శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సిఎస్ఐఆర్) ప్రధాన పరిశోధన ప్రయోగశాలలలో ఒకటైన డెహ్రాడూన్ లోని ఇండియన్
ఇన్ స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం ఆధ్వర్యం లో ఏప్రిల్ 13 నుండి 19 వరకు వన్ వీక్ వన్ ల్యాబ్ (ఒ డబ్ల్యూ ఒఎల్) ప్రచారం
ఏప్రిల్ 14న డెహ్రాడూన్ లోని తన క్యాంపస్ లో సీఎస్ఐఆర్-ఐఐపీ 64వ వ్యవస్థాపక దినోత్సవంతో పాటు భారతరత్న డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలలో భాగంగా ప్రచారానికి శ్రీకారం
కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ చేతుల మీదుగా 2023 జనవరి 6 న న్యూఢిల్లీలో ఈ ప్రచారాన్ని లాంఛనంగా ప్రారంభమైన వన్ వీక్ వన్ ల్యాబ్ ప్రచారం:
భారతదేశంలోని మొత్తం 37 సిఎస్ఐఆర్ ల్యాబ్ లను ఆయా స్పెషలైజేషన్ రంగాలలో గ్లోబల్ సెంటర్స్ ఆఫ్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ గా మారుస్తామని ఆ కార్యక్రమం లో ప్రకటించిన డాక్టర్ జితేంద్ర సింగ్
ప్రతి వారం ఒకో ప్రయోగశాల వారసత్వం, ప్రత్యేక ఆవిష్కరణలు , సాంకేతిక పురోగతిని ప్రదర్శించనున్న ప్రచారం
Posted On:
12 APR 2023 2:07PM by PIB Hyderabad
కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సిఎస్ఐఆర్) ప్రధాన పరిశోధన ప్రయోగశాలలలో ఒకటైన డెహ్రాడూన్ లోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం తన వన్ వీక్ వన్ ల్యాబ్ (ఒ డబ్ల్యూ ఒఎల్) ప్రచారాన్ని ఏప్రిల్ 13 నుండి 19 వరకు నిర్వహిస్తుంది. ఏప్రిల్ 13న న్యూఢిల్లీలో ప్రారంభోత్సవం, కర్టెన్ రైజర్ తో ప్రారంభమయ్యే ఈ వారం రోజుల ప్రచారంలో వివిధ ఇంటరాక్టివ్ ఈవెంట్లు జరగనున్నాయి.
డెహ్రాడూన్ లోని తన క్యాంపస్ లో ఏప్రిల్ 14న సీఎస్ఐఆర్-ఐఐపీ 64వ వ్యవస్థాపక దినోత్సవం, భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి ఉత్సవాల నిర్వహణ ను పురస్కరించుకుని ఈ ప్రచారాన్ని ప్రారంభిస్తారు.
ఐడియా న్యూక్లియేషన్ నుంచి పరిశ్రమలో దాని అమలు వరకు మన టెక్నాలజీల అభివృద్ధి ప్రయాణాన్ని ప్రదర్శించడానికి అదే రోజు వాటాదారుల సమావేశాన్ని నిర్వహించాలని సంస్థ యోచిస్తోంది. భారత పరిశ్రమ కొత్త దృక్పథాలను అర్థం చేసుకోవడం , సిఎస్ఐఆర్-ఐఐపి నుండి వారి అంచనాలపై కూడా ఈ కార్యక్రమం దృష్టి పెడుతుంది.
కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా) ఎర్త్ సైన్సెస్ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా) , పీఎంవో, పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్స్, పెన్షన్స్, అటామిక్ ఎనర్జీ అండ్ స్పేస్ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ 2023 జనవరి 6న న్యూఢిల్లీలో ఈ ప్రచారాన్ని లాంఛనంగా ప్రారంభించారు. భారతదేశంలోని మొత్తం 37 సిఎస్ఐఆర్ ల్యాబ్ లను ఆయా స్పెషలైజేషన్ రంగాలలో గ్లోబల్ సెంటర్స్ ఆఫ్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ గా మారుస్తామని డాక్టర్ జితేంద్ర సింగ్ ఆ సందర్భంగా చెప్పారు.
మే 2014 నుండి అన్ని శాస్త్రీయ ప్రయత్నాలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చురుకైన , నిరంతర మద్దతుతో, భారతదేశం సైన్స్, టెక్నాలజీ, ఇన్నోవేషన్ (ఎస్ టి ఐ) పర్యావరణ వ్యవస్థలో ప్రతిరోజూ కొత్త శిఖరాలను అధిరోహిస్తోందని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు.
దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న 37 సిఎస్ఐఆర్ (కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్) ల్యాబ్ లలో ప్రతి ఒక్కటి వేర్వేరు ప్రత్యేకమైన పరిశోధనకు అంకితం అయ్యాయని, "ఒక వారం, ఒక ల్యాబ్" ప్రచారం ప్రతి ల్యాబ్ కు దాని కృషి నీ ప్రదర్శించడానికి అవకాశాన్ని అందిస్తుందని, తద్వారా ఇతరులు దానిని ఉపయోగించుకుంటారని, వాటాదారులు దాని గురించి తెలుసుకోవచ్చునని డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు.
