రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

అన్ని వాతావరణ పరిస్థితుల్లో లడఖ్‌కు రవాణా సౌకర్యం కల్పించేలా ఆసియాలో నిర్మిస్తున్న అతి పొడవైన సొరంగం జోజిలా టన్నెల్‌ నిర్మాణ ప్రగతిని జమ్మూ, కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ మనోజ్ సిన్హా తో కలిసి పరిశీలించిన శ్రీ నితిన్ గడ్కరీ

Posted On: 10 APR 2023 1:15PM by PIB Hyderabad

జోజిలా టన్నెల్‌ నిర్మాణ ప్రగతిని జమ్మూ, కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ మనోజ్ సిన్హా తో కలిసి ఈ రోజు కేంద్ర  రవాణా, రహదారుల శాఖ మంత్రి  శ్రీ నితిన్ గడ్కరీ పరిశీలించారు. అన్ని వాతావరణ పరిస్థితుల్లో లడఖ్‌కు రవాణా సౌకర్యం కల్పించడానికి వీలుగా జోజిలా టన్నెల్‌ నిర్మాణాన్ని చేపట్టారు. రవాణా, రహదారులపై ఏర్పాటైన పార్లమెంట్ సంప్రదింపుల కమిటీ సభ్యులు జోజిలా టన్నెల్‌ ను పరిశీలించారు. 

జమ్మూ కాశ్మీర్‌లో 25000 కోట్ల రూపాయల ఖర్చుతో 19 సొరంగాలు నిర్మిస్తున్నారు. ఇందులో భాగంగా 6800 కోట్ల రూపాయల ఖర్చుతో  జోజిలా సారంగం నిర్మాణాన్ని చేపట్టారు.  13.14 కిలోమీటర్ల పొడవున టన్నెల్, అప్రోచ్ రోడ్డు నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఇది 7.57 మీటర్ల ఎత్తున  గుర్రపు నాడా  ఆకారంలో సింగిల్-ట్యూబ్, 2-లైన్ల రహదారి గా జోజిలా సారంగం నిర్మాణాన్ని చేపట్టారు.   ఇది కాశ్మీర్‌లోని గందర్‌బాల్, లడఖ్‌లోని కార్గిల్ జిల్లాలోని ద్రాస్ పట్టణం మధ్య హిమాలయాలలోని జోజిలా పాస్ మీదుగా వెళ్తుంది. ప్రాజెక్టులో భాగంగా  ప్రాజెక్ట్ స్మార్ట్ టన్నెల్ (SCADA) వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. ఆస్ట్రియన్ సాంకేతిక పరిజ్ఞానం  దీనిని నిర్మించారు. ఇందులో సీసీటీవీ, రేడియో నియంత్రణ, నిరంతర విద్యుత్ సరఫరా, వెంటిలేషన్ వంటి సదుపాయాలు ఉంటాయి.  ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం వల్ల ప్రభుత్వానికి 5000 కోట్ల రూపాయలకు పైగా నిర్మాణ వ్యయం ఆదా అయింది.

 13,153 మీటర్ల జోజిలా టన్నెల్ ప్రాజెక్టు నిర్మాణాన్ని దశలవారీగా చేపడతారు. 4,821 మీటర్ల  ప్రధాన జోజిలా సొరంగ మార్గం  మొత్తం 810 మీటర్ల పొడవునా   4 కల్వర్టులు, 4 నీల్‌గ్రార్ సొరంగాలతో ఉంటుంది. 2,350 మీటర్లు 8 కట్ , కవర్ తో,మూడు 500 మీటర్లు, 391 మీటర్లు. 220 మీటర్ల నిలువు వెంటిలేషన్ షాఫ్ట్ తో ప్రతిపాదించారు.  ఇప్పటి వరకు జోజిలా సొరంగ మార్గం పనులు 28% వరకు పూర్తయ్యాయి.

జోజిలా సొరంగ మార్గం నిర్మాణం పూర్తయితే లడఖ్ ప్రాంతానికి అన్ని వాతావరణ పరిస్థితుల్లో రవాణా సౌకర్యం కలుగుతుంది. ప్రస్తుతం జోజిలా పాస్ దాటడానికి దాదాపు మూడు గంటల సమయం పడుతోంది. జోజిలా సొరంగ మార్గం పూర్తైన తర్వాత ప్రయాణ సమయం 20 నిమిషాలకు తగ్గుతుంది. ప్రయాణ సమయం తగ్గడంతో ఇంధన వినియోగం భారీగా తగ్గుతుంది. 

 

జోజిలా పాస్ అత్యంత ప్రమాదకరమైన ప్రాంతం. ప్రతి ఏడాది ఇక్కడ పెద్ద పెద్ద ప్రమాదాలు జరుగుతున్నాయి. జోజిలా సొరంగ మార్గం పూర్తైన తర్వాత ప్రమాదాలు జరిగే అవకాశం ఉండదు. కాశ్మీర్ లోయ, లడఖ్ ప్రాంతానికి ఏడాది పొడువునా రవాణా సౌకర్యం అందుబాటులోకి వస్తుంది. దీనివల్ల లడఖ్ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. పర్యాటకుల సంఖ్య పెరిగి పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుంది. వస్తువుల రవాణా సులభంగా జరుగుతుంది. అవసరమైన సమయాల్లో సాయుధ దళాలు వేగంగా చేరడానికి అవకాశం కలుగుతుంది. 

 

***

 


(Release ID: 1915387) Visitor Counter : 222