బొగ్గు మంత్రిత్వ శాఖ
బొగ్గు రంగంలో పరిశోధన & అభివృద్ధి ప్రతిపాదనలను కోరిన బొగ్గు మంత్రిత్వ శాఖ
Posted On:
12 MAY 2023 12:33PM by PIB Hyderabad
విద్యా సంస్థ, పరిశోధనా సంస్థల నుంచి పరిశోధనా ప్రతిపాదనలను బొగ్గు మంత్రిత్వ శాఖ ఆహ్వానిస్తోంది. బొగ్గు రంగంలో పరిశోధన & అభివృద్ధి ప్రధాన అంశాలలో దిగువన పేర్కొన్నవి ఉన్నాయిః
(1) భూగర్భ గనులు, ఓపెన్ కాస్ట్ గనుల ఉత్పత్తి& ఉత్పాదకతను మెరుగుపరచడానికి అధునాతన సాంకేతికత/ పద్ధతులు.
(2) పర్యావరణ, ఆరోగ్య, భద్రతను మెరుగుపరచడం
(3) వ్యర్ధాల నుంచి సంపద
(4) బొగ్గు, స్వచ్ఛమైన బొగ్గు సాంకేతికతల ప్రత్యామ్నాయ వినియోగం
(5) బొగ్గు శుద్ధీకరణ, వినియోగం
(6) అన్వేషణ
(7) ఆవిష్కరణ, దేశీకరణ (మేక్-ఇన్- ఇండియా భావన కింద)
మార్గదర్శకాలు, ఫార్మాట్, ఆన్‌లైన్ సమర్పణ సౌకర్యం https://scienceandtech.cmpdi.co.in అన్న వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది, ప్రతిపాదనలను సమర్పించేందుకు ఆఖరు తేదీ 15 జులై, 2023.
ఏదైనా ఇతర సమాచారం/ స్పష్టీకరణ కోసం బొగ్గు మంత్రిత్వ శాఖ యుఎస్ (సిసిటి)కు hitlar.singh85[at]nic[dot]in అన్న ఇమెయిల్ కు లేదా జిఎం (ఎస్&టి), సిఎంపిడిఐ (హెచ్‌క్యూ), gmsnt.cmpdi@coalindia.in అన్న ఇమెయిల్ ఐడి ద్వారా సంప్రదించవచ్చు.
***
(Release ID: 1923750)
Visitor Counter : 176