ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

వైపరీత్యాలను తట్టుకునే మౌలిక వసతుల అంతర్జాతీయ సదస్సును ఉద్దేశించి ప్రధానమంత్రి వీడియో సందేశం

Posted On: 04 APR 2023 10:31AM by PIB Hyderabad

 

 

నమస్కారం

గౌరవ అతిథులుప్రభుత్వాధినేతలువిద్యావేత్తలువ్యాపారవేత్తలువిధానకర్తలుప్రపంచం మొత్తం నుండి వచ్చిన నా ప్రియ మిత్రులారా !

ప్రతి ఒక్కరికీ  అభివాదంభారతదేశానికి స్వాగతంతొలుత వైపరీత్యాలను తట్టుకోగల మౌలిక వసతుల కూటమికి అభినందనలుఇది తొలుత వైపరీత్యాలను తట్టుకోగల మౌలిక వసతుల కూటమి 5 సమావేశంఐసిడిఆర్ఐ-2023 నిజంగా ప్రత్యేకమైనది.

మిత్రులారా,

ప్రపంచ దృక్కోణం నుంచి సిడిఆర్ఐ ఆవిర్భవించింది.  సన్నిహితంగా అనుసంధానమైన  ప్రపంచంలో వైపరీత్యాల ప్రభావం స్థానికం కానే కాదుఒక ప్రాంతంలో ఏర్పడే వైపరీత్యం పూర్తిగా వేరుగా ఉన్న ప్రాంతంఫై తీవ్ర ప్రభావం చూపుతుందిఅందుకే మన స్పందన కూడా ఏకాకిగా కాకుండా ఉమ్మడిగా ఉండాలి.  

మిత్రులారా

అతి తక్కువ కాలంలోనే 40 దేశాలు సిడిఆర్ఐలో భాగంగా చేరాయి.  ఈ సదస్సు అతి ప్రధానమైన వేదికగా మారుతోంది. అభివృద్ధి చెందిన దేశాలు, వర్థమాన దేశాలు;  పెద్ద, చిన్న దేశాలు, ప్రపంచ ఉత్తరాది, దక్షిణాది దేశాలు ఈ వేదికపై ఒక్కటవుతున్నాయి.  ఇందులో భాగస్వామ్యం కేవలం  ప్రభుత్వాలకే పరిమితం కాకపోవడం ప్రోత్సాహకరం. ప్రపంచ స్థాయి సంస్థలు, ఈ రంగ నిపుణులు, ప్రైవేట్ రంగం కూడా ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నాయి. 

మిత్రులారా

మనం మౌలిక వసతుల గురించి చర్చించినప్పుడు ప్రాధాన్యతలను గుర్తు పెట్టుకోవాలి.  వైపరీత్యాలను తట్టుకునేసమ్మిళిత మౌలిక వసతులు అనేది  ఏడాది సిడిఆర్ఐ ప్రధాన థీమ్. మౌలిక వసతులు కేవలం ఫలితాలకే పరిమితం కాదు... పరిధికి కూడా సంబంధించినవి. మౌలిక వసతులు ఏ ఒక్కరినీ వదిలివేయవు...సంక్షోభ సమయంలో ప్రజలకు సేవలు అందిస్తాయి.  మౌలిక వసతుల విషయంలో సంపూర్ణ దృక్పథం అవసరం. రవాణా మౌలిక వసతుల వలెనే సామజిక, డిజిటల్ మౌలిక వసతులు కూడా అవసరం. 

మిత్రులారా,

వైపరీత్యాల సమయంలో మన హృదయాలు బాధితుల గురించి బాధ పడడం  సహజంసహాయపునరావాస చర్యలకు ప్రాధాన్యత ఉంటుందివైపరీత్యాలను తట్టుకోవడం అంటే ఎంత తొందరగా సాధారణ జన జీవనాన్ని పునరుద్ధరిస్తామనేదేఒక వైపరీత్యం నుండి మరో వైపరీత్యం మధ్యన నిర్మాణాత్మక చర్యలు చేపట్టడమే.  గతంలో ఏర్పడిన వైపరీత్యాల గురించి అధ్యయనం చేసి వాటి నుంచి పాఠాలు నేర్చుకోవాలిఇక్కడే సిడిఆర్ఐ, ఈ సదస్సు ప్రధాన పాత్ర పోషిస్తాయి.  

మిత్రులారా,

ప్రతీ ఒక్క దేశంప్రాంతం వేర్వేరు స్వభావం గల వైపరీత్యాలు ఎదుర్కొంటూ ఉంటుంది.  ఆయా ప్రాంతాల్లో వైపరీత్యాలను తట్టుకునే మౌలిక వసతులేవి అనేది స్థానిక సమాజాలకు అవగాహన ఉంటుందిఆధునిక మౌలిక వసతులు నిర్మించే విషయంలో  పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవచ్చుస్థానిక పరిజ్ఞానంతో మిళితమైన ఆధునిక టెక్నాలజీ ఇలాంటి మౌలిక వసతులకు ఎంతో ఉపయోగపడుతుందిఅంతే కాదు స్థానిక టెక్నాలజీని గ్రంధస్థం చేసి ఉంటే అది ప్రపంచ స్థాయిలో అత్యుత్తమైన ప్రాక్టీస్ అవుతుంది.

మిత్రులారా,

సిడిఆర్ఐ తీసుకున్న కొన్ని చర్యలు సమ్మిళిత వైఖరిని చాటుతున్నాయి. ద్వీపకల్ప దేశాలు లేదా పలు ఇతర దేశాలకు మౌలిక వసతులు కీలకంగా ఉంటాయి. ఈ దేశాలు చిన్నవే కావచ్చు...కానీ అక్కడ నివసించే మనుషుల జీవితమే మనందరికీ ప్రధానం.  గత ఏడాది మౌలిక వసతుల ఆక్సిలేటర్ ఫండ్  ను ప్రకటించడం జరిగింది 50 మిలియన్  డాలర్ ఫండ్  వర్తమాన దేశాల్లో అద్భుతమైన  ఆసక్తిని రేకెత్తించిందిఇలాంటి కార్యక్రమాలకు ఆర్థిక వనరులు అత్యంత ప్రధానం 

మిత్రులారా

ఇటీవల ఎదురైన వైపరీత్యాలు వాటి పరిధి ఎంత విస్తృతం అనేది మనకి తెలియజేశాయి.  కొన్ని ఉదాహరణలు చెబుతానుభారతయూరప్ దేశాల్లో వడగాలులు సహజం.  పలు ద్వీప దేశాలు భూకంపాలుతుపానులు,  అగ్ని పర్వతాలు పేలడం వంటి వైపరీత్యాలు ఎదుర్కొంటూ ఉంటాయి.  తుర్కియేసిరియాల్లో ఏర్పడిన భూకంపాలు ప్రజల జీవితాలుఆస్తులకు తీవ్ర నష్టం కలిగించాయి.   ఇలాంటి సమయంలో మీ అందరి కృషి ఎంతో కీలకంగా నిలిచిందిఇప్పుడు సిడిఆర్ఐఫై భారీ అంచనాలున్నాయి.  

మిత్రులారా,

 ఏడాది భారతదేశం జి-20 అధ్యక్షత ద్వారా ప్రపంచం యావత్తునూ ఒక్కటి చేస్తోంది.  జి-20 అధ్యక్ష హోదాలో పలు కార్యాచరణ బృందాల్లో సిడిఆర్ఐని కూడా చేర్చడం జరిగింది. ఇక్కడ మీరు కనుగొనే పరిష్కారాలు ప్రపంచ దేశాల్లో అత్యున్నత స్థాయిలో విధానకర్తల దృష్టిని ఆకర్షిస్తాయి. వైపరీత్యాలను తట్టుకోగల మౌలిక వసతులు ప్రత్యేకించి వాతావరణ రిస్క్  లు, వైపరీత్యాలను తట్టుకోగలవి రూపొందించేందుకు సిడిఆర్ఐకి ఇది చక్కని అవకాశం. మరింత తట్టుకోగల మౌలిక వసతులు నిర్మించాలనే భాగస్వామ్య  దృక్పథానికి ఐసిడిఆర్ఐ-2023లో జరిగే చర్చలు చక్కని మార్గం చూపుతాయని నేను విశ్వసిస్తున్నాను.  


(Release ID: 1922467) Visitor Counter : 136