హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

అరుణాచల్ ప్రదేశ్ లోని సరిహద్దు గ్రామమైన కిబితూలో 'వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్'ను ప్రారంభించిన కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సరిహద్దు గ్రామాల పట్ల ప్రజల దృక్పథాన్ని మార్చారు; ఇప్పుడు సరిహద్దు ప్రాంతాన్ని సందర్శించే ప్రజలకు ఇది చివరి గ్రామంగా కాకుండా భారతదేశంలోని మొదటి గ్రామంగా తెలుసు.

సరిహద్దు ప్రాంతాలకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నారు; సరిహద్దు భద్రత అంటే దేశ భద్రత; అందుకే ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం సరిహద్దు మౌలిక సదుపాయాలను పెంచేందుకు నిర్విరామంగా కృషి చేస్తోంది.

సరిహద్దు మౌలిక సదుపాయాల కోసం ప్రతిపక్ష ప్రభుత్వాలు తమ 12 టర్మ్ ల అధికారంలో చేయలేని పనిని శ్రీ మోదీ తన రెండు టర్మ్ ల అధికారం లోనే చేశారు

మన సైన్యం, ఐటీబీపీ సైనికుల ధైర్యసాహసాల వల్ల మన దేశ సరిహద్దులను ఎవరూ సవాలు చేసే పరిస్థితిలేదు; ఇప్పుడు భారత భూభాగాన్ని ఎవరైనా ఆక్రమించుకునే కాలం పోయింది; నేడు మన ఒక్క అంగుళం భూమిని కూడా ఎవరూ ఆక్రమించలేరు

వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్ మూడు దశలలో అమలు జరుగుతుంది; ఉత్తర సరిహద్దులోని అన్ని గ్రామాల నుండి వలసలను ఆపడం, పర్యాటకాన్ని ప్రోత్సహించడం నగరాల మాదిరి వంటి అన్ని సౌకర్యాలను కల్పించడం ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర

Posted On: 10 APR 2023 7:50PM by PIB Hyderabad

కేంద్ర హోం,సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా ఈ రోజు అరుణాచల్ ప్రదేశ్ లోని సరిహద్దు గ్రామమైన కిబితూలో 'వైబ్రంట్ విలేజ్ ప్రోగ్రాం'ను ప్రారంభించారు. అరుణాచల్ ప్రభుత్వానికి చెందిన 9 మైక్రో హైడల్ ప్రాజెక్టులను, రూ.120 కోట్ల విలువైన 14 ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ)  మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను అమిత్ షా ప్రారంభించారు. అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ పెమా ఖండూ, కేంద్ర హోం కార్యదర్శి, ఐటిబిపి డైరెక్టర్ జనరల్ తో సహా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001EHYI.jpg

 

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సరిహద్దు గ్రామాల పట్ల ప్రజల దృక్పథాన్ని మార్చారని, ఇప్పుడు సరిహద్దు ప్రాంతాన్ని సందర్శించే ప్రజలు దీనిని చివరి గ్రామంగా కాకుండా భారతదేశంలోని మొదటి గ్రామంగా తెలుసుకున్నారని శ్రీ అమిత్ షా తన ప్రసంగంలో అన్నారు.

సరిహద్దు ప్రాంతాలకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రత్యేక ప్రాధాన్యం

ఇస్తున్నారని, సరిహద్దు భద్రత అంటే దేశ భద్రత అని, అందుకే ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం సరిహద్దు మౌలిక సదుపాయాలను పెంచేందుకు నిర్విరామంగా కృషి

చేస్తోందని అన్నారు.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002TF9F.jpg

 

1962 యుద్ధంలో అప్పటి కుమాన్ రెజిమెంట్ అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శించిందని శ్రీ అమిత్ షా అన్నారు.

