గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ
ఈశాన్య రాష్ట్రాల్లో భూమి వినియోగం పై టాస్క్ ఫోర్స్ నియామకం
प्रविष्टि तिथि:
10 MAY 2023 11:23AM by PIB Hyderabad
అభివృద్ధి సాధించడానికి భూమి రికార్డుల ఆధునీకరణ, రికార్డుల డిజిటలైజేషన్ అవసరమని “ఈశాన్య రాష్ట్రాల్లో భూ పరిపాలన” అనే అంశంపై ఇటీవల జరిగిన జాతీయ సదస్సు అభిప్రాయపడింది. గౌహతిలో 2003 మే 3,4 తేదీల్లో “ఈశాన్య రాష్ట్రాల్లో భూ పరిపాలన” అనే అంశంపై అస్సాం, త్రిపుర, మిజోరం మరియు మేఘాలయ రాష్ట్రాలకు చెందిన ప్రాదేశిక, స్వయంప్రతిపత్త జిల్లా కౌన్సిల్‌లు జాతీయ సమావేశం జరిగింది. అస్సాం ప్రభుత్వ రెవెన్యూ శాఖ సహకారంతో లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, ముస్సోరి ఆధ్వర్యంలో సదస్సు జరిగింది. అభివృద్ధి సాధించడానికి భూమి రికార్డుల ఆధునీకరణ, రికార్డుల డిజిటలైజేషన్ అవసరమన్న అభిప్రాయాన్ని సదస్సు వ్యక్తం చేసింది. భూ వనరుల శాఖ కార్యదర్శి శ్రీ అజయ్ టిర్కీ అధ్యక్షతన జరిగిన సదస్సులో భూ వనరుల శాఖ;సంయుక్త కార్యదర్శి శ్రీ సోన్మోని బోరా,అస్సాం ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ జ్ఞానేంద్ర దేవ్ త్రిపాఠి, లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, ముస్సోరి డిప్యూటీ డైరెక్టర్ శ్రీమతి ఆనంది,సర్వే ఆఫ్ ఇండియా అదనపు సర్వేయర్ జనరల్ శ్రీ పి.వి. రాజశేఖర్, ప్రపంచ బ్యాంక్ సోషల్ డెవలప్‌మెంట్ సీనియర్ స్పెషలిస్ట్ శ్రీమతి మృదులా సింగ్ ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు. బోడోలాండ్ టెరిటోరియల్ కౌన్సిల్, కర్బీ అంగ్లాంగ్ అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్, డిమా హసావో అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ ( అస్సాం) , త్రిపుర గిరిజన ప్రాంతాల అటానమస్ కౌన్సిల్, మిజోరం లై అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్, ఖాసీ హిల్స్ అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్, గారో హిల్స్ అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్, జైంతియా హిల్స్ అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ ( మేఘాలయ) ప్రతినిధులు జాతీయ సదస్సులో పాల్గొన్నారు.
