శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
భారతదేశం-ఇజ్రాయెల్ ల మధ్య మైత్రి - పారిశ్రామిక పరిశోధన మరియు అభివృద్ధి సహకారం లో కొత్త శకం ప్రారంభం
భారత ప్రభుత్వం సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కు చెందిన కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR) మరియు ఇజ్రాయెల్ రాష్ట్ర రక్షణ మంత్రిత్వ శాఖ (IMoD) యొక్క డైరెక్టరేట్ ఆఫ్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ (DDR&D) ల మధ్య పారిశ్రామిక పరిశోధన మరియు అభివృద్ధి సహకారం కోసం అవగాహన ఒప్పందంపై సంతకం చేశారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటం మరియు సెమీకండక్టర్స్, సింథటిక్ బయాలజీ మొదలైన హై టెక్నాలజీ రంగాలలో భారతదేశం మరియు ఇజ్రాయెల్ ల మధ్య మరింత సహకారం
పోస్ట్ చేసిన తేదీ: 04 మే 2023 ఉదయం 10:43 పి ఐ బి ఢిల్లీ ద్వారా
Posted On:
04 MAY 2023 10:43AM by PIB Hyderabad
భారతదేశం మరియు ఇజ్రాయెల్ మధ్య సైన్స్ అండ్ టెక్నాలజీ సహకారంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా, భారత ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MoST) ఆధ్వర్యంలోని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR) మరియు ఇజ్రాయెల్ దేశ రక్షణ మంత్రిత్వ శాఖ కు చెందిన డైరెక్టరేట్ ఆఫ్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ (DDR&D) ల మధ్య పారిశ్రామిక పరిశోధన మరియు అభివృద్ధి సహకారం కోసం అవగాహన ఒప్పందం పై (MOU) సంతకం చేశారు.
గౌరవ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎర్త్ సైన్సెస్ మంత్రి మరియు సీ ఎస్ ఐ ఆర్ సొసైటీ వైస్ ప్రెసిడెంట్ ఈ సమావేశానికి హాజరైనందుకు మరియు సీ ఎస్ ఐ ఆర్ కి వారందిస్తున్న నిరంతర మద్దతు కు డాక్టర్ ఎన్ కళైసెల్వి, డీ జీ, సీ ఎస్ ఐ ఆర్ మరియు సెక్రటరీ, డీ ఎస్ ఐ ఆర్ ధన్యవాదాలు తెలిపారు. ఆమె విదేశీ ప్రముఖులను స్వాగతించారు మరియు సీ ఎస్ ఐ ఆర్ యొక్క దార్శనికత స్థూలదృష్టిని వివరించారు. సీ ఎస్ ఐ ఆర్ సాంకేతిక మరియు పరిశోధనా నైపుణ్యం మరియు డీ డీ ఆర్ అండ్ డీ, ఇజ్రాయెల్‌తో వైమానిక, వైద్య, ఇంధన రంగాల్లో కొనసాగుతున్న సహకార చర్చలను కూడా ఆమె గుర్తుచేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటం మరియు సెమీకండక్టర్స్, సింథటిక్ బయాలజీ మొదలైన అత్యున్నత సాంకేతిక రంగాలలో ఇజ్రాయెల్‌తో సహకారాన్ని పెంపొందించడం కోసం సీ ఎస్ ఐ ఆర్ యొక్క ప్రాధాన్యతా అంశాలను పంచుకోవడం ద్వారా డీ డీ ఆర్ అండ్ డీ ఆసక్తిని ఆమె స్వాగతించారు.
సీ ఎస్ ఐ ఆర్ తో కొనసాగుతున్న సహకార ప్రయత్నాలను గుర్తిస్తూ, డీ డీ ఆర్ అండ్ డీ హెడ్ డా. డేనియల్ గోల్డ్, సీ ఎస్ ఐ ఆర్- డీ డీ ఆర్ అండ్ డీ సహకారం రెండు దేశాల సంక్షేమానికి ప్రయోజనకరంగా ఉంటుందని అభిలషించారు. డీ డీ ఆర్ అండ్ డీ కేవలం ఆర్ అండ్ డీ సంస్థలతో మాత్రమే కాకుండా స్టార్టప్‌లు మరియు కంపెనీలు, వెంచర్ క్యాపిటల్స్‌తో రెండు వైపులాసహకారాన్ని స్వాగతిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇజ్రాయెల్ బలాలైన ఏ ఐ మరియు ఫోటోనిక్స్ తో పాటు మెరుగైన భవిష్యత్తు నిర్మాణానికి మార్గం సుగమం చేసే హై టెక్నాలజీ రంగాలలో సీ ఎస్ ఐ ఆర్ తో సహకారాన్ని స్వాగతించారు.
