాంకేతిక, భూ విజ్ఞాన శాఖ సహాయ మంత్రి (ఇంచార్జి), ప్రధానమంత్రి కార్యాలయం, అంతరిక్ష, అణుశక్తి శాఖ, డి.ఓ.పి.టి. శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రతిపాదించారు.
ఈరోజు న్యూ ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో జరిగిన నేషనల్ టెక్నాలజీ వీక్ ఎక్స్‌పోజిషన్ ముగింపు కార్యక్రమం, అవార్డుల ప్రదానోత్సవంలో ఆయన ప్రసంగిస్తూ, "ఈ అంకుర సంస్థల వృద్ధిని నిశితంగా అనుసరించే యంత్రాంగాన్ని అభివృద్ధి చేయాలని, ముఖ్యంగా ప్రభుత్వం నుండి సాంకేతిక, ఆర్థిక సహాయాన్ని పొందిన అంకురసంస్థలు కోరుతున్నాయి. వారు నష్టపోకుండా వాటిని ఎలా నిలబెట్టుకోవాలో చూడండి.”అని సూచించారు.
కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ సహాయ మంత్రి మాట్లాడుతూ, స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మూడో తరం, సముద్ర శాస్త్రంలో కొత్త అవకాశాలు అందుబాటులోకి రావడంతో ఐ.టి. నుండి బయోటెక్, భూ విజ్ఞాన శాస్త్రం వైపు మారడం జరిగిందని, చెప్పారు.
"ఈ 3వ తరం అత్యంత అదృష్టవంతులు, వారు ఇకపై 'వారి ఆకాంక్షల ఖైదీలు కాదు" అని డాక్టర్ జితేంద్ర సింగ్ పేర్కొంటూ, "ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ క్రియాశీల నాయకత్వంలో ఆవిష్కరణలకు సాక్ష్యంగా భారతదేశం ముందంజలో ఉన్న ఉత్తమ సమయాలలో ఇది ఒకటి." అని వ్యాఖ్యానించారు.
అంకుర సంస్థల గురించిన అపోహలకు దూరంగా ఉండాలని డాక్టర్ జితేంద్ర సింగ్ సూచించారు. “ఒక కారణం వయస్సు, పదవీ విరమణ తర్వాత ఒక శాస్త్రవేత్త ఒక అంకుర సంస్థను ఏర్పాటు చేయడాన్ని నేను చూశాను; రెండవది అధిక అర్హత, మీరు సృజనాత్మకత కోసం అంతర్లీనమైన అన్వేషణను కలిగి ఉన్న ఒక ఆవిష్కర్తగా ఉండాలి,” అని ఆయన ఉద్భోదించారు.
ఇతివృత్తం ఆధారంగా క్లస్టర్ ప్రాజెక్టులను నెలకొల్పాలని కూడా ప్రతిపాదిస్తూ, ఈ కసరత్తు వచ్చే వారంలో ప్రారంభమవుతుందని మంత్రి తెలిపారు. ఒక బ్రహ్మాండమైన ప్రదర్శన నిర్వహించేందుకు, 12 కంటే ఎక్కువ కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాలను ఒక చోటకు తీసుకురావడం ద్వారా ప్రధానమంత్రి మోదీ రూపొందించిన “మొత్తం ప్రభుత్వం” అనే విధానానికి ఈ జాతీయ సాంకేతిక వారోత్సవాల కార్యక్రమం ఒక ఉదాహరణగా నిలిచిందని డాక్టర్ జితేంద్ర సింగ్ పేర్కొన్నారు.
ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారులు డాక్టర్ అజయ్ కుమార్ సూద్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, భారతదేశానికి చెందిన జాతీయ సాంకేతిక దినోత్సవం, వారోత్సవాల మాదిరిగా, అంకుర సంస్థల దినోత్సవం, వారోత్సవాలను కూడా నిర్వహించాలని సూచించారు.
కేంద్ర శాస్త్ర, సాంకేతిక విభాగం కార్యదర్శి డాక్టర్ శ్రీవారి చంద్రశేఖర్ మాట్లాడుతూ, ప్రతి అంకుర సంస్థ సుస్థిర అభివృద్ధి గురించి చాలా స్పష్టమైన అవగాహనతో ఉన్నట్లు ఈ ప్రదర్శన సందర్భంగా ప్రత్యేకంగా చెప్పవచ్చునని పేర్కొంటూ, "అమృత కాల్ ద్వారా, మనం అన్ని గ్రీన్ హౌస్ ఉద్గారాలను నిలిపివేసి, పర్యావరణానికి హాని తగ్గించాలని ఆశిద్దాం." అని తమ ఆశాభావం వ్యక్తం చేశారు.
డి.బి.టి. కార్యదర్శి డాక్టర్ రాజేష్ గోఖలే మాట్లాడుతూ, సాంకేతిక విజ్ఞానం భవిష్యత్తు బయోటెక్నాలజీ, కృత్రిమ మేధస్సు ద్వారా ముందుకు సాగుతుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో - డి.ఆర్.డి.ఓ. చైర్మన్, డాక్టర్ సమీర్ వి. కామత్; ఎర్త్ సైన్సెస్ కార్యదర్శి డాక్టర్ ఎం. రామచంద్రన్; సాంకేతిక అభివృద్ధి మండలి కార్యదర్శి డాక్టర్ రాజేష్ కుమార్ పాఠక్; అటల్ ఇన్నోవేషన్ మిషన్, సి.ఈ.ఓ. డాక్టర్ చింతన్ వైష్ణవ్ కూడా ప్రసంగించారు.
