హోం మంత్రిత్వ శాఖ
కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షాఅధ్యక్షతన ఢిల్లీలో అత్యవసర పరిస్థితుల నివారణ , నిర్మూలనకు బాధ్యత వహించే షాంఘై కోఆపరేషన్ఆర్గనైజేషన్ (ఎస్ సిఒ) సభ్య దేశాల విభాగాధిపతుల సమావేశం
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో, విపత్తు నష్టాల తగ్గింపు నకు భారతదేశం ప్రత్యేక ప్రాముఖ్యతను ఇస్తోంది: ఎస్ సి ఒ సభ్య దేశాల మధ్య సహకారం ,పరస్పర విశ్వాసం కోసం ఈ రంగంలో తన నైపుణ్యం అనుభవాన్ని పంచుకోవడానికి భారత్ సిద్ధంగా ఉంది.
2018లో జరిగిన షాంఘై సహకార సంస్థ క్వింగ్డావో శిఖరాగ్ర సమావేశంలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రతిపాదించిన భద్రత (సెక్యూర్) ఇతివృత్తాన్ని ముందుకు తీసుకెళ్లడం కౌన్సిల్ చైర్మన్ గా భారతదేశం ప్రాధాన్యత: SECURE లో- ఎస్ - భద్రత, ఇ - ఆర్థిక సహకారం, సి - కనెక్టివిటీ, యు - ఐక్యత, ఆర్ - సార్వభౌమత్వం - సమగ్రతకు గౌరవం, ఇ - పర్యావరణ రక్షణ.
భారతదేశం ఇప్పుడు ఖచ్చితమైన, సకాలంలో ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను కలిగి ఉంది: ముందస్తు హెచ్చరిక వ్యవస్థలకు ప్రజా ప్రాధాన్యమే మా విధానం
భారతదేశం సామాజిక సాధికారత ('కమ్యూనిటీ ఎంపవర్మెంట్') ను తన ప్రయత్నాలకు ప్రాతిపదికగా చేసుకుంది: దీని వల్ల తుఫానుల వల్ల నష్టం తగ్గింది: ఇది నేడు యావత్ ప్రపంచం ప్రశంసలు అందుకుంటోంది
మనకు, రాబోయే తరాలకు సురక్షితమైన ప్రపంచాన్ని నిర్మించడానికి మనకు సృజనాత్మక వ్యూహాలు అవసరం
రిస్క్ తగ
Posted On:
20 APR 2023 4:04PM by PIB Hyderabad
కేంద్ర హోం , , సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా అధ్యక్షతన ఈ రోజు న్యూఢిల్లీలో అత్యవసర పరిస్థితుల నివారణ ,నిర్మూలనకు బాధ్యత వహించే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్ సిఒ) సభ్య దేశాల విభాగాధిపతుల సమావేశం జరిగింది.
107A3645
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో, బహుముఖ రాజకీయ, భద్రత, ఆర్థిక అంశాలకు సంబంధించిన అంశంపై చర్చలను ప్రోత్సహించడంలో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ కు భారతదేశం ప్రత్యేక ప్రాముఖ్యతను ఇస్తోందని కేంద్ర హోం, సహకార మంత్రి శ్రీ అమిత్ షా తెలిపారు. 2005 నుంచి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ తో భారత్ అనుబంధం కలిగి ఉందని, అప్పటి నుంచి పరిశీలక దేశంగా కీలక పాత్ర పోషిస్తోందని చెప్పారు. 2017 లో జరిగిన 17 వ శిఖరాగ్ర సమావేశంలో, ఈ సంస్థ విస్తరణ ప్రక్రియలో ఒక ముఖ్యమైన అడుగులో భాగంగా భారతదేశం షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ లో పూర్తి సభ్యత్వం పొందింది.2017లో పూర్తి స్థాయి సభ్యదేశంగా అవతరించిన తర్వాత తొలిసారిగా ఎస్ సి ఒ దేశాధినేతల మండలి చైర్మన్ పదవిని భారత్ చేపట్టడం గర్వకారణమని శ్రీ అమిత్ షా అన్నారు.
