హోం మంత్రిత్వ శాఖ

ఈ రోజు ఢిల్లీలో జరిగిన మాదక ద్రవ్యాల వ్యాప్తి నిరోధానికి రాష్ట్ర/కేంద్రపాలిత ప్రాంత స్థాయిలో టాస్క్ ఫోర్స్ అధిపతుల మొదటి సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా


2047 నాటికి మాదక ద్రవ్య రహిత దేశంగా భారతదేశాన్ని రూపొందించడానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రతి ఒక్కరూ అంకిత భావంతో పని చేయాలి. శ్రీ షా

భావి తరాల ఉజ్వల భవిష్యత్తు కోసం మాదక ద్రవ్య రహిత భారతదేశం అభివృద్ధి అవసరం.. శ్రీ షా

మాదక ద్రవ్యాల నిరోధానికి ప్రస్తుతం సాగిస్తున్న ప్రయత్నాలను దృఢ సంకల్పంతో, సమిష్టి కృషితో, టీమ్‌ఇండియా, సంపూర్ణ ప్రభుత్వ దృక్పథంతో ముందుకు సాగితే లక్ష్యం చేరుకోవచ్చు.. శ్రీ షా

దేశాన్ని, యువతను నిర్వీర్యం చేస్తూ, ఆర్థిక వ్యవస్థను దెబ్బ తీయడానికి, మాదక ద్రవ్యాల ద్వారా తీవ్రవాద కార్యకలాపాలు ప్రోత్సహిస్తున్న మాదక ద్రవ్య వ్యాపారుల పై ఉక్కు పాదం మోపి అణచివేయాలి.. శ్రీ షా

తిరిగి మార్కెట్ లోకి ప్రవేశించకుండా చూసేందుకు స్వాధీనం చేసుకున్న మాదక ద్రవ్యాలను సరైన పద్ధతిలో బహిరంగంగా నాశనం చేసి ప్రజల్లో అవగాహన పెంపొందించాలి.. కేంద్ర హోంమంత్రి

చైన్త్యవంతులైన 1130 కోట్ల మంది ప్రజలు సహకారం, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమర్ధ నాయకత్వంలో మాదక ద్రవ్యాల నిరోధానికి సాగుతున్న యుద్ధంలో విజయం సాధించడం ఖాయం .. శ్రీ షా

రాజకీయాలు, రాజకీయ సిద్ధాంతాలు,

Posted On: 19 APR 2023 7:44PM by PIB Hyderabad

ఈ రోజు ఢిల్లీలో జరిగిన మాదక ద్రవ్యాల వ్యాప్తి నిరోధానికి రాష్ట్ర/కేంద్రపాలిత ప్రాంత స్థాయిలో  టాస్క్ ఫోర్స్ అధిపతుల మొదటి సమావేశంలో  కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సమావేశంలో శ్రీ అమిత్ షా వార్షిక నివేదిక (స్పెషల్ ఎడిషన్), 2022 , డ్రగ్ ఫ్రీ ఇండియా, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో రూపొందించిన నేషనల్ రిజల్యూషన్ బుక్‌లెట్ ఆఫ్ ని  విడుదల చేశారు.అక్రమంగా సాగుతున్న మాదక ద్రవ్యాల సాగును గుర్తించి, నాశనం చేయడానికి రూపొందించిన " మ్యాప్ డ్రగ్స్" మొబైల్ యాప్, పోర్టల్ ను కూడా శ్రీ అమిత్ షా ప్రారంభించారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఇండోర్ ప్రాంతీయ కార్యాలయ సముదాయాన్ని వర్చ్యువల్ విధానంలో శ్రీ షా ప్రారంభించారు. సమావేశంలో కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్, హోంశాఖ సహాయ మంత్రి శ్రీ నిత్యానంద రాయ్, , కేంద్ర హోంశాఖ కార్యదర్శి,నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో డైరెక్టర్ జనరల్ శ్రీ SN ప్రధాన్ పాల్గొన్నారు. 

సమావేశంలో ప్రసంగించిన శ్రీ అమిత్ షా 2047 నాటికి మాదక ద్రవ్యాలను పూర్తిగా నిరోధించి మాదక ద్రవ్య రహిత భారతదేశాన్ని అభివృద్ధి చేయడానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో చర్యలు అమలు జరుగుతున్నాయని తెలిపారు. భావి తరాల ఉజ్వల భవిష్యత్తు కోసం  మాదక ద్రవ్య రహిత భారతదేశాన్ని అభివృద్ధి చేయాల్సి ఉంటుందన్నారు. మాదక ద్రవ్యాల నిరోధానికి ప్రస్తుతం సాగిస్తున్న ప్రయత్నాలను  దృఢ సంకల్పంతో, సమిష్టి కృషితో, టీమ్‌ఇండియా, సంపూర్ణ  ప్రభుత్వ దృక్పథంతో అమలు చేసి ముందుకు సాగితే లక్ష్యాన్ని సులువుగా సాధించవచ్చునని శ్రీ షా పేర్కొన్నారు. 

