సూక్ష్మ‌, లఘు, మధ్య త‌ర‌హా సంస్థల మంత్రిత్వ శాఖష్
azadi ka amrit mahotsav

అస్సోంలోని లబ్ధిదారుల స్వయం ఉపాధికి ప్రాధాన్యతనిస్తూ తేనెటీగల పెట్టెలు, ఊరగాయ తయారీ యంత్రాలు, ఆటోమేటిక్ అగర్బత్తి యంత్రాలను పంపిణీ చేసిన కేవీఐసీ ఛైర్మన్

Posted On: 09 MAY 2023 3:41PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ గారి 'ఆత్మనిర్బర్ భార‌త్' దృక్పథాన్ని స‌పూర్తి చేసేందుకు సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలోని 'ఖాదీ అండ్ విలేజ్ ఇండ‌స్ట్రీస్ క‌మీషన్' (కేవీఐసీ) చైర్మన్ శ్రీ మనోజ్ కుమార్ సోమవారం అస్సోంలో జిరిగిన మూడు వేర్వేరు కార్యక్రమాలలో ప్రారంభించారు. వివిధ కార్యక్రమాల్లో భాగంగా లబ్ధిదారులకు తేనెటీగల పెట్టెలు, పచ్చళ్ల తయారీ యంత్రాలు, ఆటోమేటిక్ అగర్బత్తి యంత్రాలను పంపిణీ చేశారు.  తాముల్‌పూర్‌లోని కుమారికత గ్రామంలో 50 మంది తేనెటీగల పెంపకందారులకు 500 తేనెటీగల పెట్టెలను పంపిణీ చేశారు, గౌహతిలోని కేవీఐసీ కాంప్లెక్స్‌లో లబ్ధిదారులకు 40 ఊరగాయల తయారీ యంత్రాలను మరియు 20 ఆటోమేటిక్ అగర్బత్తి తయారీ యంత్రాలను అందజేశారు. గ్రామోద్యోగ్ వికాస్ యోజన కింద సిక్స్-మైల్ గౌహతిలో పాదరక్షల పరిశ్రమకు సంబంధించిన పైలట్ ప్రాజెక్ట్ కూడా ప్రారంభించారు. హనీ మిషన్ ద్వారా అస్సాంలోని బోడోలాండ్‌లోని రైతు సమాజానికి ప్రయోజనం చేకూర్చడానికి… ఈ స్పష్టమైన పిలుపుని గత ఏడాది ఇదే నెలలో కేంద్ర హోం మంత్రి & సహకార మంత్రి శ్రీ అమిత్ షా తమూల్‌పూర్‌లో తన బహిరంగ ప్రసంగంలో చేశారు. తాముల్‌పూర్‌లో జరిగిన సమావేశంలో ఛైర్మన్ ప్రసంగిస్తూ, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కృషి చేస్తున్న స్వావలంబన భారతదేశం యొక్క మంత్రం - ప్రతి చేతికి పని, మరియు పనికి తగిన సంపద అందించడం దీని ఉద్దేశమని అన్నారు.  దీనిని అనుసరించి, దేశంలోని గ్రామాలు మరియు పట్టణాలలో కేవీఐసీ పథకాలను అమలు చేస్తోంది. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్వీట్ రెవల్యూషన్ పిలుపు మేరకు ఖాదీ మరియు గ్రామ పరిశ్రమల కమిషన్ జాతీయ స్థాయిలో 2017 సంవత్సరం నుండి హనీ మిషన్ పథకాన్ని అమలు చేస్తోందని ఆయన అన్నారు.  