ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

జనౌషధి ద్వారా పేదలకు ఖరీదైన మందులు చౌకగా లభించడం ఎంతో సంతృప్తినిస్తోంది : ప్ర‌ధానమంత్రి

प्रविष्टि तिथि: 08 APR 2023 10:39AM by PIB Hyderabad

నౌషధి కింద దేశంలోని పేదలకు ఖరీదైన మందులు చౌకగా లభిస్తుండటం ఎంతో సంతృప్తినిస్తోందని ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అన్నారు.

నిరుపేదలు ఖరీదైన మందులను అందుబాటు ధరతో పొందడంలో ప్రధానమంత్రి జనౌషధి పరియోజన ఎలా తోడ్పడుతున్నదీ పేర్కొంటూ కేంద్ర సహాయ మంత్రి శ్రీ సోమ్‌ ప్రకాష్‌ పోస్టు చేసిన ట్వీట్‌పై స్పందిస్తూ ప్రధానమంత్రి పంపిన సందేశంలో:

“"ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పరియోజన విజయాన్ని ప్రస్ఫుటం చేసే ఇలాంటి ఉత్తేజకర ఉదాహరణలు అనేకం ఉన్నాయి. ఇవాళ దేశంలోగల నిరుపేదలు కూడా ఖరీదైన మందులను చౌకధరకు పొందగలగడం నాకు ఎనలేని సంతృప్తినిస్తోంది” అని పేర్కొన్నారు.

 

 

***

DS
 


(रिलीज़ आईडी: 1914889) आगंतुक पटल : 239
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Assamese , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam