సూక్ష్మ, లఘు, మధ్య తరహా సంస్థల మంత్రిత్వ శాఖష్
ఆత్మనిర్భర్ భారత్‌ను సాధించేందుకు ఎంఎస్ఎంఇల ఆధునిక ఉత్పాదక సామర్ధ్యాలను ప్రోత్సహించేందుకు నిర్మాణాత్మక చొరవలు, దిగుమతి ప్రత్యామ్నాయం కోసం ఆరోగ్యాన్ని గుర్తించినట్టు తెలిపిన శ్రీ నారాయణ్ రాణె
Posted On:
04 MAY 2023 5:24PM by PIB Hyderabad
కేంద్ర ఎంఎస్ఎంఇ మంత్రి శ్రీ నారాయణ్ రాణె 3మే 2023న న్యూఢిల్లీలో ఇండియా హెల్త్ డైలాగ్ (ఐహెచ్‌డి - భారత ఆరోగ్య గోష్ఠి)ని ప్రారంభించారు. కార్యక్రమానికి హాజరైన వారిని ఉద్దేశించి ప్రసంగిస్తూ, అన్ని అంశాలలోనే భారత్‌ను అంతర్జాతీయ ఉత్పాదక కేంద్రంగా, ఆత్మనిర్భరత కలిగిన దానిగా మార్చాలన్న గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీజీ దార్శనిక, ప్రేరణాత్మక నాయకత్వంలో దేశ భవిష్యత్ కోసం బలమైన అంతర్జాతీయ సరఫరా లంకెలను నిర్మించడం కోసం ఎంఎస్ఎంఇ మంత్రిత్వ శాఖ పని చేస్తోందని శ్రీ రాణె పేర్కొన్నారు.
ఆత్మనిర్భర్ భారత్‌ను సాధించేందుకు ఎంఎస్ఎంఇల ఆధునిక ఉత్పాదక సామర్ధ్యాలను ప్రోత్సహించడం వంటి నిర్మాణాత్మక చొరవల కోసం, ఆరోగ్య రంగంలో ఎగుమతులను ప్రోత్సహించడం కోసం దిగుమతి ప్రత్యామ్నాయంగా ఆరోగ్యాన్ని గుర్తించి, ఐహెచ్‌డితో భాగస్వామ్యాన్ని తమ మంత్రిత్వ శాఖ కలిగి ఉంటోందని ఆయన అన్నారు.
భారత్ స్వావలంబన (ఆత్మనిర్భర్ భారత్)ను సాధించేందుకు కృషి చేస్తున్న క్రమంలో భవిష్యత్ సంసిద్ధత కలిగిన సాంకేతికతలు, ఆవిష్కరణలు ఆరోగ్య రంగంలోని ప్రతి అంశాన్ని పరివర్తనకు లోను చేస్తాయని న్యూఢిల్లీలోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్), ఎయిమ్స్ లో ప్రారంభించిన ఇండియా హెల్త్ డైలాగ్ లో పాల్గొన్న ప్రపంచ అగ్ర ఆరోగ్య పరిశ్రమ నిపుణులు, పరిశ్రమ నాయకులు అభిప్రాయపడ్డారు. భవిష్యత్ భారత్‌లో అత్యాధునిక సాంకేతికతలు ఆధిపత్యం వహించనున్నాయని, అధునాతన ఉత్పాదక పర్యావరణ వ్యవస్థను నిర్మించడంలో ఆరోగ్యం, ఆరోగ్య సంరక్షణలో భారత్‌ను ఉత్పాదక కేంద్రంగా మార్చడంలోను, భారత్‌ను ఆత్మనిర్భర్ భారత్‌గా మార్చడంలోనూ ఎంఎస్ఎంఇ మంత్రిత్వ శాఖ పాత్ర కీలకమన్నది వారి అభిప్రాయం.
ఆరోగ్యాన్ని విప్లవీకరించేందుకు బలమైన పార్యవరణ వ్యవస్థను , భవిష్యత్ కోసం ఆరోగ్య సంరక్షణ రంగాన్ని నిర్మించేందుకు భారత ఎంఎస్ఎంఇ మంత్రిత్వ శాఖ మద్దతుతో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఎ) సమన్వయంతో ఇండియన్ చాంబర్ ఆఫ్ బిజినెస్ అండ్ కామర్స్ ప్రారంభించిన ప్రపంచ చొరవ అయిన ఇండియా హెల్త్ డైలాగ్ అన్నది భాగస్వామ్య, వాటాదారుల వేదిక.
ఆరోగ్య సంరక్షణ రంగంలో ఆత్మనిర్భర్ భారత్‌ను ప్రోత్సహించేందుకు బలమైన పర్యావరణ వ్యవస్థను నిర్మించేందుకు, మార్పుకు తోడ్పడేందుకు ముందు వరుసలో ఉండే సమగ్ర వేదికగా ఐహెచ్‌డిని నిర్ధిష్టంగా రూపకల్పన చేసినట్టు ఇండియా ఛాంబర్ అధ్యక్షుడు, సిఇఒ శ్రీ నితిన్ పంగోత్రా పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు తమ తమ రాష్ట్రాలలో వ్యాపార, పెట్టుబడి అవకాశాలను ప్రదర్శించేందుకు గొప్ప అవకాశాన్ని కల్పించే వేదిక ఇది అని ఆయన అన్నారు. ఆరోగ్య పరిశోధన కార్యదర్శి డాక్టర్ రాజీవ్, ఐసిఎంఆర్ డిజి డాక్టర్ రాజీవ్ బాల్ ఇండియా హెల్త్ డైలాగ్ (ఐహెచ్‌డి)ని ఐసిఎంఆర్ ఆవరణలో ప్రారంభించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
****
(Release ID: 1922218)
Visitor Counter : 171