2018లో జరిగిన షాంఘై సహకార సంస్థ క్వింగ్దావో శిఖరాగ్ర సదస్సులో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రతిపాదించిన ‘సెక్యూర్‘ థీమ్ ను ముందుకు తీసుకెళ్లడం కౌన్సిల్ చైర్మన్ గా భారతదేశ ప్రాధాన్యమని, సెక్యూర్ అంటే - ఎస్ - సెక్యూరిటీ, ఇ - ఆర్థిక సహకారం, సి - అనుసంధానం (కనెక్టివిటీ) , యు - యూనిటీ, ఆర్ - సార్వభౌమత్వం, సమగ్రత పట్ల గౌరవం ఇ - పర్యావరణ పరిరక్షణ అని ఆయన వివరించారు.
షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ బహుశా ఈ సమయంలో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాంతీయ సంస్థగా ఉంటుందని, ప్రపంచ జనాభాలో 40%, ప్రపంచ జిడిపిలో 25%, ప్రపంచ మొత్తం భూభాగంలో 22% ప్రాతినిధ్యం వహిస్తుందని శ్రీ షా అన్నారు.
నేడు షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అంతర్జాతీయ సంస్థగా అభివృద్ధి
చెందిందని, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అన్ని సభ్య దేశాలతో సహకారాన్ని సమన్వయం చేసుకోవడానికి ఒక అద్భుతమైన వేదికను
అందించిందని చెప్పారు.
107A3742
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో, విపత్తు నష్టాల తగ్గింపు కు భారతదేశం ప్రత్యేక ప్రాముఖ్యత ఇస్తోందని, ఎస్ సి ఒ సభ్య దేశాల మధ్య మరింత సహకారం , పరస్పర విశ్వాసం కోసం ఈ రంగంలో తన నైపుణ్యం, అనుభవాన్ని పంచుకోవడానికి సిద్ధంగా ఉందని శ్రీ అమిత్ షా తెలిపారు.
విపత్తు చిన్నదైనా, పెద్దదైనా భారత్ గుర్తిస్తుందని , దాని వల్ల ఏ ఒక్కరినీ ప్రభావితం కానివ్వబొదని ఆయన అన్నారు. భారతదేశం ఇప్పుడు మరింత ఖచ్చితమైన , సకాలంలో ముందస్తు హెచ్చరిక వ్యవస్థను కలిగి ఉందని, కరువు, వరదలు, పిడుగులు, వడగాలులు, శీతల తరంగాలు, తుఫానుల ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు (ఇడబ్ల్యుఎస్) మెరుగుపడిన విధానంలో దేశం చాలా మార్పును చూసిందని శ్రీ షా అన్నారు. ఈ సకాల అంచనా విపత్తు గురించి మనల్ని హెచ్చరించడమే కాకుండా, దాని వల్ల కలిగే సంభావ్య ప్రభావాన్ని కూడా అంచనా వేస్తుందని ఆయన అన్నారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో, సహాయక చర్యలు ప్రభావిత ప్రాంతానికి ఎంత త్వరగా చేరుతాయనేది చాలా ముఖ్యమైనదని, ఈ వేగం సహాయ బృందం సంసిద్ధతను , వారి శిక్షణ సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తుందని శ్రీ షా అన్నారు.
