రక్షణ మంత్రిత్వ శాఖ
న్యూదిల్లీలో ఎస్‌సీవో రక్షణ మంత్రుల సమావేశం సందర్భంగా ఉజ్బెకిస్థాన్, బెలారస్, కిర్గిస్థాన్ రక్షణ మంత్రులతో భారత రక్షణ మంత్రి సమావేశం
ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసే మార్గాలపై సమావేశంలో దృష్టి
ఎస్‌సీవో ఒడంబడికను అమలు చేయడానికి భారతదేశం కట్టుబడి ఉంది: ఎస్‌సీవో సెక్రటరీ జనరల్‌తో జరిగిన సమావేశంలో శ్రీ రాజ్‌నాథ్ సింగ్
Posted On:
28 APR 2023 4:52PM by PIB Hyderabad
ఉజ్బెకిస్థాన్ రక్షణ మంత్రి లెఫ్టినెంట్ జనరల్ బఖోదిర్ కుర్బానోవ్, బెలారస్ రక్షణ మంత్రి లెఫ్టినెంట్ జనరల్ విక్టర్ ఖ్రెనిన్, కిర్గిస్థాన్ రక్షణ మంత్రి లెఫ్టినెంట్ జనరల్ బెక్బోలోటోవ్ బి అసంకాలీవిచ్‌తో భారత రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. ఇవాళ న్యూదిల్లీలో (ఎస్‌సీవో) జరిగిన షాంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్ సభ్య దేశాల రక్షణ మంత్రుల సమావేశం సందర్భంగా, ఈ మూడు దేశాల రక్షణ మంత్రులతో రాజ్‌నాథ్ సింగ్ విడివిడిగా భేటీ అయ్యారు. ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించే మార్గాలు గుర్తించడం ప్రధానాంశంగా, మూడు దేశాలతో రక్షణ సహకార స్వరూపాన్ని ఈ సందర్భంగా సమీక్షించారు. పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై కూడా చర్చించారు.
ఎస్‌సీవో రక్షణ మంత్రుల సమావేశం ముగిసిన తర్వాత, ఎస్‌సీవో సెక్రటరీ జనరల్ జాంగ్ మింగ్ కూడా భారత రక్షణ మంత్రితో సమావేశం అయ్యారు. భారతదేశ అధ్యక్షతన చేపట్టిన వివిధ కార్యక్రమాలపై చర్చించారు. ఎస్‌సీవో ఒడంబడికను అమలు చేయడానికి, సహకరించడానికి భారతదేశం కట్టుబడి ఉందని జాంగ్ మింగ్‌కు రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు.
****
(Release ID: 1920612)
Visitor Counter : 188