కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

2022-23 సంవత్సరంలో నేషనల్ కెరీర్ సర్వీస్ (ఎన్.సి.ఎస్) లో 35.7 లక్షల ఖాళీలు నమోదయ్యాయి


ఒక మిలియన్ కంటే ఎక్కువ మంది యజమానులు ఎన్.సి.ఎస్. లో చేరారు

Posted On: 11 APR 2023 2:20PM by PIB Hyderabad

జాబ్ మ్యాచింగ్, కెరీర్ కౌన్సెలింగ్, వొకేషనల్ గైడెన్స్, స్కిల్ డెవలప్‌మెంట్‌ కోర్సుల పై సమాచారంతో పాటు, ఇంటర్న్‌షిప్‌ వంటి ఉపాధికి సంబంధించిన వివిధ రకాల సేవలను అందించడానికి వీలుగా నేషనల్ ఎంప్లాయ్‌మెంట్ సర్వీస్‌ ను మార్చడానికి  కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ, నేషనల్ కెరీర్ సర్వీస్ (ఎన్.సి.ఎస్) ప్రాజెక్టును మిషన్ మోడ్ ప్రాజెక్ట్‌గా అమలు చేస్తోంది.  ఎన్.సి.ఎస్. కింద సేవలు ఆన్‌లైన్‌ లో అందుబాటులో ఉన్నాయి.  వీటిని 2015 లో ప్రధానమంత్రి జాతికి అంకితం చేశారు.

ఎన్.సి.ఎస్. పోర్టల్ 2015 జూలై నెలలో ప్రారంభించినప్పటి నుంచి 2022-23 సంవత్సరంలో అత్యధిక ఖాళీలను నమోదు చేసింది.  2021-22 లో దాదాపు 13 లక్షల ఖాళీలు నమోదు కాగా, 2022-23 సంవత్సరంలో ఎన్.సి.ఎస్. లో దాదాపు 35.7 లక్షల ఖాళీలు అందుబాటులో ఉన్నట్లు, యజమానులు తెలియజేశారు.  2021-22 తో పోలిస్తే 2022-23 లో ఎన్.సి.ఎస్. లో ఖాళీల నమోదు 175 శాతం పెరిగింది.  అదేవిధంగా, 2022-23 సంవత్సరంలో కూడా 2022 అక్టోబర్, 30వ తేదీ వరకు 5.3 లక్షల కంటే ఎక్కువ ఖాళీలు నమోదయ్యాయి. 

ఎన్.సి.ఎస్. లో ఖాళీల నమోదులో పెరుగుదల అన్ని రంగాల్లో గమనించడం జరిగింది.  ఆర్ధిక, బీమా రంగం 2021-22 లో నమోదు చేసిన  2.2 లక్షల ఖాళీలతో పోలిస్తే, 2022-23 లో 800 శాతం కంటే ఎక్కువగా అసాధారణ వృద్ధి తో 20.8 లక్షల ఖాళీలను నమోదు చేసింది.  ఆపరేషన్స్సపోర్ట్ సెక్టార్ లోని ఖాళీలు కూడా 400 శాతం వృద్ధిని నమోదు చేశాయి.  2021-22 లో, ఈ రంగంలో,  76 వేల ఖాళీలు నమోదు కాగా, 2022-23 లో 3.75 లక్షల ఖాళీలు నమోదయ్యాయి.  "హోటళ్ళుఆహార సేవలుక్యాటరింగ్", "తయారీ రంగం" అదేవిధంగా, "ఆరోగ్యం", "విద్య" మొదలైన రంగాలలో ఖాళీలు కూడా గత ఏడాది కంటే 2022-23 సంవత్సరంలో గణనీయంగా పెరిగాయి.

ఎన్.సి.ఎస్. పోర్టల్ ప్రారంభించినప్పటి నుంచి ఒక మిలియన్ కంటే ఎక్కువ మంది యజమానులను నమోదు చేసి, 2022-23 సంవత్సరంలో రికార్డు సృష్టించింది.  మొత్తం నమోదైన యజమానుల్లో, 2022-23 సంవత్సరంలో 8 లక్షల కంటే ఎక్కువ మంది యజమానులు నమోదయ్యారు.  నమోదైన యజమానుల్లో ఎక్కువ మంది (6.5 లక్షల మంది) సర్వీస్ సెక్టార్ నుంచి  ఉన్నాయి.  ఆ తర్వాత స్థానంలో తయారీ రంగం నుంచి నమోదైన యజమానులు ఉన్నారు. 

ఉద్యోగార్ధులు, యజమానులు, శిక్షణ ఇచ్చేవారు,  ఉద్యోగాలు కల్పించే సంస్థలతో సహా భాగస్వాములందరికీ ఎన్.సి.ఎస్. పోర్టల్‌ లో అందుబాటులో ఉండే సేవలన్నీ ఉచితంగా అందించడం జరుగుతుంది. 

 

 

*****


(Release ID: 1915742) Visitor Counter : 210