భారతదేశం-ఇజ్రాయెల్ మధ్య మూడు దశాబ్దాల విజయవంతమైన దౌత్య సంబంధాలను విజయవంతంగా పూర్తి చేసిన విషయాన్ని నొక్కి చెబుతూ, భారతదేశంలోని ఇజ్రాయెల్ రాయబారి శ్రీ నౌర్ గిలోన్, ఇజ్రాయెల్ మరియు భారతదేశం మధ్య సన్నిహిత స్నేహ సంబంధాల గురంచి గుర్తు చేశారు. ఇది 2018లో రెండు దేశాల ప్రధానమంత్రుల అభినందన పర్యటనల తర్వాత వ్యూహాత్మక భాగస్వామ్యంగా ఎదిగింది. ప్రస్తుత సీ ఎస్ ఐ ఆర్-డీ డీ ఆర్ అండ్ డీ సహకారం భారతదేశం-ఇజ్రాయెల్ సంబంధాలలో మరో మైలురాయిగా అభివర్ణించారు.
గౌరవ భారత ప్రభుత్వ ఎస్ & టీ మంత్రి మరియు సీ ఎస్ ఐ ఆర్ సొసైటీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ జితేంద్ర సింగ్ సమక్షంలో సీ ఎస్ ఐ ఆర్- డీ డీ ఆర్ అండ్ డీ ఎంఓయూపై డాక్టర్ ఎన్ కలైసెల్వి మరియు డాక్టర్ డానియల్ గోల్డ్ లు సంతకాలు చేశారు.
పరస్పర అంగీకారయోగ్యమైన పారిశ్రామిక సాంకేతిక రంగాలలో నిర్దిష్ట ప్రాజెక్టుల అమలు ద్వారా పారిశ్రామిక ఆర్ అండ్ డీ కార్యక్రమాలలో సహకారాన్ని ఎమ్ఒయు అనుమతిస్తుంది. ఈ సహకారం వైద్య రంగం తో సహా ఏరోస్పేస్ & ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్; సివిల్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ & ఇంజనీరింగ్; రసాయనాలు మరియు పెట్రోకెమికల్స్, శక్తి పరికరాలతో సహా సు హరిత శక్తి; ఎకాలజీ, ఎన్విరాన్‌మెంట్, ఎర్త్ & ఓషన్ సైన్సెస్ మరియు వాటర్; మైనింగ్, మినరల్స్, మెటల్స్ & మెటీరియల్స్; వ్యవసాయం, పోషకాహారం & బయోటెక్నాలజీ వంటి కీలక పారిశ్రామిక రంగాలకు విస్తరించింది. పరస్పర ప్రయోజనకరమైన పారిశ్రామిక మరియు సాంకేతిక సహకారాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం సీ ఎస్ ఐ ఆర్ మరియు డీ డీ ఆర్ అండ్ డీ అధిపతుల నేతృత్వంలోని జాయింట్ స్టీరింగ్ కమిటీ ఎంఓయూ సహకారం అమలును పర్యవేక్షిస్తుంది.
