రక్షణ మంత్రిత్వ శాఖ
న్యూఢిల్లీలో జరిగిన ఎస్‌సిఒ రక్షణ మంత్రుల సమావేశం సందర్భంగా ద్వైపాక్షిక చర్చలను నిర్వహించిన భారత్, రష్యా రక్షణ మంత్రులు
మేకిన్ ఇండియాలో రష్యా పరిశ్రమల భాగస్వామ్యాన్ని పెంచేందుకు మార్గాలను అన్వేషించడం సహా ప్రాంతీయ శాంతి & భద్రత, రక్షణ సహకారం పై చర్చ
Posted On:
28 APR 2023 4:46PM by PIB Hyderabad
న్యూఢిల్లీలో 28 ఏప్రిల్, 2023న జరిగిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సిఒ) రక్షణ మంత్రుల సమావేశం సందర్భంగా రక్షణ శాఖా మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ రష్యా రక్షణ మంత్రి జనరల్ సెర్గీ కె షోయిగుతో ద్వైపాక్షిక సమావేశాన్ని నిర్వహించారు. సైన్యాల మధ్య సంబంధాలు, పారిశ్రామిక భాగస్వామ్యం సహా ద్వైపాక్షిక రక్షణ సహకారానికి సంబంధించిన విస్త్రత అంశాలపై మంత్రులిద్దరూ చర్చించారు. మేక్ ఇన్ ఇండియా చొరవలో రష్యా రక్షణ పరిశ్రమల భాగస్వామ్యం, దానికి మరింత ఊతమిచ్చే మార్గాల గురించి కూడా వారు చర్చించారు.
ప్రాంతీయ శాంతి, భద్రతలకు సంబంధించిన అంశాలను కూడా వారు చర్చించారు. ఇరు దేశాల మధ్య నిరంతర విశ్వాసం, పరస్పర గౌరవం కలిగి ఉండటం పట్ల, ముఖ్యంగా రక్షణ అంశాలలో అది ఉండటం పట్ల సంతృప్తిని వ్యక్తం చేస్తూ, ఈ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు కట్టుబడి ఉండాలని పునరుద్ఘాటించారు. భారత్, రష్యాల మధ్య గల ప్రత్యేకమైన, సుదీర్ఘ, కాలపరీక్షలకు నిలబడిన సంబంధాన్ని వారు గుర్తించారు.
***
(Release ID: 1920919)
Visitor Counter : 168