ప్రధాన మంత్రి కార్యాలయం

ప్రభుత్వ ఉద్యోగుల ను ఉద్దేశించిఏప్రిల్ 21 వ తేదీ నాడు ప్రసంగించనున్న ప్రధాన మంత్రి


సివిల్ సర్విసెస్ డే సందర్భం లో నిర్వహించబోయేఈ కార్యక్రమం దేశ నిర్మాణం కోసం  ప్రభుత్వఉద్యోగుల ను మరింత ఎక్కువ ఉత్సాహితులను చేసేందుకు మరియు వారి లో ప్రేరణ నుకలుగజేసేందుకు ప్రధాన మంత్రి కి ఒక ఉపయోగకరమైన వేదిక గా ఉండగలదు

‘ప్రజా పరిపాలన లో శ్రేష్ఠత్వాని కిగాను ప్రధాన మంత్రి తరుఫు న పురస్కారాలు’ ను ప్రదానం చేయనున్న ప్రధాన మంత్రి

Posted On: 18 APR 2023 7:26PM by PIB Hyderabad

సివిల్ సర్విసెస్ డే సందర్భం లో 2023 ఏప్రిల్ 21 వ తేదీ న ఉదయం 11 గంటల కు న్యూ ఢిల్లీ లోని విజ్ఞాన్ భవన్ లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రభుత్వ ఉద్యోగుల ను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.

 

 

దేశ నిర్మాణం లో ప్రభుత్వ ఉద్యోగులు అందిస్తున్నటువంటి తోడ్పాటు ను ప్రధాన మంత్రి క్రమం తప్పక ప్రశంసిస్తూ రావడం తో పాటుగా వారు మరింత అధికం గా శ్రమించేటట్టుగా వారి లో ఉత్సాహాన్ని నింపుతూ వస్తున్నారు. దేశం అంతటా ప్రభుత్వోద్యోగులు సమధికోత్సాహంతో దేశ ప్రజల కు సేవల ను అందించగలిగేటట్టు మరీ ముఖ్యం గా ఈ అమృత కాలం తాలూకు కీలక దశ లో వారి ని ఉత్సాహితుల ను చేసేందుకు మరియు వారి లో ప్రేరణ ను కలుగజేసేందుకు ప్రధాన మంత్రి కి ఈ కార్యక్రమం ఒక ఉపయోగకరమైనటువంటి వేదిక గా ఉండబోతోంది.

 

 

‘ప్రజా పరిపాలన లో శ్రేష్ఠత్వాని కి గాను ఇచ్చే ప్రధాన మంత్రి పురస్కారాలు’ ను ప్రధాన మంత్రి ఇదే కార్యక్రమం లో ప్రదానం చేయనున్నారు. సామాన్య పౌరుల సంక్షేమాని కి కేంద్ర ప్రభుత్వం లో మరియు రాష్ట్రాల ప్రభుత్వాల లో జిల్లా లు మరియు సంస్థ లు నడుంకట్టిన అసాధారణమైనటువంటి మరియు వినూత్నమైనటువంటి కార్యాల ను గుర్తించాలన్న దృష్టి తో ఈ పురస్కారాల ను ఇస్తూ రావడం జరుగుతున్నది.

 

 

ప్రాధాన్య కార్యక్రమాలు గా గుర్తించిన నాలుగు కార్యక్రమాల లో జరిగిన మార్గదర్శకప్రాయమైనటువంటి కార్యాల కు పురస్కారాల ను ఇవ్వడం జరుగుతుంది. ఆ నాలుగు కార్యక్రమాలు ఏవేవి అంటే అవి.. ‘హర్ ఘర్ జల్ యోజన’ ద్వారా స్వచ్ఛ జలాల కు ప్రోత్సాహాన్ని ఇవ్వడం; హెల్థ్ ఎండ్ వెల్ నెస్ సెంటర్ స్ ద్వారా స్వస్థ్ బారత్ కు ప్రోత్సాహాన్ని ఇవ్వడం; ‘సమగ్ర శిక్ష’ కార్యక్రమం ద్వారా విద్యార్థినీ విద్యార్థులు అందరికీ సమానం గా నాణ్యమైన విద్య బోధన మరియు తరగతి గది లో సమైక్య వాతావరణాన్ని ప్రోత్సహించడం; అలాగే మహత్వాంక్షభరిత జిల్లా ల కార్యక్రమం ద్వారా సంపూర్ణమైనటువంటి అభివృద్ధి అంటే, సంక్షేమ పథకాల తాలూకు ఫలాలు అన్ని వర్గాల ప్రజల కు చేరేటట్లుగా ప్రత్యేక శ్రద్ధ తో కూడిన వైఖరి ని అవలంభించడం ద్వారా మొత్తం మీద ప్రగతి సాధన.. అనేవే. పైన ప్రస్తావించిన నాలుగు కార్యక్రమాల కు గాను మొత్తం ఎనిమిది పురస్కారాల ను ఇవ్వడం జరుగుతుంది. అదనం గా నూతన ఆవిష్కరణల కు ఏడు పురస్కారాల ను ఇవ్వడం జరుగుతుంది.

 

 

***



(Release ID: 1917852) Visitor Counter : 147