హోం మంత్రిత్వ శాఖ

ఏప్రిల్ 10న అరుణాచల్ ప్రదేశ్‌లోని సరిహద్దు గ్రామం కిబిథూలో ‘వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్’ను ప్రారంభించనున్న కేంద్ర హోం శాఖ మరియు సహకార శాఖల మంత్రి శ్రీ అమిత్ షా


- ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో 2022-23 నుండి 2025-26 ఆర్థిక సంవత్సరాల కాలంలో రూ.4800 కోట్లతో కార్యక్రమం అమలు

- ‘వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్’లో భాగంగా రూ.2500 కోట్లతో రహదారుల అనుసంధానత

- ఈ కార్యక్రమం కింద గుర్తించబడిన సరిహద్దు గ్రామాలలో నివసించే ప్రజల జీవన నాణ్యతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది మరియు ప్రజలను వారి స్వస్థలాలలో ఉండేలా ప్రోత్సహిస్తుంది, తద్వారా ఈ గ్రామాల నుండి వలసలను తిప్పికొట్టడం మరియు సరిహద్దు భద్రతను అందిస్తుంది

- అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఉత్తరాఖండ్ & హిమాచల్ ప్రదేశ్ మరియు లద్దాఖ్ యూటీలలో ఉత్తర సరిహద్దులో ఉన్న 19 జిల్లాల్లోని 46 బ్లాక్‌లలోని 2967 గ్రామాలు ‘వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్’ కింద సమగ్ర అభివృద్ధి కోసం గుర్తించబడ్డాయి

- "గోల్డెన్ జూబ్లీ బోర్డర్ ఇల్యూమినేషన్ ప్రోగ్రామ్" కింద నిర్మించిన అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం యొక్క తొమ్మిది మైక్రో హైడల్ ప్రాజెక్ట్‌లను ప్రారంభించనున్న శ్రీ అమిత్ షా

- గ్రామాలలో మౌలిక సదుపాయాలను పెంపొందించడానికి మరియు ఐటీబీపీ సిబ్బందితో ఇంటరాక్ట్ చేయడాన

Posted On: 08 APR 2023 12:31PM by PIB Hyderabad

కేంద్ర హోం మంత్రి మరియు సహకార మంత్రి శ్రీ అమిత్ షా ఈ నెల (ఏప్రిల్) 10-11, 2023 తేదీలలో అరుణాచల్ ప్రదేశ్‌లో  పర్యటించనున్నారు. తన పర్యటన భాగంగా మంత్రి మొదటి రోజు ఏప్రిల్ 10, 2023న అరుణాచల్ ప్రదేశ్‌లోని అంజావ్ జిల్లాలోని సరిహద్దు గ్రామమైన కిబితూలో 'వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్'ను ప్రారంభించనున్నారు. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో 2022-23 నుండి 2025-26 ఆర్థిక సంవత్సరాల కాలంలో రూ.4800 కోట్లతో కార్యక్రమాన్ని  అమలు చేయనున్నారు.  వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్’లో (వీవీపీలో) భాగంగా రూ.2500 కోట్ల వ్యయంతో రహదారుల అనుసంధానత చేపట్టనున్నారు. వీవీపీ అనేది కేంద్ర ప్రాయోజిత పథకం. ఈ పథకం కింద అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఉత్తరాఖండ్ & హిమాచల్ ప్రదేశ్, లద్దాఖ్ కేంద్ర పాలిత ప్రాంతాలలోని ఉత్తర సరిహద్దుకు ఆనుకుని ఉన్న 19 జిల్లాల్లోని 46 బ్లాక్‌లలోని 2967 గ్రామాలు సమగ్ర అభివృద్ధి కోసం గుర్తించబడ్డాయి. మొదటి దశలో భాగంగా ప్రాధాన్యత కోసం 662 గ్రామాలను గుర్తించారు.  ఇందులో అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన 455 గ్రామాలు ఉన్నాయి. గుర్తించబడిన సరిహద్దు గ్రామాలలో నివసించే ప్రజల జీవన నాణ్యతను మెరుగుపరచడంలో వైబ్రంట్ విలేజెస్ ప్రోగ్రామ్ సహాయం చేస్తుంది. ప్రజలను వారి స్వస్థలాలలో ఉండేలా ఇది ప్రోత్సహిస్తుంది. తద్వారా ఈ గ్రామాల నుండి వలసలను తిప్పికొట్టడం, సరిహద్దు భద్రతను జోడించేందుకు వీలు కల్పిస్తుంది. జిల్లా పరిపాలన బ్లాక్ మరియు పంచాయతీ స్థాయిలో తగిన యంత్రాంగాల సహాయంతో కేంద్ర మరియు రాష్ట్ర పథకాలను 100% సంతృప్తికరంగా అమలయ్యేలా గుర్తించిన గ్రామం కోసం కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేస్తుంది. ఈ పథకంలో భాగంగా రోడ్డు కనెక్టివిటీ, తాగునీరు, సౌర మరియు పవన శక్తితో సహా విద్యుత్ సదుపాయం, మొబైల్ మరియు ఇంటర్నెట్ కనెక్టివిటీ, పర్యాటక కేంద్రాలు, బహుళ ప్రయోజన కేంద్రాలు మరియు ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలు మరియు సంరక్షణ కేంద్రాలు వంటివి అభివృద్ధి చేయనున్నారు.

శ్రీ అమిత్ షా ఏప్రిల్ 10, 2023న కిబిథూలో “గోల్డెన్ జూబ్లీ బోర్డర్ ఇల్యూమినేషన్ ప్రోగ్రామ్” కింద నిర్మించిన అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం యొక్క తొమ్మిది మైక్రో హైడల్ ప్రాజెక్ట్‌లను ప్రారంభించనున్నారు. ఈ విద్యుత్ ప్రాజెక్టులు సరిహద్దు గ్రామాల్లో నివసించే ప్రజలను శక్తివంతం చేస్తాయి.  లికాబలి (అరుణాచల్ ప్రదేశ్), చప్రా (బీహార్), నూరనాడ్ (కేరళ) మరియు విశాఖపట్నం (ఆంధ్రప్రదేశ్)లలో మౌలిక సదుపాయాలను పెంపొందించడానికి సంబంధించిన ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) ప్రాజెక్టులను కూడా ఆయన ప్రారంభిస్తారు. కేంద్ర హోంమంత్రి కిబిథూ వద్ద ఐటీబీపీ సిబ్బందితో కూడా సంభాషించనున్నారు. సరిహద్దు జిల్లాల్లోని స్వయం సహాయక సంఘాల మహిళా సభ్యులు తయారు చేసిన ఉత్పత్తుల ప్రదర్శనను కూడా  మంత్రి పర్యటన సందర్భంగా ఏర్పాటు చేయనున్నారు. శ్రీ అమిత్ షా ఎగ్జిబిషన్ స్టాల్స్‌ను సందర్శించి సరిహద్దు గ్రామాల మహిళల కృషిని తెలుసుకుని వారిని అభినందిస్తారు. ఏప్రిల్ 11, 2023న, కేంద్ర హోం మంత్రి మరియు సహకార మంత్రి నమ్తి క్షేత్రాన్ని సందర్శించి, వాలాంగ్ యుద్ధ స్మారక చిహ్నం వద్ద నివాళులర్పిస్తారు.

*****



(Release ID: 1914900) Visitor Counter : 240