ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

రోజ్ గార్ మేళా లో భాగం గా, ప్రభుత్వ విభాగాల లో మరియు సంస్థల లో కొత్త గా చేర్చుకొన్నవారి కి సుమారు 71,000 నియామక పత్రాల ను ఏప్రిల్ 13 వ తేదీ నాడు పంపిణీచేయనున్న ప్రధాన మంత్రి

Posted On: 11 APR 2023 12:42PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 ఏప్రిల్ 13వ తేదీ న ఉదయం పూట 10:30 గంటల వేళ కు వీడియో కాన్ఫరెన్సింగ్ మాధ్యం ద్వారా సుమారు 71,000 మంది కొత్తగా నియామకం జరిగిన వారికి నియామక పత్రాల ను పంపిణీ చేయనున్నారు. ఈ సందర్భం లో ప్రధాన మంత్రి నూతనం గా నియామకం అయినటువంటి వారి ని ఉద్దేశించి ప్రసంగిస్తారు కూడాను.

 

 

ఈ రోజ్ గార్ మేళా అనేది ఉపాధి కల్పన కు అత్యున్నత ప్రాధాన్యాన్ని కట్టబెట్టాలన్న ప్రధాన మంత్రి వచన బద్ధత ను నెరవేర్చే దిశ లో ఒక అడుగు గా ఉంది. బ్రతుకుదెరువు మార్గాల ను సృష్టించడం లో ఒక ఉత్ప్రేరకం వలె రోజ్ గార్ మేళా పని చేస్తుందని, యువతీయువకుల కు వారి సశక్తీకరణ తో పాటు వారు దేశ అభివృద్ధి లో పాలుపంచుకోవడానికి సార్థక అవకాశాల ను కూడా ప్రసాదించగలదన్న అంచనాలు ఉన్నాయి.

 

 

దేశవ్యాప్తం గా ఎంపిక చేసినటువంటి కొత్త ఉద్యోగుల ను భారత ప్రభుత్వం లో వేరు వేరు హోదాల లో/ఉద్యోగాల లో చేరనున్నారు. వారి ని ట్రైన్ మేనేజర్, స్టేశన్ మాస్టర్, సీనియర్ కమర్శియల్ కమ్ టికెట్ క్లర్క్, ఇన్స్ పెక్టర్, సబ్ ఇన్స్ పెక్టర్ స్, కానిస్టేబుల్, స్టెనోగ్రాఫర్, జూనియర్ అకౌంటెంట్, పోస్టల్ అసిస్టెంట్, ఇన్ కమ్ టాక్స్ ఇన్స్ పెక్టర్, టాక్స్ అసిస్టెంట్, సీనియర్ డ్రాఫ్ట్స్ మన్, జెఇ/సూపర్ వైజర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, టీచర్, లైబ్రేరియన్, నర్స్, ప్రొబేశనరీ ఆఫీసర్స్, పిఎ, ఎమ్ టిఎస్ వంటి ఇతర విధుల ను నిర్వహించడం కోసం చేర్చుకోవడమైంది.

 

కొత్త గా ఉద్యోగం లోకి చేర్చుకొన్న వ్యక్తుల కు కర్మయోగి ప్రారంభ్ మాధ్యం ద్వారా వారంతట వారే శిక్షణ ను పొందే అవకాశం దక్కనుంది. కర్మయోగి ప్రారంభ్ ఒక ఆన్ లైన్ ఓరియంటేశన్ కోర్సు, ప్రభుత్వం లో వివిధ విభాగాల లో కొత్త గా నియమితులు అయిన వారందరి కోసం ఉద్దేశించిందే ఈ కర్మయోగి ప్రారంభ్ కోర్సు.

 

***

 

 


(Release ID: 1915579) Visitor Counter : 501