107A3668
ప్రతి ప్రాణం, కుటుంబం, వారి జీవనోపాధి వెలకట్టలేనివని, దానిని పరిరక్షించేందుకు మనం అన్ని ప్రయత్నాలు చేయాలని శ్రీ అమిత్ షా అన్నారు. ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ కు సంబంధించి భారతదేశ విధానానికి ప్రజలే కేంద్ర బిందువుగా ఉందని, మన అంచనా, హెచ్చరిక వ్యవస్థ శాస్త్రీయంగా అభివృద్ధి చెందడమే కాకుండా, సాధారణ ప్రజలకు అర్థమయ్యే విధంగా, ఉపయోగించదగిన , చర్య తీసుకోదగిన విధంగా కమ్యూనికేట్ చేయబడినట్టు ధృవీకరించాలనుకుంటున్నామని ఆయన అన్నారు. ఒకప్పుడు భారత్ లో తుఫానులు భారీ ప్రాణ, ఆస్తి నష్టాన్ని కలిగించేవని, కానీ, భారత్ తన ప్రయత్నాలకు 'కమ్యూనిటీ ఎంపవర్ మెంట్ 'ను ప్రాతిపదికగా చేసుకుందని, దీని వల్ల తుఫాన్ల వల్ల కలిగే నష్టం తగ్గిందని, దీనిని నేడు యావత్ ప్రపంచం ప్రశంసిస్తోందని శ్రీ షా అన్నారు.
107A3892
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత దేశం విపత్తుల ముప్పును తగ్గించే రంగంలో
అంతర్జాతీయ సహకారం కోసం పలు
కీలక కార్యక్రమాలను చేపట్టిందని కేంద్ర హోం మంత్రి తెలిపారు. భారతదేశం నేతృత్వంలోని విపత్తు స్థితిస్థాపక మౌలిక సదుపాయాల కూటమి (సిడిఆర్ఐ) నేడు ప్రపంచవ్యాప్తంగా 39 మంది సభ్యులను కలిగి ఉందని ఆయన చెప్పారు. విపత్తులను తట్టుకునే విధంగా మన మౌలిక సదుపాయాలను తీర్చిదిద్దే విధంగా మౌలిక సదుపాయాలపై అన్ని పెట్టుబడులు ఉపయోగపడేలా చూసేందుకు సిడిఆర్ ఐ సభ్య దేశాలతో కలిసి పనిచేస్తోంది, తద్వారా మన వర్తమానాన్ని మాత్రమే కాకుండా మన భవిష్యత్తును కూడా సురక్షితం చేస్తుంది.
వీటితో పాటు స్మాల్ ఐలాండ్స్ డెవలపింగ్ స్టేట్స్ (ఎస్ఐడీఎస్) వంటి ప్రపంచంలోని అత్యంత బలహీనమైన ప్రాంతాలపై సీడీఆర్ఐ ప్రత్యేక దృష్టి సారించింది. భారత్ చొరవతో జీ-20 సదస్సులో డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ పై వర్కింగ్ గ్రూప్ ను ఏర్పాటు చేశామని, ఈ గ్రూప్ తొలి సమావేశం ఇటీవల గుజరాత్ లోని గాంధీనగర్ లో జరిగిందన్నారు.
107A3897
ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషియానిక్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్
(ఇన్ కాయిస్) ఏర్పాటు చేసిన హిందూ మహాసముద్ర రిమ్ దేశాల కోసం 'సునామీ ముందస్తు హెచ్చరిక వ్యవస్థ' భారతదేశానికే కాకుండా దాదాపు రెండు డజన్ల ఇతర దేశాలకు కూడా ఉపయోగపడుతుందని శ్రీ అమిత్ షా అన్నారు. దీంతో పాటు సార్క్, బిమ్ స్టెక్, షాంఘై సహకార సంస్థ (ఎస్ సి ఒ ) దేశాలతో కలిసి భారత్ సంయుక్త ద్వైపాక్షిక విన్యాసాలు నిర్వహించింది. 2015 భూకంపం తరువాత విపత్తు ప్రభావిత దేశాలలో - ముఖ్యంగా నేపాల్ లో భారతదేశం తన జాతీయ విపత్తు ప్రతిస్పందన దళాన్ని (ఎన్ డిఆర్ ఎఫ్) మోహరించిందని ఆయన తెలియజేశారు.