ఐటీబీపీ, ఆర్మీ జవాన్ల ధైర్యసాహసాలు, త్యాగాల వల్లే నేడు దేశం మొత్తం ప్రశాంతంగా నిద్రపోతోందని, వారి కారణంగానే మన సరిహద్దుల వైపు ఎవరూ కన్నెత్తి కూడా చూడలేరని అన్నారు. కుటుంబాలకు దూరంగా ఉంటూ 13 వేల అడుగుల ఎత్తులో దేశానికి సేవలందిస్తున్న జవాన్ల త్యాగం, ధైర్యసాహసాలు, ఉత్సాహం, దేశభక్తి ప్రశంసనీయమని అన్నారు.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003WR4E.jpg

 

అరుణాచల్ వాసులందరూ జైహింద్ అంటూ ఒకరినొకరు పలకరించుకుంటున్నారని, ఈ సెంటిమెంట్ అరుణాచల్ ను భారత్ లో ఉంచిందని శ్రీ అమిత్ షా అన్నారు. పదేళ్ల క్రితం సరిహద్దు గ్రామాల నుంచి వలసలు జరిగాయని, కానీ ప్రధాని నరేంద్ర మోదీ ఈ గ్రామాలకు అభివృద్ధి తీసుకువచ్చారన్నారు.

 

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్ర భుత్వం చేపట్టిన  వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ లో భాగంగా అరుణాచ ల్ ప్రదేశ్ , సిక్కిం, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్ర దేశ్ , కేంద్ర పాలిత ప్రాంతమైన లడాక్ లోని ఉత్తర సరిహద్దు పొడవునా ఉన్న 19 జిల్లాల్లోని 46 బ్లాక్ లలో సమగ్ర అభివృద్ధి కోసం 2967 గ్రామాలను గుర్తించినట్టు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమం మొదటి దశలో 46 బ్లాకుల్లోని 662 గ్రామాల్లో సుమారు 1.42 లక్షల జనాభాను కవర్ చేయనున్నారు. ఈ పథకం కింద 2022 నుంచి 2026 వరకు రూ.4800 కోట్లు ఖర్చు చేస్తామని, మొదటి దశలో 11 జిల్లాలు, 28 బ్లాకులు, 1451 గ్రామాలను చేర్చామన్నారు. ఈ కార్యక్రమం కింద గ్రామాల అభివృద్ధి పనులు 3 స్థాయిల్లో జరుగుతాయన్నారు. వైబ్రెంట్ విలేజ్ కింద గ్రామాల్లో నివసిస్తున్న ప్రతి ఒక్కరి సౌకర్యాలను భారత ప్రభుత్వం చూసుకుంటుందని, వివిధ పథకాల ప్రయోజనాలను ప్రజలకు చేరవేస్తుందని తెలిపారు. కనీస సౌకర్యాలు లేని సరిహద్దు గ్రామాల్లో ఒక్క ఇల్లు కూడా ఉండదన్నారు. ఆర్థిక సమ్మిళితాన్ని ప్రోత్సహించే పని చేస్తామని, ఆర్థిక అవకాశాలను కూడా కల్పిస్తామని శ్రీ షా తెలిపారు. పర్యాటకం, స్థానిక సంస్కృతి, భాషను పరిరక్షిస్తూ ఈ గ్రామాలను అభివృద్ధి చేస్తామన్నారు. సరిహద్దు గ్రామాల నుంచి వలసలను అడ్డుకోవడం ఈ కార్యక్రమం రెండో లక్ష్యమని, ఇందుకోసం అక్కడే ఉపాధి ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. వలసల ప్రభావిత గ్రామాల్లో సాధారణ పరిస్థితులు తీసుకురావడానికి 5 సంవత్సరాల లక్ష్యాన్ని నిర్దేశించినట్లు ఆయన తెలిపారు. సరిహద్దు గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించడం ఈ కార్యక్రమం మూడో లక్ష్యమని శ్రీ షా తెలిపారు. మూడు దశల్లో అమలు జరిగే వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ ద్వారా, మొత్తం ఉత్తర సరిహద్దులోని అన్ని గ్రామాల నుండి వలసలను నిరోధించడం, పర్యాటకాన్ని ప్రోత్సహించడం , నగరాలకు సమానంగా అన్ని సౌకర్యాలను కల్పించడం ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ  నేతృత్వంలోని ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004GTS9.jpg

 