సీ ఎస్ ఐ ఆర్ మరియు డీ డీ ఆర్ అండ్ డీ మధ్య ప్రస్తుతం చర్చించబడుతున్న హైడ్రోజన్ మరియు ఏరోస్పేస్‌పై నిర్దిష్ట సహకారాన్ని సీ ఎస్ ఐ ఆర్-నేషనల్ ఏరోస్పేస్ లాబొరేటరీస్ (సీ ఎస్ ఐ ఆర్-ఎన్ ఏ ఎల్) డైరెక్టర్ డాక్టర్ అభయ్ పాశిల్కర్ మరియు సీ ఎస్ ఐ ఆర్-నేషనల్ కెమికల్ లాబొరేటరీ (సీ ఎస్ ఐ ఆర్-ఎన్ సీ ఎల్) డైరెక్టర్ డాక్టర్ ఆశిష్ లేలే వివరించారు. సీ ఎస్ ఐ ఆర్ యొక్క హై ఆల్టిట్యూడ్ ప్లాట్‌ఫారమ్, హైడ్రోజన్ వ్యాలీ ప్రోగ్రామ్‌లతో సహా ఈ రంగాలలో భవిష్యత్ సాంకేతికతలలో సహకారాన్ని వారు స్వాగతించారు.
సీ ఎస్ ఐ ఆర్-ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (సీ ఎస్ ఐ ఆర్-ఐ ఐ సీ టీ) మరియు 101 థెరప్యూటిక్స్ మధ్య చికిత్సా విధానంలో అపారమైన చికిత్సా సామర్థ్యాన్ని కలిగి ఉన్న కోవిడ్-19 ఔషధం యొక్క క్లినికల్ ట్రయల్స్ నిర్వహించడం గురించి వివరించారు. ఇది విజయవంతమైతే, భవిష్యత్తులో వచ్చే మహమ్మారి నివారణకు ఇది అత్యంత సముచితమైనది మరియు ప్రభావవంతమైనది. ఈ సమావేశంలో సీ ఎస్ ఐ ఆర్-ఐ ఐ సి టీ మరియు 101 థెరప్యూటిక్స్ మధ్య సహకార అవగాహనా ఒప్పందాలు కూడా జరిగాయి.
అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరాన్ని జరుపుకుంటూ భారతదేశం మరియు ఇజ్రాయెల్ ల మధ్య విజయవంతమైన దౌత్య సంబంధాల
మైత్రీ బంధం 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందున, అలాగే భారతదేశం జీ 20 అధ్యక్ష పదవిని నిర్వహిస్తున్నందున, భారతదేశ ప్రధానమంత్రి నాయకత్వంలో భారతదేశం ఎస్ అండ్ టీ రంగంలో ఇది చాలా ముఖ్యమైన సంవత్సరం అని డాక్టర్ జితేంద్ర సింగ్ తన వ్యాఖ్యలలో పేర్కొన్నారు. సీ ఎస్ ఐ ఆర్ దాదాపు అన్ని గుర్తించబడిన ప్రాధాన్యతా రంగాలలో ప్రత్యేక ప్రయోగశాలలను కలిగి ఉందని, అందువల్ల ఈ సహకారానికి తగిన యోగ్యత ఉందని ఆయన వివరించారు. ఉదా. సీ ఎస్ ఐ ఆర్-ఎన్ సీ ఎల్ ద్వారా స్వదేశీ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ బస్సు, సీ ఎస్ ఐ ఆర్-ఐ ఐ ఐ ఎం ద్వారా పర్పుల్ విప్లవం (లావెండర్ పెంపకం) వంటి వాటిని ఆయన ఉదహరించారు. ఇజ్రాయెల్‌తో సాంకేతిక భాగస్వామ్యాన్ని ఆయన స్వాగతించారు మరియు భారతదేశం-ఇజ్రాయెల్ సంబంధాన్ని బలోపేతం చేయడానికి ఇరుపక్షాల కృషికి అభినందనలు తెలిపారు.
అంతర్జాతీయ ఎస్ అండ్ టీ అఫారిస్ డైరెక్టరేట్, సీ ఎస్ ఐ ఆర్ హెడ్ డాక్టర్ రామ స్వామి బన్సాల్, సీ ఎస్ ఐ ఆర్ తో సహకారాన్ని లాంఛనంగా ప్రారభించినందుకు ఇజ్రాయెల్ బృందానికి మరియు ఈరోజు జరిగిన ఎమ్ఒయు సంతకాల సమావేశానికి దయతో హాజరైన ఆమె సహచరులకు తమకు నిరంతరం మద్దతును అందిస్తున్న గౌరవ మంత్రికి ధన్యవాదాలు తెలిపారు.
****
(Release ID: 1921921)
Visitor Counter : 209