ఇటీవల తుర్కియేలో భూకంపం సంభవించిన కొన్ని గంటల్లోనే ఎన్ డి ఆర్ ఎఫ్ కూడా గాలింపు చర్యలు చేపట్టిందని చెప్పారు. మన సంస్కృతి మనకు
'వసుధైక కుటుంబకం' అంటే 'ప్రపంచం ఒక కుటుంబం' అనే భావన నేర్పిందని, తుర్కియే అయినా, సిరియా అయినా ఆపరేషన్ దోస్త్ లో ఎన్ డి ఆర్ ఎఫ్ ఈ భారతీయ విలువలను మరోసారి ప్రపంచానికి చాటి చెప్పిందని అన్నారు.
భారతదేశం మొత్తం ప్రపంచాన్ని ఒకే కుటుంబంగా పరిగణిస్తుందని, అటువంటి పరిస్థితిలో, కుటుంబంలో ఎవరైనా సభ్యుడు ఏదైనా సంక్షోభాన్ని ఎదుర్కొంటే, భారతదేశం దానిని పరిగణిస్తుందని, కుటుంబంలోని ఏ సభ్యుడికైనా సహాయం చేయడానికి ముందుకు సాగడం తన కర్తవ్యమని ఆయన అన్నారు. 2017లో ప్రయోగించిన దక్షిణాసియా జియోస్టేషనరీ కమ్యూనికేషన్ శాటిలైట్ కమ్యూనికేషన్ భారత ఉపఖండ దేశాలలో వాతావరణ సూచన మొదలైన వాటిని మెరుగు పరచడంలో సహాయపడుతుందని ఆయన అన్నారు.
107A3906
గత కొన్నేళ్లుగా షాంఘై సహకార సంస్థ (ఎస్ సి ఒ ) ప్రాంతం భారీ ఆర్థిక నష్టాలతో అధిక తీవ్రత కలిగిన ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొందని, వాతావరణ మార్పులతో ముడిపడి ఉన్న భూకంపాలు, కరువులు, వరదలు, అనూహ్య తుఫాన్.లు, , సముద్ర మట్టం పెరుగుదల వల్ల ప్రపంచవ్యాప్తంగా భారీ వినాశనం సంభవించిందని, ఇది ప్రపంచ అభివృద్ధికి తీవ్రమైన ముప్పుగా మారిందని కేంద్ర హోం మంత్రి అన్నారు.
రిస్క్ తగ్గింపు అనేది ఇప్పుడు స్థానిక విషయం కాదని, ప్రపంచంలోని ఒక ప్రాంతంలో తీసుకున్న చర్య ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలో ప్రమాద తీవ్రతపై ప్రభావం చూపుతుందని శ్రీ షా అన్నారు. విపత్తుల నివారణ సవాళ్లు ప్రపంచవ్యాప్తంగా ఒకేలా ఉన్నాయని, అందుకే మనం ఒకరి నుంచి ఒకరు నేర్చుకోవాల్సిన అవసరం ఉందని, నూతన ఆవిష్కరణలు చేయాలని, పరస్పర సహకారాన్ని పెంపొందించు కోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.
107A3918
సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు (ఎస్ డి జి లు), సెండాయ్ ఫ్రేమ్ వర్క్ లక్ష్యాలను సమష్టిగా సాధించకపోతే ఈ రెండు ఫ్రేమ్ వర్క్ లు నిర్దేశించిన లక్ష్యాలను సాధించడం కష్టమని కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి స్పష్టం చేశారు. భూకంపాలు, వరదల ప్రభావాలను తగ్గించడంపై భారత్ రెండు 'నాలెడ్జ్ షేరింగ్ వర్క్ షాప్స్'ను నిర్వహించిందని, ఈ రెండు కార్యక్రమాల్లో సభ్యదేశాలన్నీ చురుగ్గా పాల్గొనడం హర్షణీయమని, అవి విజయవంతంగా ముగిశాయని ఆయన అన్నారు.