చట్ట విరుద్ధంగా సాగుతున్న మాదక ద్రవ్యాల సాగును గుర్తించడానికి ప్రత్యేక యాప్ ను అభివృద్ధి చేశామని శ్రీ షా తెలిపారు. యాప్ ను విడుదల చేసిన మంత్రి ఇండోర్ లో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ప్రాంతీయ కార్యాలయాన్ని కూడా ప్రారంభించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న చర్యలు మాదక ద్రవ్యాల నిరోధానికి సహకరిస్తాయన్నారు. భారతదేశం అభివృద్ధిలో యువత కీలకంగా ఉంటారని పేర్కొన్న శ్రీ షా మాదక ద్రవ్యాలు యువత భవిష్యత్తును నాశనం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.యువత పెడదోవ పట్టడంతో దేశాభివృద్ధి కుంటుపడుతుందని అన్నారు. బలహీనంగా ఉన్న యువత ఆధారంగా బలమైన దేశ నిర్మాణం సాధ్యం కాదన్నారు. మాదక ద్రవ్యాల వల్ల యువత మాత్రమే కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థ, దేశ రక్షణ దెబ్బతింటున్నాయని శ్రీ షా అన్నారు. 

మాదక ద్రవ్యాల నిరోధానికి అనేక దేశాలు చేసిన ప్రయత్నాలు సరైన ఫలితాలు అందించలేదని శ్రీ అన్నారు. అయితే, 130 కోట్ల మంది ప్రజల నుంచి అందుతున్న సహకారంతో మాదక ద్రవ్యాలపై ప్రకటించిన యుద్ధంలో భారతదేశం విజయం సాధిస్తూ ముందుకు సాగుతున్నదని శ్రీ షా అన్నారు. ప్రభుత్వం అమలు చేసే కార్యక్రమాల వల్ల మాదక ద్రవ్యాల వ్యాప్తి నిరోధానికి సాగుతున్న కృషి విజయం సాధించదు అని  స్పష్టం చేసిన శ్రీ అమిత్ షా ప్రభుత్వ కృషికి ప్రజల నుంచి సహకారం ;లభించినప్పుడు మాత్రమే కార్యక్రమం విజయవంతం అవుతుందన్నారు. మాదక ద్రవ్యాల నిరోధానికి సాగుతున్న పోరాటం  కేవలం ప్రభుత్వ పోరాటంగా కాకుండా అన్ని శకలాలు, అన్ని వర్గాలకు చెందిన ప్రజలు సాగిస్తున్న పోరాటంగా అమలు జరగాల్సి ఉంటుందని శ్రీ షా స్పష్టం చేశారు. మాదక ద్రవ్యాలు తీసుకుంటున్న వ్యక్తిని భాదితునిగా, మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్న వారిని సంఘ విద్రోహ శక్తులుగా గుర్తించి కఠిన చర్యలు అమలు చేయాలనీ శ్రీ షా సూచించారు. దృష్టి సారించి పనిచేస్తే చేపట్టిన కార్యక్రమం విజయవంతం అవుతుందన్నారు. మాదక ద్రవ్యాల నిరోధానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 3 అంచెల కార్యక్రమాన్ని రూపొందించారని శ్రీ షా వెల్లడించారు. వ్యవస్థను పటిష్టం చేసి, ప్రజలను చైతన్య వంతులను చేయడం, కార్యక్రమాలు అమలు చేస్తున్న సంస్థల మధ్య సమన్వయం సాధించడానికి శ్రీ మోదీ ప్రణాళిక రూపొందించారన్నారు. టీమ్ ఇండియా,సంపూర్ణ ప్రభుత్వం విధానంతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. రాజకీయాలు, రాజకీయ సిద్ధాంతాలకు అతీతంగా కార్యక్రమం అమలు జరగాలని శ్రీ షా పేర్కొన్నారు.  రాజకీయాలు, రాజకీయ సిద్ధాంతాలు, పార్టీలతో సంబంధం లేకుండా మాదక ద్రవ్యాలపై ప్రకటించిన యుద్దాన్ని ఎవరిని ఉపేక్షించకుండా  రాష్ట్ర ప్రభుత్వాలు కొనసాగించాలని శ్రీ షా పిలుపు ఇచ్చారు. 