డెహ్రాడూన్ కు చెందిన ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం కార్యక్రమంలో (ఎ) ఫ్యూయల్ టెస్టింగ్ లేబొరేటరీ, (బి) అప్ స్ట్రీమ్ లేబొరేటరీ, (సి) డి4-మిథనాల్ డెమాన్ స్ట్రేషన్ ప్లాంట్ ప్రారంభోత్సవాలు ఉంటాయి. ఇది ఏప్రిల్ 15న ‘జిజ్ఞాస’ కార్యక్రమం ద్వారా పాఠశాల నుంచి యువత, మేధావులకు చేరుతుంది. ఇందులో సీఎస్ఐఆర్-ఐఐపీ శాస్త్రవేత్తలు, రీసెర్చ్ స్కాలర్లతో విద్యార్థులు సంభాషిస్తారు.
చమురు , గ్యాస్ పరిశ్రమలో సవాళ్లు- అవకాశాలను చర్చించడానికి వేదికను అందించే పూర్వ విద్యార్థుల సమావేశం, సిఎస్ఐఆర్-ఐఐపితో శిక్షణ పొందిన అనుబంధం కలిగిన పరిశ్రమ వ్యక్తులతో స్వచ్ఛమైన , సుస్థిరమైన ఇంధనం కోసం భవిష్యత్తు పరిశోధన విధానాలను కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తుంది. సిఎస్ఐఆర్-ఐఐపి రాజాజీ నేషనల్ పార్క్ పక్కనే ఉంది .చుట్టూ విశాలమైన తేయాకు తోటతో పచ్చని చెట్లు ఉన్నాయి. ఈ క్యాంపస్ లో 100 జాతులకు పైగా పక్షులు, సీతాకోక చిలుకలు నివసిస్తున్నాయి.
ఏప్రిల్ 16 న నేచర్ వాక్ @ సిఎస్ఐఆర్-ఐఐపి ని నిర్వహిస్తారు. ఇది పాల్గొనే వారికి ప్రకృతిలో
పరవశించడానికి దాని అందాలను ఆస్వాదించడానికి ఒక అద్భుతమైన అవకాశాన్ని అందిస్తుంది. అనంతరం సీఎస్ఐఆర్-ఐఐపీ క్యాంపస్ లో నీటి సంరక్షణ, భూగర్భ జలాల పునరుద్ధరణ కార్యక్రమాలను ప్రారంభిస్తారు. ఏప్రిల్ 17న సుస్థిర ఏవియేషన్ ఇన్ ఇండియా అండ్ ఇండస్ట్రీ మీట్ జరగనుంది, ఇది సుస్థిరమైన ఇంధనం డిఐఎల్ఎస్ఎఎఎఫ్™ బ్రాండ్ ప్రారంభంపై దృష్టి పెడుతుంది, తరువాత నిర్దిష్ట సాంకేతిక సవాళ్లను అధిగమించడంలో సిఎస్ఐఆర్-ఐఐపి, వివిధ పరిశ్రమ భాగస్వాముల మధ్య సహకార పరిణామాలపై చర్చలు జరుగుతాయి.
గ్రామీణ రంగం కోసం సంస్థ చొరవలు, ఆవిష్కరణలను ప్రదర్శించడానికి ఉత్తరాఖండ్ చంపావత్ లోని బజ్రికోట్ గ్రామంలో ఒక సమాంతర కార్యక్రమం గ్రామ్ చౌపాల్ ను షెడ్యూల్ చేశారు. ఇందులో భాగంగా గ్రామ ప్రతినిధులు/స్థానిక సంస్థలు, సీఎస్ఐఆర్-ఐఐపీ శాస్త్రవేత్తల మధ్య ముఖాముఖి ద్వారా ఇంధన పొదుపు పద్ధతులపై ,కార్యక్రమాలపై అవగాహన కల్పిస్తారు.
ఎంఎస్ఎంఇ భాగస్వాములకు సంస్థ పరిధిని ప్రదర్శించడానికి , ఇంట్రా-సిఎస్ఐఆర్ సహకార పరిశోధనను ప్రదర్శించడానికి ఎంఎస్ఎంఇ మీట్ అండ్ పాన్ సిఎస్ఐఆర్-కోలాబరేషన్ ఏప్రిల్ 18, 2023 న షెడ్యూల్ చేయబడింది.
ఏప్రిల్ 19న ఉత్తరాఖండ్ సమగ్రాభివృద్ధికి సీఎస్ఐఆర్-ఐఐపీ అందిస్తున్న సేవలపై ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో విస్తృత మేధోమథన సమావేశం, ముగింపు కార్యక్రమంతో ప్రచారం ముగుస్తుంది.
<><><><><><>
(Release ID: 1916056)
Visitor Counter : 231