వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్ సీ ఓ ) స్టార్టప్ ఫోరమ్ 2023


ఎస్ సీ ఓ సభ్య దేశాలలో స్టార్టప్‌ల కోసం ఆవిష్కరణ మరియు ప్రపంచ పరస్పర గోష్ఠిని ప్రోత్సహించడానికి ఎస్ సీ ఓ స్టార్టప్ ఫోరమ్ మూడవ ఎడిషన్

Posted On: 11 MAY 2023 4:29PM by PIB Hyderabad

వర్చువల్ మోడ్‌లో రెండు విజయవంతమైన ఎడిషన్‌ల తర్వాత, స్టార్టప్ ఇండియా, డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఫర్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్, వాణిజ్య మంత్రిత్వ శాఖ  తొలిసారిగా  షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్ సీ ఓ ) స్టార్టప్ ఫోరమ్ మూడవ ఎడిషన్‌ను భౌతిక రూపంలో ఇటీవల న్యూఢిల్లీలో నిర్వహించింది. ఎస్ సీ ఓ  సభ్య దేశాల మధ్య  పరస్పర చర్యలను విస్తరించడం, ఆవిష్కరణల స్ఫూర్తిని పెంపొందించడం, మరింత ఉపాధిని సృష్టించడం మరియు వినూత్న పరిష్కారాలను రూపొందించడానికి యువ ప్రతిభను ప్రోత్సహించడం లక్ష్యంగా ఈ పరస్పరగోష్ఠి జరిగింది.

 

ఫోరమ్‌లో ప్రభుత్వ అధికారులు, ప్రైవేట్ పరిశ్రమలు, ఇంక్యుబేటర్లు మరియు స్టార్టప్‌ల ప్రతినిధి బృందంతో సహా ఎస్ సీ ఓ  సభ్య దేశాల నుండి భౌతిక హాజరు తో భాగస్వామ్యం పెరిగింది . కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి శ్రీ సోమ్ ప్రకాష్ దేశ ఆర్థిక వ్యవస్థను పెంపొందించడంలో స్టార్టప్ ఎకోసిస్టమ్ పాత్రను ఎత్తిచూపుతూ కీలకోపన్యాసం చేశారు. జాయింట్ సెక్రటరీ, డిపార్ట్‌మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ & ఇండస్ట్రీ, శ్రీమతి మన్మీత్ కౌర్ నందా భారత స్టార్టప్ ప్రయాణం మరియు భారత ప్రభుత్వం స్టార్టప్‌లను ప్రోత్సహించే కార్యక్రమాల గురించి ప్రతినిధి బృందాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.

 

ఈ పరస్పర గోష్ఠి సహకారం మరియు వ్యవస్థాపకత స్ఫూర్తిపై దృష్టి సారించింది. ఇది ఆవిష్కరణ అభివృద్ధిని ప్రోత్సహించడం, ప్రత్యేకించి సార్వత్రిక ప్లాట్‌ఫారమ్‌లను సృష్టించడం మరియు ఎస్ సీ ఓ  సభ్య దేశాలలో ఆలోచనలు మరియు ఉత్తమ అభ్యాసాలను సులభతరం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఎజెండాను ప్రోత్సహించడం మరియు సాధించడం కోసం వివిధ స్టార్టప్-టు-స్టార్టప్ల మధ్య ద్వైపాక్షిక సమావేశాలు జరిగాయి.

 

అంతేకాకుండా, 'స్టార్టప్ పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేయడంలో ద్వైపాక్షిక మరియు బహుపాక్షిక ఎంగేజ్‌మెంట్‌ల పాత్ర'పై స్టార్టప్ ఇండియా నిర్వహించిన వర్క్‌షాప్‌కు కూడా ప్రతినిధులు హాజరయ్యారు. వర్క్‌షాప్‌లో ఈ దేశాల మధ్య సన్నిహిత సంబంధాలను పెంపొందించడానికి మరియు ఎస్ సీ ఓ  దేశాలలో స్టార్టప్ పర్యావరణ వ్యవస్థను పెంపొందించడానికి చేపట్టే వివిధ నమూనాలను  అర్థం చేసుకోవడానికి ఒక పరస్పర గోష్ఠి ఉంది.