  గత మూడేళ్లలో మాదక ద్రవ్యాల నిరోధానికి అమలు చేస్తున్న చర్యలు   ప్రోత్సాహకరంగా ఉన్నాయని కేంద్ర హోంమంత్రి, సహకార మంత్రి అన్నారు. 2006-2013 సంవత్సరాల మధ్య కేవలం 1,257 కేసులు నమోదు కాగా, 2014-2022 మధ్య వాటి సంఖ్య  181 శాతం పెరిగి 3,544కు చేరుకుంది అని  శ్రీ షా తెలియజేశారు. అదే సమయంలో మొత్తం అరెస్టుల సంఖ్య  దాదాపు 300 శాతం పెరిగి 1,363 నుంచి   5,408కి చేరుకుంది. 2006-2013 మధ్య కాలంలో 1.52 లక్షల కిలోగ్రాముల మాదక ద్రవ్యాలు  పట్టుబడగా, 2014-2022 మధ్య కాలంలో అది 3.73 లక్షల కిలోలకు రెట్టింపు అయింది. రూ.కోటి విలువైన డ్రగ్స్ 2006-2013 మధ్య కాలంలో 768 కోట్ల విలువ చేసే  స్వాధీనం చేసుకున్న అధికారులు , . 2014-2022 మధ్య 22,000 కోట్ల రూపాయల విలువ చేసే మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు.

కింది నుంచి పైకి, పైనుంచి కిందికి పద్ధతిలో  అన్ని స్థాయిల్లో మాదక ద్రవ్య సరఫరా వ్యవస్థను  నాశనం చేయడానికి చర్యలు అమలు జరగాలి అని  శ్రీ షా సూచించారు. అంతరాష్ట్ర, అంతర్జాతీయ వ్యాపారాన్ని అణచి వేయడానికి ప్రత్యేక విధానాన్ని రూపొందించాలని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో కు శ్రీ సూచించారు. ఆలోచించి సమస్య శాశ్వత  పరిష్కారానికి మార్గాలను రూపొందించే అంశంపై సమావేశం దృష్టి సారించాలని శ్రీ షా అన్నారు. మాదక ద్రవ్యాల నిరోధానికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని హామీ ఇచ్చిన శ్రీ షా దీనికోసం సంయుక్త సమన్వయ కమిటీ ఏర్పాటు చేసి అన్ని వర్గాల నుంచి మద్దతు పొందడానికి కృషి చేస్తామన్నారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అభివృద్ధి చేసిన NCORD, NIDAN పోర్టల్‌లను అన్ని రాష్ట్రాలు పూర్తిగా ఉపయోగించుకోవాలని శ్రీ షా అన్నారు.

మాదక ద్రవ్యాల అణచివేతలో మాదక ద్రవ్య అక్రమ రవాణా చట్టాన్ని కఠినంగా చేస్తూ మాదక ద్రవ్య వ్యాపారుల ఆస్తుల స్వాధీనం చేసుకోవడం ప్రధాన ఆయుధాలుగా ఉపయోగించాలి అని  మంత్రి సూచించారు. నిర్దాక్షిణ్యంగా వ్యవహరించి మాదక ద్రవ్య రహిత భారతదేశం నిర్మాణానికి కృషి జరగాలన్నారు. డార్క్ నెట్, క్రిప్టోకరెన్సీ వినియోగాన్ని అరికట్టేందుకు రాష్ట్రాలు కేంద్ర సంస్థలకు సహకారం  అందించాలని  శ్రీ షా అన్నారు. బ్లాక్ చైన్ అనాలసిస్, మ్యాప్ ఇంటెలిజెన్స్, డిజిటల్ ఫోరెన్సిక్స్ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడానికి అన్ని రాష్ట్రాలు  నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ తో కలిసి పని చేయాలని సూచించారు. సాంకేతిక అంశాల వినియోగంతో త్వరిత గతిన లక్ష్యం  చేరుకోవచ్చు అని మంత్రి అన్నారు. 

