ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్ -19 ను ఎదుర్కోవడానికి రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రిలో కల్పించిన మౌలిక సదుపాయాలు, సన్నద్ధత కోసం నిర్వహించిన మాక్ డ్రిల్‌ను పరిశీలించిన కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ
ప్రతి ఒక్కరూ కోవిడ్ అనుగుణ ప్రవర్తన అలవర్చుకోవాలి.. డాక్టర్ మన్సుఖ్ మాండవీయ
తప్పుడు సమాచారం నమ్మవద్దు. ప్రచారం చేయవద్దు.. డాక్టర్ మన్సుఖ్ మాండవీయ
దేశవ్యాప్తంగా నిర్వహించిన మాక్ డ్రిల్‌కు విశేష స్పందన. సౌకర్యాలను పరిశీలించిన మంత్రులు, సీనియర్ అధికారులు
Posted On:
10 APR 2023 5:35PM by PIB Hyderabad
కోవిడ్ -19 ను ఎదుర్కోవడానికి రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రిలో కల్పించిన మౌలిక సదుపాయాలు, సన్నద్ధతను కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ఈరోజు సమీక్షించారు. ఈ సందర్భంగా నిర్వహించిన మాక్ డ్రిల్‌ను డాక్టర్ మాండవీయ సమీక్షించారు.
రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రిలో నిర్వహించిన కార్యక్రమాలు, ఆస్పత్రిలో కల్పించిన సౌకర్యాలు, సిబ్బందితో జరిపిన చర్చల వివరాలను డాక్టర్ మాండవీయ ట్వీట్ చేశారు.
దేశంలో కోవిడ్-19 తాజా పరిస్థితిని రాష్ట్రాల ఆరోగ్య శాఖ మంత్రులతో డాక్టర్ మాండవీయ సమీక్షించారు. కోవిడ్-19 నివారణ, వ్యాప్తిని అరికట్టడానికి రాష్ట్రాలు ఏమేరకు సన్నద్ధంగా ఉన్నాయన్న అంశాన్ని డాక్టర్ మాండవీయ మంత్రులతో మాట్లాడారు. భవిష్యత్తులో కోవిడ్-19 వ్యాప్తి చెందితే పరిస్థితిని ఎదుర్కోవడానికి అమలు చేయాల్సిన చర్యలపై దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్‌లు నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు. దీనికి అనుగుణంగా ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు ఈరోజు మాక్ డ్రిల్‌లను నిర్వహించాయి. రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల ఆరోగ్య మంత్రులు నిర్వహించిన కార్యక్రమాలను సమీక్షించారు.
రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రిని సందర్శించిన డాక్టర్ మాండవీయ విభాగాధిపతులు సిబ్బందితో చర్చలు జరిపారు. డాక్టర్లు, నర్సులు, సెక్యూరిటీ, శానిటేషన్ సర్వీసెస్ అధిపతులతో కాసేపు గడిపి వారి ఫలవంతమైన సూచనలను విన్నారు. చికిత్స,, ఇన్‌ఫెక్షన్ నియంత్రణ కోసం చర్యలు, ఆసుపత్రి నిర్వహణ, పారిశుద్ధ్య ప్రక్రియలు, రోగి-కేంద్రీకృత నిబంధనలపై సిబ్బంది పలు సూచనలు అందించారు.
దేశవ్యాప్తంగా నిర్వహించిన మాక్ డ్రిల్‌కు విశేష స్పందన లభించింది. రాష్ట్రాల మంత్రులు, సీనియర్ అధికారులు ఆస్పత్రులు, సౌకర్యాల సన్నాహాలు మరియు సామర్థ్యాలను సమీక్షించారు.
కోవిడ్ 19ను ఎదుర్కోవడానికి కోసం రాష్ట్రాలు అప్రమత్తంగా , పూర్తి సన్నద్ధతతో ఉండాలని కేంద్ర ఆరోగ్య మంత్రి సూచించారు. ఎటువంటి లోపాలు, లోటుపాట్లు లేకుండా అప్రమత్తంగా ఉండాలని డాక్టర్ మాండవీయ సూచించారు. కోవిడ్ అనుకూల ప్రవటానను ప్రతి ఒక్కరూ అలవరచుకోవాలి మంత్రి సూచించారు. ILI/SARI కేసుల సరళిని పర్యవేక్షించడం ద్వారా వ్యాధి వ్యాప్తి చెందడానికి అంవకాశం ఉన్న హాట్‌స్పాట్‌లను గుర్తించాలని రాష్ట్రాలకు డాక్టర్ మాండవీయ ఆదేశాలు జారీచేశారు.కోవిడ్ -19, ఇన్‌ఫ్లుఎంజా నిర్దారణ కోసం పరీక్షల కోసం తగిన నమూనాలను పంపాలని డాక్టర్ మాండవీయ రాష్ట్రాలను కోరారు.పాజిటివ్ గా గుర్తించిన నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్‌ను ఎక్కువ చేయాలన్నారు.
కార్యక్రమంలో ఆర్‌ఎంఎల్ హాస్పిటల్ డైరెక్టర్, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ అజయ్ శుక్లా, శానిటేషన్‌తోపాటు వివిధ విభాగాల అధిపతులు పాల్గొన్నారు.
****
(Release ID: 1915485)
Visitor Counter : 137