ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

భారతదేశం అధ్యక్షతన జరిగిన జీ-20 ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల (ఏఫ్ఎంసిబిజి) 2వ సమావేశం

Posted On: 14 APR 2023 9:10AM by PIB Hyderabad

  భారతదేశం అధ్యక్షతన జీ-20 ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల (ఏఫ్ఎంసిబిజి) 2వ సమావేశం 2023 ఏప్రిల్ 12,13 తేదీల్లో జరిగింది. 2023 అంతర్జాతీయ ద్రవ్య నిధి, ప్రపంచ బ్యాంకు స్ప్రింగ్ సమావేశాల్లో భాగంగా  జీ-20 ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల (ఏఫ్ఎంసిబిజి) 2వ సమావేశం జరిగింది. భారత ఆర్థిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్, భారత రిజర్వు బ్యాంక్ గవర్నర్ శ్రీ  శక్తికాంత దాస్ సమావేశానికి అధ్యక్షత వహించారు. జీ-20 సభ్య దేశాలు, 12 ఆహ్వానిత దేశాలు, వివిధ అంతర్జాతీయ, ప్రాంతీయ సంస్థలకు చెందిన దాదాపు 350 మంది ప్రతినిధులు సమావేశంలో పాల్గొన్నారు.  

 

ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితి, సమ్మిలిత  ఆర్థిక రంగం, అంతర్జాతీయ పన్ను విధానం అంశాలపై మూడు సమావేశాలు జరిగాయి. ఫిబ్రవరిలో జరిగిన జీ-20 ఆర్థిక వ్యవహారాల సమావేశంలో వివిధ అంశాలపై సాధించిన ప్రగతి, వివిధ ఉప సంఘాలకు అప్పగించిన బాధ్యత అమలు తదితర అంశాలను చర్చించిన సమావేశం తుది నిర్ణయాల అమలు కోసం అమలు చేయాల్సిన కార్యాచరణ ప్రణాళికపై చర్చింది. 

 

అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక పరిస్థితిపై జరిగిన సమావేశంలో  ప్రతినిధులు ఉక్రెయిన్ యుద్ధం, ఆహార, ఇంధన రంగంలో నెలకొన్న సంక్షోభం, వాతావరణ మార్పులు, ఆర్థిక భద్రతకు ఎదురవుతున్న సమస్యలు చర్చించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి, ముప్పు ప్రమాదం ఎదుర్కొంటున్న దేశాలు, కోన్ వర్గాలకు చెందిన ప్రజల ప్రయోజనాలు రక్షించడానికి జీ-20 దేశాలు సంఘటిత కృషి చేయాల్సిన అవసరం ఉందని సమావేశం అభిప్రాయపడింది. 

పెట్టుబడుల రంగంపై ఏర్పాటు  చేసిన స్వతంత్ర  కమిటీ అందించిన సలహాలు, సూచనలు  జీ-20 ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల సదస్సులో చర్చకు వచ్చాయి. సమగ్ర ఆర్థిక అభివృద్ధి సాధించడానికి ఇటీవల జీ-20 ఏర్పాటు చేసిన నిపుణుల సంఘం విధి విధానాలను సమావేశం చర్చించింది. రుణ అంశం కూడా సమావేశంలో చర్చకు వచ్చింది.  తక్కువ-ఆదాయ మరియు బలహీనమైన మధ్య-ఆదాయ దేశాలలో పెరుగుతున్న రుణ సమస్యలు  పరిష్కరించే దిశగా బహుపాక్షిక సమన్వయాన్ని బలోపేతం చేసే అంశంపై  చర్చలు జరిగాయి. రుణాల మంజూరు అంశాలపై తక్షణ చర్యలు అమలు చేయాల్సిన అవసరం ఉందని సమావేశంలో పాల్గొన్న ప్రతినిధులు అభిప్రాయపడ్డారు.  మూలధన పెట్టుబడులపై  వాతావరణ మార్పు-సంబంధిత విధానాల ప్రభావాన్ని కూడా సమావేశం చర్చించింది. 

