ఆయుష్
azadi ka amrit mahotsav

దిబ్రూఘర్‌లో జరిగిన యోగా మహోత్సవ్‌లో పాల్గొన్న వేలాది మంది ప్రజలు


దిబ్రూగఢ్‌లో 100 పడకల యోగా, నేచురోపతి ఆసుపత్రి నిర్మిస్తామని ప్రకటించిన కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్

Posted On: 07 APR 2023 12:19PM by PIB Hyderabad

అంతర్జాతీయ యోగా దినోత్సవం 2023 నిర్వహణకు సన్నాహక కార్యక్రమంగా దిబ్రూఘర్‌లో నిర్వహించిన   యోగా మహోత్సవ్‌ విజయవంతంగా జరిగింది. కార్యక్రమంలో  వేలాది మంది పాల్గొని యోగాసనాలు వేశారు. దిబ్రూఘర్‌ విశ్వవిద్యాలయంలో సామూహిక యోగా కార్యక్రమం జరిగింది. 

 

కార్యక్రమంలో  కేంద్ర ఆయుష్, ఓడ రేవులు, నౌక రవాణా, జలమార్గాల శాఖ మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్, త్రిపుర ముఖ్యమంత్రి ప్రొఫెసర్ (డా) మాణిక్ సాహా, అరుణాచల్ ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి చౌనా మెయిన్, దిబ్రూఘర్‌ పార్లమెంట్ సభ్యుడు, కేంద్ర  పెట్రోలియం, సహజ వాయువు శాఖ సహాయ మంత్రి శ్రీ రామేశ్వర్ తెలీ,కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి రాజ్‌కుమార్ రంజన్ సింగ్, అస్సాం ఆరోగ్య  కుటుంబ సంక్షేమ మంత్రి కేశబ్ మహంత, మాజీ మంత్రి  హౌసెఫెడ్  చైర్మన్ శ్రీ  భబేష్ కలిత, మణిపూర్ ఆరోగ్య  కుటుంబ సంక్షేమ మంత్రి డాక్టర్ సనమ్ రంజన్ సింగ్, దిబ్రూఘర్‌ విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ జితేన్ హజారికా, ఆయుష్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ వైద్య రాజేష్ కోటచా పాల్గొన్నారు. 

సహజ అందాలకు నిలయమైన దిబ్రూఘర్‌లో యోగా మహోత్సవం నిర్వహించడం పట్ల శ్రీ  సర్బానంద సోనోవాల్ హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ప్రచారం కల్పించి ఆరోగ్యం సంరక్షణ కోసం అన్ని దేశాల ప్రజలు యోగా ఆచరించేలా చూడాలన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆశయాలకు అనుగుణంగా నిర్వహించిన కార్యక్రమంలో వేలాది మంది పాల్గొని విజయవంతం చేశారు అని  మంత్రి అన్నారు. 

ప్రపంచ ఆరోగ్య దినోత్సవం రోజున యోగా మహోత్సవం నిర్వహించామని శ్రీ సర్బానంద సోనోవాల్ అన్నారు. దిబ్రూగఢ్‌లో 100 పడకల యోగా, నేచురోపతి ఆసుపత్రి నిర్మిస్తామని  కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ ప్రకటించారు. ఆస్పత్రి నిర్మాణంతో ప్రాంతంలో మెరుగైన  ఆరోగ్య సంరక్షణ చర్యలు ప్రజలకు అందుబాటులోకి వస్తాయని మంత్రి అన్నారు. ఈశాన్య భారతదేశంలో తొలిసారిగా చేపట్టిన నిర్మాణ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన అస్సాం ముఖ్యమంత్రి శ్రీ హిమంత బిస్వ శర్మకు మంత్రి  కృతజ్ఞతలు తెలిపారు.  ఈ కేంద్రం అస్సాం ప్రజలకు యోగా, నేచురోపతి ఔట్ పేషెంట్,  ఇన్‌పేషెంట్ చికిత్సలను అందించడం ద్వారా ప్రాంత ఆరోగ్య అవసరాలను తీరుస్తుందన్నారు. 

యోగా అభ్యాసకులకు అవసరమైన సౌకర్యాలు  అభివృద్ధి చేయడానికి మొరార్జీ  దేశాయ్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యోగా (MDNIY), దిబ్రూఘర్ విశ్వవిద్యాలయం మధ్య ఒక అవగాహన ఒప్పందం కూడా కుదిరింది.  యోగాను ప్రతి ఒక్కరి ఆరోగ్యకరమైన జీవనశైలి లో భాగం చేయడానికి జరుగుతున్న ప్రయత్నాలలో భాగంగా రెండు సంస్థలు అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. 

అరుణాచల్ ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి చౌనా మెయిన్ మాట్లాడుతూ  యోగాని  భారతదేశం   గొప్ప వారసత్వ సంపదగా వర్ణించారు. యోగా చేయడం ద్వారా ప్రజల ఆరోగ్యం మెరుగు పడుతుందని అన్నారు. యోగా ఆరోగ్యకర భవిష్యత్తు అందిస్తుందన్నారు. ప్రపంచానికి భారతదేశం అందించిన విలువైన బహుమతి యోగ అని ఆయన అన్నారు. 

 

అస్సాం పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి శ్రీ బిమల్ బోరహ, అరుణాచల్ ప్రదేశ్ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ లో లిబాంగ్, మేఘాలయ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మాజీలు అంపరీన్  లిఙ్గం దోహా, సిక్కిం పట్టణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ ఎల్.బి.దాస్, అస్సాం కార్మిక సంక్షేమ శాఖ మంత్రి శ్రీ సంజయ్ కిషన్, దిబ్రూఘర్‌ శాసనసభ్యుడు ప్రశాంత్ ఫుకాన్,   ఎంపీ హోరెన్ సింగ్ బే, శాసనసభ్యులు తేరోస్ గోవాలా, బినోద్ హజారికా, చక్ర గొగోయ్ సహా పలువురు ప్రముఖులు యోగా మహోత్సవ్‌కు హాజరయ్యారు.

వేలాది మంది భారతీయ విద్యార్థులు, టాంజానియా, ఉగాండా, కెన్యా, టోగో, నేపాల్, నైజీరియా, లెసోతో, బోట్స్వానా, ఈజిప్ట్, నమీబియా, కొరియా దేశాలకు చెందిన అంతర్జాతీయ విద్యార్థులు, యోగా ప్రియులు యోగా మహోత్సవ్‌లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో,మొరార్జీ  దేశాయ్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యోగా    డైరెక్టర్ డాక్టర్ ఈశ్వర్ వి. బసవరెడ్డి యోగా ప్రదర్శనలపై  మార్గనిర్దేశం చేశారు.

***

 


(Release ID: 1914642) Visitor Counter : 181