వైబ్రంట్ విలేజ్ ప్రోగ్రామ్ ను మిషన్ మోడ్ లో నిర్వహించేందుకు కార్యాచరణ సిద్ధం చేసినట్లు కేంద్ర హోం , సహకార శాఖ మంత్రి తెలిపారు. కేంద్ర, రాష్ట్ర, జిల్లా, బ్లాక్ స్థాయిల్లో పరిపాలనలో పంచాయతీ, గ్రామసభల భాగస్వామ్యం, బాధ్యత ఉండేలా చూస్తామని, 100 శాతం అమలుకు అన్ని పథకాలను సమగ్రంగా, సమన్వయంతో రూపొందించామని తెలిపారు. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో, అరుణాచల్ ప్ర దేశ్ ముఖ్య మంత్రి శ్రీ పెమా ఖండూ కు అలాంటి గ్రామాన్ని తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉందని, తద్వారా 'వైబ్రెంట్ విలేజెస్ 'లో నివసిస్తున్న ప్రజలందరూ ఈ గ్రామాల్లో నివసిస్తున్నందుకు

గర్వపడతారని, వారు అన్ని సౌకర్యాలు పొందుతారని ఆయన అన్నారు.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image005EBA0.jpg

 

సుమారు రూ.30 కోట్ల వ్యయంతో 725 కిలోవాట్ల సామర్థ్యంతో తొమ్మిది  మైక్రో హైడల్ ప్రాజెక్టులను ఈ రోజు ఇక్కడ ప్రారంభించామని, ఈ ప్రాజెక్టులు దాదాపు పూర్తయ్యాయని శ్రీ అమిత్ షా చెప్పారు. క్లిష్టమైన భౌగోళిక ప్రదేశం అయిన   అరుణాచల్ వంటి రాష్ట్రంలోని గ్రామాలకు ఈ పథకాలు విద్యుత్ సరఫరాను నిర్ధారిస్తాయని ఆయన అన్నారు. దీనితో పాటు, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం సరిహద్దులో మోహరించిన మన 'హిమ్వీర్' భారత ఆర్మీ జవాన్లకు అన్ని సౌకర్యాలు కల్పించడానికి కట్టుబడీందని చెప్పారు. ఈ రోజు రూ.120 కోట్ల వ్యయంతో ఐటీబీపీకి చెందిన 14 మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను కూడా ప్రారంభించినట్లు శ్రీ షా తెలిపారు. చిన్న రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్ లో 6,600 స్వయం సహాయక బృందాలు (ఎస్ హెచ్ జిలు) ఏర్పడ్డాయని, ఈ స్వయం సహాయక సంఘాల ద్వారా 53,000 మందికి పైగా మహిళలు ఉపాధి పొందుతున్నారని, ఇది మహిళా సాధికారతకు అద్భుతమైన ఉదాహరణ అని ఆయన అన్నారు.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0062RTH.jpg

 

2014కు ముందు మొత్తం ఈశాన్య ప్రాంతం అనేక సమస్యలతో నిండిన ప్రాంతంగా ఉండేదని, కానీ గత తొమ్మిదేళ్లలో ప్రధాని నరేంద్ర మోదీ ‘లుక్ ఈస్ట్ ‘విధానం కారణంగా నేడు ఈశాన్య ప్రాంతం దేశాభివృద్ధికి దోహదపడే ప్రాంతంగా గుర్తింపు పొందిందని కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి తెలిపారు.

ఒకప్పుడు ఢిల్లీలో కూర్చున్న నేతల తప్పుడు వైఖరి కారణంగా ఈ ప్రాంతం వివాదాస్పదంగా, అల్లకల్లోలంగా ఉండేదని, శాంతి, అభివృద్ధి, కనెక్టివిటీ కొరవడిందని ఆయన అన్నారు. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో వివాదాలు, తిరుగుబాటులు అంతమవుతున్నాయని, అభివృద్ధి, శాంతి తో కూడిన కొత్త శకం ప్రారంభమైందని శ్రీ షా అన్నారు. ఈశాన్యంలో అద్భుతమైన సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడం, వివాదాలను పరిష్కరించడం ద్వారా శాంతిని నెలకొల్పడం, తిరుగుబాటు గ్రూపులతో అనేక ఒప్పందాలు కుదుర్చుకోవడం వల్ల 2014తో పోలిస్తే 2022లో హింస 67 శాతం తగ్గిందని, భద్రతా దళాల మరణాలు 60 శాతం తగ్గాయని, పౌర మరణాలు 83 శాతం తగ్గాయని ఆయన అన్నారు. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం బి ఆర్ యు, ఎన్ ఎల్ ఎఫ్ టీ, బోడో, కర్బీ-అంగ్లాంగ్ ఒప్పందాల పై సంతకం చేసి అంతరాష్ట్ర సరిహద్దు వివాదాలను పరిష్కరించిందని శ్రీ షా తెలిపారు. ఈశాన్య రాష్ట్రాల్లో 70 శాతం నుంచి ఎ ఎఫ్ ఎస్ పి ఎ ను ప్రభుత్వం తొలగించిందని, మొత్తం ఈశాన్య రాష్ట్రాల నుంచి దాన్ని తొలగించే రోజు ఎంతో దూరంలో లేదని ఆయన అన్నారు.  ఆయుధాలతో తిరిగే యువత ఇప్పుడు ప్రధాన స్రవంతిలో చేరి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశ అభివృద్ధికి దోహద పడుతున్నారని ఆయన అన్నారు.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0079ANC.jpg