సుస్థిర ఆర్థిక పరిస్థితి, సమగ్ర ఆర్థిక వ్యవస్థ అంశాలపై జరిగిన సమావేశంలో వాతావరణ మార్పుల ప్రభావం ఎదుర్కోవడానికి నిధుల సమీకరణ,సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు సాధించే అంశంలో ప్రైవేట్ పెట్టుబడుల ప్రాధాన్యత, సామాజిక అంశాలను ప్రభావితం చేసే రంగాల్లో జి-20 దేశాలు అనుసరించాల్సిన వైఖిరి లాంటి అంశాలను ప్రతినిధులు చర్చించారు. క్రిప్టో ఆస్తుల రూపంలో ఎదురవుతున్న ఆర్థిక సవాళ్ల పరిష్కరించడానికి అమలు చేయాల్సిన చర్యలు, కొత్తగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్లు, ఆర్థిక వ్యవస్థలపై సమావేశం చర్చించింది. సమగ్ర ఆర్థిక అభివృద్ధి సాధించడానికి డిజిటల్ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి సాధించాలని సమావేశం అభిప్రాయపడింది. సమగ్ర సంపూర్ణ ఆర్థిక కార్యాచరణ ప్రణాళిక 2023 అంశంపై ప్రతినిధులు తమ అభిప్రాయాలు, సూచనలు తెలిపారు. 

అంతర్జాతీయ పన్ను విధానంపై జరిగిన 3వ సమావేశంలో అంతర్జాతీయంగా  రెండు అంచెల పన్ను విధానం అమలు జరగాల్సిన ఆవశ్యకతపై చర్చ జరిగింది. పారదర్శకంగా పన్ను విధానం అమలు జరిగేలా చూసే అంశంలో జీ-20 సభ్య దేశాలు పోషించాల్సిన పాత్రను సమావేశం చర్చించింది. 

సమావేశానికి సమాంతరంగా ఉన్నత స్థాయి చర్చలు జరిగాయి. ప్రపంచ సార్వభౌమ రుణ విధానంపై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశానికి  ఆర్థిక మంత్రి, అంతర్జాతీయ ద్రవ్య నిధి ఎండీ, ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు సహ అధ్యక్షత వహించారు. సమావేశంలో అంతర్జాతీయంగా నెలకొన్న రుణ భారం, రుణ రంగంలో ఎదురవుతున్న సవాళ్లు చర్చకు వచ్చాయి. సమావేశం అనంతరం సంయుక్త పత్రికా ప్రకటన విడుదల అయ్యింది. ప్రకటన పూర్తి పాఠం  https://www.imf.org/en/News/Articles/2023/04/12/pr23117-global-sovereign-debt-roundtable-cochairs-press-stmt.లో అందుబాటులో ఉంది. 

సమావేశం అనంతరం 2023 ఏప్రిల్ 12న ఉప ఆర్థిక మంత్రులు, ఉప గవర్నర్ల సమావేశం జరిగింది. ఎంబీడి సమావేశం చేసిన సిఫార్సులు సమావేశంలో చర్చకు వచ్చాయి. సమావేశం సిఫార్సుల ఆధారంగా ఆధారంగా ఫైనాన్స్ ట్రాక్ సమావేశంలో తుది నివేదిక రూపొందుతుంది. 

భారతదేశంలో గాంధీ నగర్ లో 2023 జూలై నెలలో జరిగే జీ-20 ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల (ఏఫ్ఎంసిబిజి)3వ సమావేశం, 2023 సెప్టెంబర్ 8,9 తేదీల్లో ఢిల్లీలో జరిగే శిఖరాగ్ర సమావేశంలో జరిగే చర్చలు  జీ-20 ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల (ఏఫ్ఎంసిబిజి) 2వ సమావేశం తీసుకున్న నిర్ణయాల ఆధారంగా ఖరారు చేస్తారు. 

 

***


(Release ID: 1916588) Visitor Counter : 432