ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ ఫ‌ర్మేశన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ

ఆధార్‌తో సీడ్ చేసిన ఈమెయిల్, మొబైల్ నంబర్‌ను ధృవీకరించుకొనేందుకు యుఐడీఏఐ అనుమతి

Posted On: 02 MAY 2023 3:51PM by PIB Hyderabad

వినియోగదారు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యుఐడీఏఐ) నివాసితులు తమ ఆధార్‌తో సీడ్ చేయబడిన మొబైల్ నంబర్‌లు మరియు ఈమెయిల్ ఐడీలను ధృవీకరించడానికి అనుమతించింది. కొన్ని సందర్భాల్లో, నివాసితులు తమ మొబైల్ నంబర్‌లలో ఏది ఆధార్‌కు సీడ్ చేయబడిందో తెలియదని/ ఖచ్చితంగా తెలియదని  చెబుతున్న విషయం యుఐడీఏఐ  దృష్టికి వచ్చింది. ఇలా తెలియని కారణంగా ఆధార్ ఓటీఊఈ వేరే మొబైల్ నంబర్‌కు వెళుతోందని నివాసితులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు, తాజాగా కలిపించిన సదుపాయంతో నివాసితులు సీడింగ్ వివరాలను చాలా సులభంగా తనిఖీ చేయవచ్చు. అధికారిక వెబ్‌సైట్ (https://myaadhaar.uidai.gov.in/)లో లేదా mAadhaar యాప్ ద్వారా ‘వెరిఫై ఈమెయిల్/మొబైల్ నంబర్’ ఫీచర్ కింద ఈ సదుపాయాన్ని పొందవచ్చు. నివాసితులు తమ సొంత ఇమెయిల్/మొబైల్ నంబర్ సంబంధిత ఆధార్‌తో సీడ్ చేయబడిందని ధృవీకరించుకోవడానికి ఇది అభివృద్ధి చేయబడింది. ఈ ఫీచర్ నివాసికి అతని/ఆమె పరిజ్ఞానంలో ఉన్న ఇమెయిల్/ మొబైల్ నంబర్ సంబంధిత ఆధార్‌కు మాత్రమే సీడ్ చేయబడిందని ధృవీకరణను అందిస్తుంది. ఇది నిర్దిష్ట మొబైల్ నంబర్ లింక్ చేయని పక్షంలో నివాసికి తెలియజేస్తుంది. వారు కోరుకుంటే, మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని నివాసికి తెలియజేస్తుంది. మొబైల్ నంబర్ ఇప్పటికే ధృవీకరించబడినట్లయితే నివాసితులు వారి స్క్రీన్‌పై ప్రదర్శించబడే 'మీరు నమోదు చేసిన మొబైల్ నంబర్ ఇప్పటికే మా రికార్డ్‌లతో ధృవీకరించబడింది' వంటి సందేశాన్ని చూస్తారు. ఒక నివాసికి మొబైల్ నంబర్ గుర్తులేకపోతే, ఆమె/ అతను నమోదు సమయంలో ఇచ్చిన మొబైల్ నంబర్‌ను ఆమె/ అతను మై ఆధార్ పోర్టల్ లేదా mAadhaar యాప్‌లో వెరిఫై ఆధార్ ఫీచర్‌లో మొబైల్ చివరి మూడు అంకెలను తనిఖీ చేయవచ్చు. నివాసి ఈమెయిల్/మొబైల్ నంబర్‌ను ఆధార్‌తో లింక్ చేయాలనుకుంటే లేదా ఆమె/ అతని ఈమెయిల్/మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేయాలనుకుంటే, ఆమె/ అతను సమీపంలోని ఆధార్ కేంద్రాన్ని సందర్శించవచ్చు.

****



(Release ID: 1921672) Visitor Counter : 217