ఈ సందర్భంగా డాక్టర్ జితేంద్ర సింగ్ జాతీయ సాంకేతిక అవార్డులను ప్రదానం చేశారు. మెయిన్; ఎం.ఎస్.ఎం.ఈ; స్టార్ట్-అప్; వినూత్న స్వదేశీ సాంకేతికత యొక్క విజయవంతమైన వాణిజ్యీకరణ కోసం వివిధ పరిశ్రమల నుంచి ట్రాన్సలేషనల్ రీసెర్చ్ టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేటర్; పరిశోధన, సాంకేతిక వ్యాపార ఇంక్యుబేటర్లలో పాల్గొన్న శాస్త్రవేత్తలు వంటి ఐదు విభాగాల కింద జాతీయ సాంకేతిక అవార్డుల కోసం, సాంకేతిక అభివృధి మండలి (టి.డి.బి) దరఖాస్తులు ఆహ్వానించింది. ప్రముఖ శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులతో కూడిన బృందంతో కఠినమైన రెండు-స్థాయిల్లో మూల్యాంకన ప్రక్రియ తర్వాత ఈ ఏడాది మొత్తం 11 మంది విజేతలను ఎంపిక చేయడం జరిగింది.
జాతీయ సాంకేతిక వారోత్సవాలను 2023 మే, 11వ తేదీన ప్రగతి మైదాన్ లో ప్రధానమంత్రి ప్రారంభించారు. భారత ప్రభుత్వంలోని 12 మంత్రిత్వ శాఖల నుంచి పలువురు ఆవిష్కర్తలు తాము రూపొందించిన విస్తృత శ్రేణి శాస్త్రీయ ఆవిష్కరణలను ప్రదర్శించారు.
"ఆవిష్కరణల కోసం యువ మేధస్సులను ప్రేరేపించడం - పాఠశాల నుంచి ప్రారంభం కావాలి" అనే ఇతివృత్తంతో ఈ ఏడాది కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇందులో భారతదేశంలోని వివిధ పాఠశాలల నుండి భారత ప్రభుత్వ అటల్ ఇన్నోవేషన్ మిషన్ కింద అటల్ టింకరింగ్ ల్యాబ్స్ లో నిమగ్నమై ఉన్న విద్యార్థులు పాల్గొని తాము రూపొందించిన సాంకేతిక ఆవిష్కరణలు ప్రదర్శించారు.
సాంకేతిక అంకుర సంస్థలు, ఎస్.ఎం.ఈ. లకు మద్దతు ఇవ్వడంతో పాటు, వివిధ ప్రభుత్వ పథకాలు, ప్రోత్సాహకాల గురించి ఈ కార్యక్రమం అవగాహన కల్పించింది, దేశవ్యాప్తంగా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, సాంకేతిక ఔత్సాహికులను చేరుకోవడానికి ప్రయత్నించింది. సాంకేతిక పర్యావరణ వ్యవస్థలో వివిధ వాటాదారుల మధ్య పెరుగుతున్న సహకారం, భాగస్వామ్యాలను ఈ కార్యక్రమం ప్రోత్సహించింది. తమ ఆలోచనలను ఇచ్చిపుచ్చుకోడానికీ, తగిన అవకాశాలను అన్వేషించడానికీ, ఈ కార్యక్రమం వారిని ఒక చోటకి చేర్చింది.
రాబోయే 25 సంవత్సరాలలో సాంకేతిక నైపుణ్యం దిశగా జాతీయ సాంకేతిక వారోత్సవం ఖచ్చితమైన లక్ష్యాలను నిర్దేశించింది. భారతదేశం అమృత్ కాల్ లోకి ప్రవేశించినందున, తదుపరి తరం ఆవిష్కర్తలు, వ్యవస్థాపకులను ప్రోత్సహించి, మద్దతు ఇచ్చే బలమైన ఆవిష్కరణల పర్యావరణ వ్యవస్థను నిర్మించడంపై కీలక దృష్టి ఉంది. మనం పరిశోధన మరియు అభివృద్ధిలో పెట్టుబడి పెట్టవలసిన అవసరం ఉంది. మన మేధో సంపత్తి పరిపాలనను బలోపేతం చేసి, ఆవిష్కరణలతో పాటు, వృద్ధిని ప్రోత్సహించే విధాన వాతావరణాన్ని సృష్టించాలి. సరైన మద్దతు, ప్రోత్సాహంతో, భారతదేశం ప్రపంచంలో అత్యుత్తమమైన వాటితో పోటీ పడగల నిజమైన ప్రపంచ-స్థాయి సాంకేతిక పర్యావరణ వ్యవస్థగా అభివృద్ధి చెందుతుంది.
భారతదేశం యొక్క శాస్త్ర, సాంకేతిక పురోగతి కోసం పనిచేసిన వారితో పాటు, 1998 మే నెలలో పోఖ్రాన్ పరీక్షలను విజయవంతంగా నిర్వహించిన భారతీయ శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులను గౌరవించడం కోసం 1999 లో మాజీ ప్రధాని శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఈ జాతీయ సాంకేతిక దినోత్సవాన్ని జరుపుకోవడం ప్రారంభించారు. అప్పటి నుండి, ప్రతి సంవత్సరం మే నెల 11వ తేదీన జాతీయ సాంకేతిక దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం.
*****
(Release ID: 1924119)
Visitor Counter : 204