107A3933
ఎస్ సి ఒ విధానాన్ని మరింత బలోపేతం చేయడానికి, 5 ప్రధాన కార్యచరణ రంగాలను గుర్తించవచ్చని శ్రీ అమిత్ షా చెప్పారు. అవి:
*ఆసియాలో ఆత్మవిశ్వాసం పెంపొందించే ప్రయత్నాలు,
*సమిష్టి బాధ్యత విధానం,
*కమ్యూనికేషన్ ,సమాచార భాగస్వామ్యంలో సహకారాన్ని విస్తరించడం,
*ప్రాధాన్య ప్రాంతాలను గుర్తించడం, *విపత్తు స్థితిస్థాపకత సామర్థ్య నిర్మాణంలో కొత్తగా అభివృద్ధి చేసిన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం.
విపత్తు స్థితిస్థాపకత కోసం సమిష్టి బాధ్యతా విధానాన్ని అవలంబించడం ద్వారా షాంఘై సహకార సంస్థ సభ్య దేశాలు మరింత సమర్థవంతంగా కలిసి పనిచేయడానికి దోహదపడుతుందని శ్రీ షా అన్నారు. దీనితో పాటు, మన వనరులు ,నైపుణ్యాన్ని సమీకరించడం ద్వారా, సభ్య దేశాలు ప్రయత్నాల, వనరుల డూప్లికేట్ నివారించవచ్చునని, ఇది ఈ ప్రాంత మొత్తం విపత్తు స్థితిస్థాపకత విధానాన్ని బలోపేతం చేస్తుందని చెప్పారు. కమ్యూనికేషన్ ఉత్తమ పద్ధతులు, ప్రతిస్పందన ప్రయత్నాల సమన్వయం , రియల్ టైమ్ సమాచార మార్పిడి ద్వారా ఎస్ సి ఒ సభ్య దేశాలు అత్యవసర పరిస్థితులపై తమ సహకారాన్ని విస్తరించుకోగలవని ఆయన అన్నారు. సమర్థవంతమైన కమ్యూనికేషన్ , సమాచార మార్పిడి అత్యవసర పరిస్థితులకు సకాలంలో, ప్రత్యేకమైన సమన్వయ ప్రతిస్పందనను నిర్ధారించడానికి సహాయపడుతుందని శ్రీ షా అన్నారు. విపత్తులను తట్టుకునే సామర్థ్యాన్ని పెంపొందించడంలో నూతన, అభివృద్ధి చెందిన సాంకేతిక పరిజ్ఞానం కీలక పాత్ర పోషిస్తుందన్నారు.
ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను , విపత్తు నష్టాల అంచనా, స్పందన వ్యవస్థలను మెరుగుపరచడానికి కృత్రిమ మేధస్సు, రిమోట్ సెన్సింగ్, డ్రోన్ టెక్నాలజీ ,డేటా అనలిటిక్స్ వంటి సాంకేతిక పరిజ్ఞానాలను విజయవంతంగా ఉపయోగించడంలో ఎస్ సి ఒ సభ్య దేశాలు తమ అనుభవాన్ని , విజ్ఞానాన్ని పంచుకోవచ్చని అన్నారు. ఇలాంటి సాంకేతిక పరిజ్ఞానం మన ప్రతిస్పందన ప్రయత్నాల ప్రభావాన్ని, సామర్థ్యాన్ని పెంచడానికి కూడా సహాయపడుతుందని, ఇది శోధన, సహాయక చర్యల్లో గేమ్ ఛేంజర్ అని రుజువు చేస్తుందని హోం మంత్రి అన్నారు.
107A3934
న్యూఢిల్లీలో జరిగే ఈ సమావేశం సభ్యదేశాల మధ్య సహకారానికి కొత్త మార్గాలను తెరుస్తుందని శ్రీ అమిత్ షా ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ నాయకత్వంలో, కొత్త అవకాశాలను సాధ్యమైనంత వరకు అన్వేషించడానికి, ఉపయోగించుకోవడానికి భారతదేశం కట్టుబడి ఉందని, ప్రపంచ వేదికపై ఎస్ సి ఒ పాత్రను పెంచడంలో మా అనుభవాన్ని పంచుకోవడంలో సహకరించడానికి సిద్ధంగా ఉందని ఆయన అన్నారు.
******
(Release ID: 1918480)
Visitor Counter : 239