ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav g20-india-2023

పరిశుభ్రమైన, సురక్షితమైన ఆహార పద్ధతులను ప్రోత్సహించడానికి దేశవ్యాప్తంగా 100 ఫుడ్ స్ట్రీట్‌లను నిర్వహించాలని ప్రతిపాదించిన ఆరోగ్య మంత్రిత్వ శాఖ


ఒక్కో ఫుడ్ స్ట్రీట్ కి రూ.కోటి చొప్పున రాష్ట్రాలు/యుటి లకు ఆర్థిక సహాయం

ఫుడ్ స్ట్రీట్ లను విజయవంతం చేయడానికి గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో కొనసాగుతున్న ఇతర పథకాలతో సమ్మిళితం

సురక్షితమైన ఆహార పద్ధతులు స్థానిక ఆహార వ్యాపారాల పరిశుభ్రత విశ్వసనీయతను మెరుగుపరచడమే కాకుండా
స్థానిక ఉపాధి, పర్యాటకం, ఆర్థిక వ్యవస్థను కూడా పెంచుతాయి.

Posted On: 20 APR 2023 4:02PM by PIB Hyderabad

ఒక ముఖ్యమైన, వినూత్నమైన ఆలోచనలో భాగంగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహకారంతో దేశవ్యాప్తంగా 100 జిల్లాల్లో 100 ఫుడ్ స్ట్రీట్‌లను అభివృద్ధి చేయాలని రాష్ట్రాలు/యుటిలను అభ్యర్థించింది. పరిశుభ్రమైన, సురక్షితమైన ఆహార పద్ధతులను నిర్ధారించడం కోసం దేశవ్యాప్తంగా వచ్చే ఇతర స్ట్రీట్ ల కోసం ఒక ఉదాహరణగా రూపొందించడానికి ఈ చొరవ పైలట్ ప్రాజెక్ట్‌గా తీసుకున్నారు. ఆహార వ్యాపారాలు, కమ్యూనిటీ సభ్యులలో సురక్షితమైన, ఆరోగ్యకరమైన ఆహార పద్ధతులను ప్రోత్సహించడం, తద్వారా ఆహారం ద్వారా వచ్చే అనారోగ్యాలను తగ్గించడం, మొత్తం ఆరోగ్య ఫలితాలను మెరుగుపరచడం  ఈ ప్రాజెక్ట్ లక్ష్యం. 

“పౌరుల మంచి ఆరోగ్యానికి సురక్షితమైన,  పరిశుభ్రమైన ఆహారాన్ని సులభంగా పొందడం చాలా ముఖ్యమైనదని రాష్ట్రాలకు రాసిన లేఖలో, కేంద్ర ఆరోగ్య కార్యదర్శి శ్రీ రాజేష్ భూషణ్, గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ మనోజ్ జోషి పేర్కొన్నారు. సురక్షితమైన ఆహార పద్ధతులు కేవలం "ఈట్ రైట్ క్యాంపెయిన్", ఆహార భద్రతను ప్రోత్సహించడమే కాకుండా, స్థానిక ఆహార వ్యాపారాల పరిశుభ్రత విశ్వసనీయతను మెరుగుపరుస్తాయని తెలిపారు. స్థానిక ఉపాధిని, పర్యాటకాన్ని ఆర్థిక వ్యవస్థను పెంచుతాయి. ఇది పరిశుభ్రమైన, పచ్చటి వాతావరణానికి కూడా దారితీస్తుంది.

వీధి ఆహారాలు సాంప్రదాయకంగా భారతీయ సమాజంలో అంతర్భాగంగా ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఉన్నాయి. వారు వంటకాల గొప్ప స్థానిక సంప్రదాయానికి ప్రతీకగా నిలుస్తాయి. వీధి ఆహారాలు లక్షలాది మందికి సరసమైన ధరలకు రోజువారీ ఆహారాన్ని అందించడమే కాకుండా పెద్ద సంఖ్యలో ప్రజలకు ప్రత్యక్ష ఉపాధిని అందిస్తాయి. పర్యాటక పరిశ్రమకు మద్దతునిస్తాయి. అయితే వీధి ఆహార దుకాణాలు, హబ్‌లలో ఆహార భద్రత, పరిశుభ్రత ఆందోళన కలిగించే అంశం. వేగవంతమైన పట్టణీకరణతో, ఈ హబ్‌లు ఆహారాన్ని సులభంగా యాక్సెస్ చేయడానికి దారితీసినప్పటికీ, ఇది అపరిశుభ్రమైన, అసురక్షిత ఆహార పద్ధతుల కారణంగా ఆహార కాలుష్యం, సంబంధిత ఆరోగ్య సమస్యల సమస్యను కూడా తీవ్రతరం చేస్తుంది. 

