వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

వాణిజ్యం, పెట్టుబడులపై ముగిసిన 6వ భారత్ -కెనడా మంత్రిత్వ స్థాయి చర్చలు; సమన్వయంతో కూడిన పెట్టుబడి ప్రోత్సాహకం, సమాచార మార్పిడి కోసం సహకారాన్ని పెంపొందించుకోవడానికి మంత్రులు శ్రీ పీయూష్ గోయల్, శ్రీమతి మేరీ ఎన్‌జి అంగీకారం


క్లిష్టమైన ఖనిజ సరఫరా గొలుసు స్థితిస్థాపకతను ప్రోత్సహించడానికి జి2జి సమన్వయం ముఖ్యం: శ్రీ గోయల్

కెనడా-ఇండియా సీఈఓ ఫోరమ్‌ను పునఃప్రారంభించడంపై మంత్రులు చర్చ

Posted On: 10 MAY 2023 10:10AM by PIB Hyderabad

కేంద్ర వాణిజ్యం, పరిశ్రమలు, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణీ, జౌళి శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్, కెనడా అంతర్జాతీయ వాణిజ్యం, ఎగుమతి ప్రమోషన్, చిన్న వ్యాపారం, ఆర్థిక అభివృద్ధి మంత్రి  మేరీ ఎన్‌జి,మే 8వ తేదీన ఒట్టావాలో జరిగిన ఆరవ భారత్-కెనడా మంత్రుల స్థాయి డైలాగ్ ఆన్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ (ఎండిటిఐ)కి అధ్యక్షత వహించారు. కెనడా, భారతదేశం మధ్య వాణిజ్య, ఆర్థిక ధృడమైన బంధాన్ని మెరుగుపరిచే చర్యలపై ఇరువురు చర్చించారు. ద్వైపాక్షిక సంబంధాలు,  ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింతగా పెంచుకోవడానికి రెండు దేశాల మంత్రులు అంగీకారానికి వచ్చారు.

జి20 అధ్యక్ష స్థానంలో భారత్ జి20 ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ వర్కింగ్ గ్రూప్‌లో అనుసరిస్తున్న ప్రాధాన్యతలకు మంత్రి మేరీ ఎన్‌జి   తన మద్దతుతెలిపారు. 2023 ఆగస్టులో భారత్‌లో జరగనున్న జి-20 వాణిజ్యం, పెట్టుబడుల మంత్రివర్గ సమావేశంలో పాల్గొనేందుకు తాను ఎదురుచూస్తున్నట్లు ఆమె సూచించారు.

2022లో భారత్-కెనడా ద్వైపాక్షిక వస్తు వాణిజ్యం 8.2 బిలియన్ల అమెరికన్ డాల్లర్ల కు చేరుకుంది, 2021తో పోల్చితే దాదాపు 25% వృద్ధిని నమోదు చేసింది. ద్వైపాక్షిక సంబంధాలను మరింతగా పెంపొందించడంలో సేవల రంగం సహకారాన్ని మంత్రులు నొక్కిచెప్పారు.  ద్వైపాక్షిక సేవల వాణిజ్యాన్ని పెంచడంలో గణనీయమైన సామర్థ్యాన్ని గుర్తించారు. ఇది 2022లో 6.6 బిలియన్ల అమెరికన్ డాలర్ల వద్ద ఉంది.

మౌలిక సదుపాయాల అభివృద్ధికి స్వచ్ఛమైన సాంకేతికతలు, కీలకమైన ఖనిజాలు, ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీలు, పునరుత్పాదక శక్తి/హైడ్రోజన్, ఏఐ వంటి రంగాలలో సహకారాన్ని పెంపొందించుకోవాలని మంత్రులు ఉద్ఘాటించారు. ద్వైపాక్షిక ప్రాముఖ్యత కలిగిన వాణిజ్య పరిష్కారాల అంశాలపై రోజూ చర్చించాలని మంత్రులు తమ అధికారులను కోరారు.

ఇప్పటి వరకు జరిగిన ఏడు విడతలుగా భారత్-కెనడా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పంద చర్చల్లో సాధించిన పురోగతిని మంత్రులు సమీక్షించారు. ఈపిటిఏ ఇతర వాటితోపాటు, వస్తువులు, సేవలు, పెట్టుబడిపై పరస్పర ఒప్పందాలపై చర్చించినట్టు మంత్రులు పునరుద్ఘాటించారు.

చర్చలలో వెల్లడైన ముఖ్య అంశాలు:
2023  అవగాహనా ఒప్పందం (ఎంఓయూ) ద్వారా సమీప భవిష్యత్తులో ఇరు పక్షాల మధ్య సమన్వయ పెట్టుబడి ప్రచారం, సమాచార మార్పిడి, పరస్పర మద్దతు వంటి చర్యల ద్వారా మెరుగైన సహకారాన్ని అన్వేషించడానికి  అంగీకరించాయి.

 

కీలకమైన ఖనిజ సరఫరా గొలుసు స్థితిస్థాపకతను ప్రోత్సహించడానికి జి2జి సమన్వయం ప్రాముఖ్యతపై మంత్రులు అంగీకరించారు. 

కెనడా-ఇండియా సీఈఓ ఫోరమ్‌ను పునరుద్ధరించడంతో పాటు కొత్త ప్రాధాన్యతలతో పునః ప్రారంభించేందుకు ఇద్దరు మంత్రులు అంగీకరించారు. సీఈఓ ఫోరమ్‌ను పరస్పరం అంగీకరించిన ముందస్తు తేదీలో ప్రకటించవచ్చు.

మంత్రి మేరీ ఎన్‌జి 2023 అక్టోబర్‌లో భారత్ కి వచ్చే టీమ్ కెనడా ట్రేడ్ మిషన్‌కు నాయకత్వం వహిస్తానని ప్రకటించారు. దీని కోసం ఆమె పెద్ద వ్యాపార ప్రతినిధి బృందాన్ని తీసుకురావడానికి అవకాశం ఉన్నందున రెండు దేశాల మధ్య వాణిజ్య, పెట్టుబడి సంబంధాలను మరింత మెరుగుపరిచేందుకు ఇది అవకాశం కల్పిస్తుంది.

రెండు దేశాల మధ్య నిపుణులు, విద్యార్థులు, వాణిజ్య వర్గాల రాకపోకలు ద్వైపాక్షిక ఆర్థిక భాగస్వామ్యాన్ని పెంపొందించడంలో ఉపయోగపడుతుందని ఇరువురు మంత్రులు గుర్తించారు. 

 

***



(Release ID: 1923114) Visitor Counter : 140