భూ రికార్డుల అంశంపై తొలిసారిగా జాతీయ స్థాయిలో జరిగిన సదస్సులో ప్రస్తుతం అమలు జరుగుతున్న విధానాలు, భూ రికార్డుల ఆధునీకరణ,భూ నిర్వహణ వ్యవస్థ, సాంప్రదాయ దేశీయ చట్టాలు, ప్రస్తుతుకం అమలు జరుగుతున్న విధానాలు, భూమి రికార్డుల ఆధునీకరణలో సర్వే ఆఫ్ ఇండియా పాత్ర అనే అంశాలపై చర్చలు జరిగాయి. భూ రికార్డులు , మ్యాప్‌ల కంప్యూటరీకరణ , డిజిటలైజేషన్ కార్యక్రమాలు అస్సాంలోని బోడోలాండ్ టెరిటోరియల్ కౌన్సిల్, కర్బీ అంగ్లాంగ్ అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ మరియు డిమా హసావో అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ పరిధిలోని ప్రాంతాలలో మినహా మిగిలిన ప్రాంతాల్లో పురోగతి సాధించినట్టు సదస్సు గుర్తించింది. బోడోలాండ్ లో త్వరలో భూ విధానం సిద్ధం అవుతుందని భావిస్తున్నారు. కర్బీ అంగ్లాంగ్ ప్రాంతాల్లో సర్వే, సెటిల్‌మెంట్ జరగలేదు. అస్సాం ల్యాండ్ రెగ్యులేషన్ యాక్ట్‌ను దిమా హసావో అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ ఆమోదించింది. త్రిపుర గిరిజన ప్రాంతాల అటానమస్ కౌన్సిల్ పరిధిలో ఎనిమిది జిల్లాలు, 10,000 చ.కి.మీ.భూమి ఆరవ షెడ్యూల్, 10 సంప్రదాయ చట్టాల పరిధిలో ఉన్నాయి. నాన్-కాడాస్ట్రల్ ఏరియాలో ఉన్న ఈ భూముల సర్వే జరగాల్సి ఉంది. లై అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ ప్రాంతంలో ఆరవ షెడ్యూల్‌లో ఉన్నభూముల సర్వే/పునరుద్ధరణ అవసరమని భావించారు. మేఘాలయలోని ఖాసీ హిల్స్ అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ ప్రాంతాల్లో ఎక్కువ భూమి ప్రజల యాజమాన్యంలో ఉంది.వార్షిక పట్టాలు జారీ చేసే విధానాన్ని గారో హిల్స్ అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ జిల్లా కౌన్సిల్ అమలు చేస్తోంది. మేఘాలయ ల్యాండ్ సర్వే అండ్ రికార్డ్స్ ప్రిపరేషన్ యాక్ట్ 1980 ని జైంతియా హిల్స్ అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ మేఘాలయ అమలు చేస్తోంది.
సదస్సు నిర్వహణ పట్ల హర్షం వ్యక్తం చేసిన భూ వనరుల శాఖ కార్యదర్శి శ్రీ అజయ్ టిర్కీ, లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీమతి ఆనంది ఈశాన్య రాష్ట్రాల్లో స్వయం ప్రతిపత్తి కలిగిన వివిధ జిల్లా కౌన్సిళ్లలో భూ రికార్డుల డిజిటలైజ్ చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. భూ రికార్డులను ఆధునీకరించడం ద్వారా డిజిటలైజేషన్ సాధించవచ్చునని అన్నారు. భూ రికార్డుల ఆధునీకరణ, డిజిటలైజేషన్ కోసం చట్ట నిబంధనల ప్రకారం సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. భూ రికార్డుల ఆధునీకరణ, డిజిటలైజేషన్ కోసం బోడోలాండ్ టెరిటోరియల్ కౌన్సిల్ చేసిన ప్రతిపాదనకు భూ వనరుల శాఖ ఆమోదం తెలిపింది. ఈశాన్య రాష్ట్రాల్లో చేపట్టాల్సిన కార్యక్రమాల పరిమాణాన్ని పరిశీలించి ఈశాన్య రాష్ట్రాలలో అధీకృత సంస్థలతో సంప్రదింపులు జరిపిన తర్వాత భూ పరిపాలన కోసం ఒక టాస్క్ ఫోర్స్‌ను భూ వనరుల శాఖ కార్యదర్శి నెలకొల్పుతారని సమాచారం. డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ మోడరనైజేషన్ ప్రోగ్రామ్ కింద భూ రికార్డుల డిజిటలైజేషన్ మరియు ఆధునీకరణ కోసం తమ ప్రతిపాదనలను పంపవలసిందిగా వివిధ స్వయంప్రతిపత్త జిల్లా కౌన్సిల్‌లను సంయుక్త కార్యదర్శి శ్రీ సోన్మోని బోరా కోరారు. జాతీయ సదస్సు నిర్వహణకు సహకరించిన అస్సాం ప్రభుత్వానికి లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీమతి ఆనందికి ధన్యవాదాలు తెలిపారు.
***
(रिलीज़ आईडी: 1923111)
आगंतुक पटल : 243