హౌసింగ్, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో కలిసి, ఎఫ్ఎస్ఎస్ఏఐ నుండి సాంకేతిక మద్దతుతో జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) ద్వారా ఈ ప్రత్యేక చొరవ అమలు అవుతుంది. ప్రతి ఫుడ్ స్ట్రీట్/జిల్లాలకు రూ.1 కోటి, రాష్ట్రాలు/యుటిలకు ఆర్థిక సహాయంగా ఇస్తారు. దేశవ్యాప్తంగా 100 జిల్లాల్లో 100 ఆహార వీధులు తెరుస్తారు (జాబితా క్రింద ఇవ్వబడింది). ఈ సహాయం జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) కింద 60:40 లేదా 90: 10 నిష్పత్తిలో అందిస్తారు. ఎఫ్ఎస్ఎస్ఏ ఐ  మార్గదర్శకాల ప్రకారం ఈ ఆహార వీధుల ప్రామాణిక బ్రాండింగ్ చేస్తారు.

రాష్ట్ర స్థాయిలో మునిసిపల్ కార్పొరేషన్లు/అభివృద్ధి అధికారులు/ జిల్లా కలెక్టర్లు ఆర్థిక వనరులు, భౌతిక మౌలిక సదుపాయాల పరంగా కన్వర్జెన్స్‌ని నిర్ధారించడానికి ప్రధాన కార్యక్రమాలు చేపడతారు. ఫుడ్ హ్యాండ్లర్‌లకు శిక్షణ, స్వతంత్ర థర్డ్ పార్టీ ఆడిట్‌లు, ఈట్ రైట్ స్ట్రీట్ ఫుడ్ హబ్స్ 'ఎస్ఓపి ఫర్ ఫుడ్ స్ట్రీట్స్ ఆధునీకరణ' ధృవీకరణ వంటి అనేక ఇతర కార్యక్రమాలు ఆహార భద్రతా ప్రమాణాలను మెరుగుపరుస్తాయి. దీనదయాళ్ అంత్యోదయ యోజన- జాతీయ పట్టణ జీవనోపాధి మిషన్, గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో భాగంగా "పట్టణ వీధి వ్యాపారులకు మద్దతు (ఎస్యుఎస్వి)" వంటి పథకాలు కూడా చేపట్టడం జరిగింది. అదనంగా, రాష్ట్రాలు/యుటిలు వీధి వ్యాపారులకు సంబంధించిన ఆహార భద్రత, పరిశుభ్రత నిర్వహణ, వ్యర్థాల తొలగింపు అంశాలకు సంబంధించి శిక్షణా కార్యక్రమాలను కూడా నిర్వహించవచ్చు. 

రాష్ట్రాల వారీగా ప్రతిపాదిత ఫుడ్ స్ట్రీట్ ల సంఖ్య :

క్రమ సంఖ్య 

రాష్ట్రం/యుటి 

ఫుడ్ స్ట్రీట్ ల సంఖ్య 

1

ఆంధ్రప్రదేశ్ 

4

2

అస్సాం 

4

3

బీహార్ 

4

4

ఛత్తీస్గఢ్ 

4

5

ఢిల్లీ 

3

6

గోవా 

2

7

గుజరాత్ 

4

8

హర్యానా 

4

9

హిమాచల్ ప్రదేశ్ 

3

10

జమ్మూ కాశ్మీర్ 

3

11

ఝార్ఖండ్ 

4

12

కర్ణాటక 

4

13

కేరళ 

4

14

లడఖ్ 

1

15

మధ్యప్రదేశ్ 

4.

16

మహారాష్ట్ర 

4

17

ఒడిశా 

4

18

పంజాబ్ 

4

19

రాజస్థాన్ 

4

20

తమిళనాడు 

4

21

తెలంగాణ 

4

22

ఉత్తరప్రదేశ్ 

4

23

ఉత్తరాఖండ్ 

4.

24

పశ్చిమ బెంగాల్ 

4

25

అరుణాచల్ ప్రదేశ్ 

1

26

మణిపూర్ 

1

27

మేఘాలయ 

1

28

మిజోరాం 

1

29

నాగాలాండ్ 

1

30

సిక్కిం 

1

31

త్రిపుర 

1

32

అండమాన్ నికోబర్ దీవులు 

1

33

చండీగఢ్ 

1

34

డయ్యు డామన్ నగర్ హవేలీ 

1

35

లక్షద్వీప్ 

1

36

పుదుచ్చేరి 

1

 

మొత్తం 

100

 

****(Release ID: 1918482) Visitor Counter : 132