 

తర్వాత, ప్రతినిధి బృందం ఢిల్లీలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT)లోని ఫౌండేషన్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్ (FITT)ని సందర్శించింది, అక్కడ స్టార్టప్ ల ప్రదర్శన ఏర్పాటుచేశారు.  భారతీయ స్టార్టప్ పర్యావరణ వ్యవస్థ యొక్క ప్రత్యక్ష అనుభవాన్ని పొందేందుకు ఆహుతులు దీనిని సందర్శించారు. ఈ పర్యటనలో, పాల్గొనేవారికి భారతదేశంలో వ్యవస్థాపకత మరియు వారి వ్యాపారాలను భారతదేశానికి విస్తరించే అవకాశాల గురించి సమాచారం ఇచ్చారు. ఇంక్యుబేటర్ సందర్శన భారతదేశంలో స్కేలింగ్ దశలోవున్న స్టార్టప్‌లకు మద్దతు  నిధులు, మార్గదర్శకత్వం మరియు అవకాశాలను హైలైట్ చేయడంపై దృష్టి సారించింది.

 

ఇటువంటి పరస్పర గోష్ఠికి నాయకత్వం వహించడం ద్వారా, భారతదేశం ఆవిష్కరణల ఆవరణాన్ని విస్తరించే అవకాశాలను పంచుకోవడానికి, మొత్తం పర్యావరణ వ్యవస్థను ఒకదానితో ఒకటి కలపడానికి మరియు ఇతర ఎస్ సీ ఓ  సభ్య దేశాలను ఇలాంటి కార్యక్రమాలను చేపట్టడానికి ప్రేరేపించడానికి ఒక అవకాశాన్ని లభించింది.

 

ఇంతకుముందు, స్టార్టప్ ఇండియా ఎస్ సీ ఓ  సభ్య దేశాల కోసం వివిధ కార్యక్రమాలను నిర్వహించింది: 

 

1. ఎస్ సీ ఓ  స్టార్టప్ ఫోరమ్ 2020: ఎస్ సీ ఓ  స్టార్టప్ ఫోరమ్ ఎస్ సీ ఓ  సభ్య దేశాలలో స్టార్టప్‌ల కోసం బహుపాక్షిక సహకారం మరియు పరస్పర గోష్ఠి కి పునాది వేసింది. 

 

2. ఎస్ సీ ఓ  స్టార్టప్ ఫోరమ్ 2021: రెండు రోజుల ఫోరమ్  భారతీయ సంస్కృతిని ఆగ్మెంటెడ్ రియాలిటీలో  ప్లాట్‌ఫారమ్ ద్వారా ప్రదర్శించారు. ఎస్ సీ ఓ  స్టార్టప్ హబ్, ఎస్ సీ ఓ  స్టార్టప్ ఎకోసిస్టమ్‌ నిర్వహణ కు సంబంధించిన సమగ్ర ఏకీకృత కేంద్రం ఈ ఫోరమ్‌లో ప్రారంభించబడింది. 

 

3. ఫోకస్డ్ మెంటర్‌షిప్ ప్రోగ్రామ్: ఎస్ సీ ఓ  స్టార్టప్ వ్యవస్థాపకులలో సామర్థ్యాన్ని పెంపొందించడానికి, నామినేట్ చేయబడిన స్టార్టప్‌లకు 3-నెలల సుదీర్ఘ వర్చువల్ మెంటర్‌షిప్ సిరీస్ 'స్టార్టింగ్-అప్' ను నిర్వహించింది. 

 

***


(Release ID: 1923422) Visitor Counter : 232