 

భారతదేశం అందరితో శాంతిని కోరుకుంటోందని,  మన దేశంలోని ఒక్క అంగుళం భూమిని కూడా ఎవరూ ఆక్రమించలేరని, మన సైన్యం , సరిహద్దుల విషయంలో రాజీ పడకూడదనేది ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వ విధానమని శ్రీ అమిత్ షా స్పష్టం చేశారు. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలోని

ప్రభుత్వం సరిహద్దుల భద్రత ను దేశ భద్రతగా భావిస్తుంద ని, అందుచేత సరిహద్దులో మౌలిక స దుపాయాల అభివృద్ధికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారని శ్రీ అమిత్ షా అన్నారు. 2014 నుంచి 2023 వరకు 547 కిలోమీటర్ల సరిహద్దు ఫెన్సింగ్ పూర్తయిందని, 1100 కిలోమీటర్లకు పైగా సరిహద్దు రహదారులు నిర్మించామని, 1057 కిలోమీటర్ల ఫ్లడ్ లైటింగ్ చేశామని, 468 బోర్డర్ అబ్జర్వేషన్ పోస్టులు (బీఓపీ) ఏర్పాటు చేశామని తెలిపారు. 12 సార్లు అధికారం లో ఉన్న ప్రతిపక్ష పార్టీ చేయలేని సరిహద్దు మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ కేవలం రెండు పర్యాయాల అధికార సమయం లోనే చేశారని, ఇది సరిహద్దు భద్రత పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వ ప్రాధాన్యతను తెలియజేస్తుందని ఆయన అన్నారు. ఇందుకోసం ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెట్టింది.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image008PEVY.jpg

 

అరుణాచల్ ప్రదేశ్ అభివృద్ధి కోసం అంతర్జాతీయ సరిహద్దుకు 5 కిలోమీటర్ల పరిధిలో ఉన్న అన్ని గ్రామాలను ఆల్ వెదర్ రోడ్స్ తో అనుసంధానించామని, 1859 కిలోమీటర్ల పొడవైన అరుణాచల్ ఫ్రాంటియర్ హైవే నిర్మాణం ప్రారంభమైందని, గత కొన్నేళ్లలో సరిహద్దు ప్రాంతాల్లో 2500 కిలోమీటర్ల రహదారులను నిర్మించడం ద్వారా 252 ఆవాసాలను అనుసంధానించామని కేంద్ర హోం మంత్రి తెలిపారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం అరుణాచల్ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం రూ.44,000 కోట్లు ఇచ్చిందన్నారు. డిజిటల్ కనెక్టివిటీ రంగంలో కూడా 684 గ్రామాలకు 4జీ కనెక్టివిటీ వచ్చిందని, 1327 సరిహద్దు గ్రామాలకు విద్యుదీకరణ చేశామని తెలిపారు. ప్రధాన మంత్రి

శ్రీ నరేంద్ర మోదీకి, ఆయన నాయకత్వం లోని ప్రభుత్వానికి  అతి పెద్ద

ప్రాధాన్యతా అంశం  సరిహద్దు ప్రాంతాలే అని శ్రీ షా అన్నారు. ప్రధాన మంత్రి

శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో

ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రేమానుబంధాల విధానం దూరాలను తగ్మచిందని శ్రీ అమిత్ షా అన్నారు.

 

***


(Release ID: 1915481) Visitor Counter : 233