సరైన పద్దతిలో స్వాధీనం చేసుకున్న మాదక ద్రవ్యాలను నాశనం చేయాలని శ్రీ షా అన్నారు. అవినీతి వల్ల    తిరిగి మార్కెట్ లోకి ప్రవేశించకుండా చూసేందుకు  స్వాధీనం చేసుకున్న మాదక ద్రవ్యాలను సరైన పద్ధతిలో బహిరంగంగా  నాశనం చేసి ప్రజల్లో అవగాహన పెంపొందించే కార్యక్రమాలు అమలు జరగాలన్నారు. ఎన్‌డిపిఎస్, ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయడానికి అన్ని రాష్ట్రాలు రాష్ట్ర హైకోర్టు తో కలిసి పనిచేయాలని, దీనివల్ల కేసుల సత్వర పరిష్కారానికి అవకాశం ఉంటుందని శ్రీ షా అన్నారు.పోలీసు ఆధునీకరణ, ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీల (ఎఫ్‌ఎస్‌ఎల్) అప్‌గ్రేడేషన్‌కు అందుబాటులో ఉన్న కేంద్ర నిధులను నార్కో సంబంధిత ఎఫ్‌ఎస్‌ఎల్ అప్‌గ్రేడేషన్‌కు కూడా ఉపయోగించాలని ఆయన అన్నారు. ఎన్‌డిపిఎస్ వాణిజ్య వ్యవహారాల దర్యాప్తుకు సంబంధించిన కేసులను ఈడి, ఇతర ఏజెన్సీలకు పంపాలని   ఆయన అన్నారు. మొత్తం రవాణా వ్యవస్థను నాశనం చేసే అంశంపై  దృష్టి పెట్టాలని శ్రీ షా అన్నారు. దీనితో పాటు పునరావాసం,ప్రజా చైతన్య కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. 

పోలీస్ టెక్నాలజీ మిషన్ కింద కేంద్ర  ప్రభుత్వం అందిస్తున్న  సౌకర్యాలలో మత్తు పదార్థాలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్ర హోంమంత్రి, సహకార శాఖ మంత్రి అన్నారు. ఎన్‌సిఓఆర్‌డి నాలుగు స్థాయిల సమావేశాలు, కేంద్రంలో రెండు, రాష్ట్రంలో రెండు సమావేశాలు క్రమం తప్పకుండా నిర్వహించాలని ఆయన సూచించారు.  జిల్లా స్థాయి ఎన్‌సీఓఆర్‌డీ సమావేశం అత్యంత కీలకమన్నారు. జిల్లా స్థాయి ఎన్‌సిఓఆర్‌డి సమావేశాలు నిర్వహించేందుకు ప్రతి రాష్ట్రం  కృషి చేయాలని శ్రీ షా అన్నారు. కేంద్రీకృత ఎన్‌సిఓఆర్‌డి పోర్టల్‌లో పొందుపరిచే సమాచారం   అందరికీ సహాయపడుతుందని ఆయన అన్నారు.  మాదకద్రవ్యాల అక్రమ రవాణా నిరోధానికి  అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న స్థాయిలో దేశంలో కార్యకలాపాలు సాగాలన్నారు.  దేశంలోని ఏ ప్రాంతంలోనైనా నెట్‌వర్క్‌కు సంబంధించిన అన్ని అనుసంధానాలను నాశనం చేయడం యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ చీఫ్‌లందరి బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు. జిల్లా, రాష్ట్ర స్థాయిలో సమాచార వ్యవస్థను పటిష్టం చేయాలని శ్రీ షా సూచించారు. దీనివల్ల మాదక ద్రవ్యాల రవాణాపై స్పష్టమైన సమాచారం అందుతుందన్నారు. దీని ఆధారంగా సమస్య పరిష్కారానికి ప్రణాళిక రూపొందిశ్చాడానికి వీలవుతుందన్నారు. సమస్యల మూలాన్ని గుర్తించి నాశనం చేయడం వల్ల లక్ష్యాన్ని చేరుకోవడానికి వీలవుతుందని శ్రీ షా పేర్కొన్నారు. సముద్ర మార్గంలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టేందుకు కేంద్ర సంస్థలు, తీర ప్రాంత రాష్ట్రాలు, స్థానిక ప్రజల మధ్య  సమన్వయం ఉండాలని అన్నారు. 

మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా సాగుతున్న  పోరాటం ఖచ్చితంగా కష్టతరమైనది అని వ్యాఖ్యానించిన శ్రీ షా  2047 నాటికి మాదక ద్రవ్య  రహిత భారతదేశం నిర్మాణం జరగాలన్న   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ లక్ష్యాన్ని సాధించేందుకు సంఘటితంగా ప్రయత్నాలు జరగాలని  శ్రీ అమిత్ షా అన్నారు.

***



(Release ID: 1918132) Visitor Counter : 231