రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
భారత ప్రభుత్వ పర్వతమాల పరియోజన కింద 1200కిమీలకు పైగా రోప్‌వేల పొడవుతో 250కుపైగా ప్రాజెక్టులను అభివృద్ధి చేయాలని యోచిస్తోందన్న శ్రీ నితన్ గడ్కరీ
Posted On:
19 APR 2023 3:09PM by PIB Hyderabad
కేంద్ర రోడ్డు రవాణా & హైవేల మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ బుధవారంనాడు ఆస్ట్రియా ఇన్స్‌బ్రక్‌లోని ఆల్పైన్ టెక్నాలజీస్ నిర్వహించే ప్రముఖ అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శన ఇంటరాల్‌పిన్ 2023 ను ఉద్దేశించి ప్రసంగించారు. కేబుల్ కార్ పరిశ్రమలో కీలక పారిశ్రామికవేత్తలను, సేవలను అందించే వారిని, నిర్ణయకర్తలను ఈ ప్రదర్శన ఒకచోటకు చేరుస్తుంది.
భారత ప్రభుత్వ పర్వతమాల పరియోజన కింద 1200కిమీలకు పైగా రోప్‌వేల పొడవుతో 250కుపైగా ప్రాజెక్టులను అభివృద్ధి చేయాలని యోచిస్తోందని శ్రీ గడ్కరీ అన్నారు. భారత ప్రభుత్వం 60% సహకారంతో హైబ్రిడ్ ఆన్యుటీ మోడల్ (మిశ్రిత వార్షిక ద్రవ్య కేటాయింపు నమూనా) కింద పిపిపిపై తమ దృష్టి ఉందని పేర్కొన్నారు. రోప్‌వే విడిభాగాల ఉత్పత్తిని మేక్ ఇన్ ఇండియా చొరవ కింద ప్రోత్సహిస్తున్నామన్నారు.
నిలకడైన, సురక్షితమైన రవాణాకు హామీ ఇచ్చేందుకు ప్రస్తుత రోప్‌వే ప్రమాణాల పెంపుదలలో పాలుపంచుకోవడాన్ని, భారతీయ మౌలిక సదుపాయాలను మరింత ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళాలన్న భారత్ పరివర్తనాత్మక ప్రయాణంలో భాగం అయ్యేందుకు ఆస్ట్రియా & ఐరోపా పరిశ్రమలను తాము ప్రోత్సహిస్తున్నామని శ్రీ గడ్కరీ పేర్కొన్నారు.
సౌకర్యవంతమైన, పర్యావరణ అనుకూలమైన రోప్‌వే ప్రయాణీకుల రవాణాకు మార్గం వేసే అత్యాధునిక పరిష్కారాలు, వినూత్న నమూనా, ఉన్నత నాణ్యత, కార్యాచరణను అందించే రోప్‌వే వ్యవస్థల ప్రపంచంలోనే ప్రముఖ ఉత్పత్తిదారుల ఉత్పత్తుల ప్రదర్శనను శ్రీ గడ్కరీ సందర్శించి, తిలకించారు.
***
(Release ID: 1918130)