ఈ పథకం కింద, అస్సోం రాష్ట్రంలోని 829 తేనెటీగల పెంపకందారులకు శిక్షణ తర్వాత.. 8290 తేనెటీగల పెట్టెలు మరియు తేనెటీగల కాలనీలు పంపిణీ చేయబడ్డాయి. శ్రీ కుమార్ తేనెటీగల పెంపకందారులను ప్రపంచ స్థాయి తేనెను ఉత్పత్తి చేయమని ప్రోత్సహించారు, తద్వారా అస్సాంలోని 'స్థానిక తేనె'కు 'గ్లోబల్' గుర్తింపు లభిస్తుంది. వ్యవసాయ ఉత్పత్తిని పెంచడంతో పాటు తేనెటీగల పెంపకం రైతుల ఆదాయాన్ని కూడా పెంచుతుందన్నారు. అంతే కాకుండా అటవీ ప్రాంతానికి ఆనుకుని ఉన్న గ్రామాల్లో తేనెటీగల పెట్టెల ద్వారా ఏనుగులు మనుషుల ఆవాసాలు, రైతుల పొలాల్లోకి రాకుండా అడ్డుకుంటున్నారని, దీంతో మానవుల దాడులు, ఏనుగుల వల్ల రైతుల పంటలు దెబ్బతినడం తగ్గింది. అసోంలోని గోల్‌పరా జిల్లాలోని మోర్నోయి, దహికత, రాజపర మరియు కడమ్‌తలా గ్రామాలలో ఖాదీ మరియు విలేజ్ ఇండస్ట్రీస్ కమీషన్ ద్వారా ప్రాజెక్ట్ రీ-హాబ్ కింద అలాంటి ఒక ప్రయత్నాన్ని నిర్వహిస్తున్నట్లు చైర్మన్ తెలియజేశారు. గౌహతిలోని కేవీఐసీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 40 మంది లబ్ధిదారులకు ఊరగాయ తయారీ యంత్రాలను, 20 మంది లబ్ధిదారులకు ఆటోమేటిక్ అగర్బత్తి తయారీ యంత్రాలను చైర్మన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా యువకులు, మహిళల స్వయం ఉపాధి కోసం కేవీఐసీ ద్వారా జాతీయ స్థాయిలో అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమంపై చిన్న పరిశ్రమల స్థాపనకు రూ.50 లక్షల వరకు సాయం అందిస్తున్న విషయాన్ని వివరించారు. ప్రాజెక్ట్ వ్యయంలో గరిష్టంగా 35% వరకు గ్రాంట్ భారత ప్రభుత్వం ద్వారా ఇవ్వబడుతుంది. 2014 తర్వాత ఖాదీ రంగానికి ప్రధానమంత్రి నిర్ధేశించిన లక్ష్యాలు కొత్త జీవితాన్ని నింపాయని చైర్మన్ పంచుకున్నారు. ఖాదీ ఇప్పుడు స్థానికంగా మారిపోయిందన్నారు. దీని ఫలితంగా, 2021-22 ఆర్థిక సంవత్సరంలో, ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల ఉత్పత్తుల టర్నోవర్ 1,15,000 కోట్లను దాటింది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తొలిసారిగా ఇలా జరిగింది. ఖాదీ కళాకారుల ఆర్థిక స్థితిని మెరుగుపరిచేందుకు, ఖాదీ అమ్మకాలను మెరుగుపరచడానికి, ఖాదీలో పనిచేస్తున్న కళాకారులందరికీ ఏప్రిల్ 1, 2023 నుండి 35% వేతనం పెంచాలని కమిషన్ నిర్ణయించిందని శ్రీ మనోజ్ కుమార్ తెలిపారు. దానికదే ఒక చారిత్రాత్మ అడుగు అని వివరించారు.  2014 నుంచి ఖాదీ కళాకారులకు 150 శాతానికి పైగా పారితోషికం పెంచామన్నారు. శ్రీ జోలెన్ డైమరీ, ఎమ్మెల్యే, తాముల్పూర్ మరియు శ్రీ సిద్ధార్థ్ భట్టాచార్య, ఎమ్మెల్యే, గౌహతి (తూర్పు), అధికారులు మరియు ప్రభుత్వ ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

 

***


(Release ID: 1923010) Visitor Counter : 127