పర్యటక మంత్రిత్వ శాఖ

జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రచార కార్యక్రమాలు నిర్వహించి ఏడు ముక్తి ( సప్త మోక్షపురి) కేంద్రాలను పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేయడానికి పర్యాటక మంత్రిత్వ శాఖ చర్యలు

Posted On: 07 APR 2023 9:10AM by PIB Hyderabad

ముక్తి ప్రాంతాలుగా  (సప్త మోక్షపురి) గుర్తింపు పొందిన  అయోధ్య, మధుర, మాయ (హరిద్వార్), కాశీ (వారణాసి), కంచి అవంతిక (ఉజ్జయిని), పూరి (ఒడిశా) మరియు ద్వారవతి (ద్వారక, గుజరాత్)లను సమగ్ర  పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయడానికి పర్యాటక మంత్రిత్వ శాఖ కార్యక్రమాలు చేపట్టింది. దీనికోసం పర్యాటక మంత్రిత్వ శాఖ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎలక్ట్రానిక్, ప్రింట్ , డిజిటల్ మీడియా ద్వారా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోంది. దేశంలో పర్యాటక ప్రాంతాలకు, లభిస్తున్న ఉత్పత్తులకు తగిన ప్రచారం లభించేలా చూడాలన్న లక్ష్యంతో కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయి. మంత్రిత్వ శాఖ అధికార వెబ్ సైట్ సామాజిక మాధ్యమాల ద్వారా కూడా మంత్రిత్వ శాఖ  కార్యక్రమాలు చేపట్టింది. 

రాష్ట్ర ప్రభుత్వాలు/కేంద్రపాలిత ప్రాంతాలతో సంప్రదించి గుర్తించిన  తీర్థయాత్ర , వారసత్వ ప్రాంతాలను సమగ్రంగా అభివృద్ధి చేయడానికి పర్యాటక మంత్రిత్వ శాఖ   'తీర్థయాత్ర పునరుజ్జీవనం మరియు ఆధ్యాత్మిక, వారసత్వ సంపద అభివృద్ధి పథకం (ప్రశాద్) కింద ఆర్థిక సహాయం అందిస్తుంది. 

పర్యాటక మౌలిక సదుపాయాల అభివృద్ధికి స్వదేశ్ దర్శన్ కింద పర్యాటక మంత్రిత్వ శాఖ ఆర్థిక సహాయం కూడా అందిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం/కేంద్రపాలిత ప్రాంతం అభివృద్ధి చేయాల్సిన ప్రాంతాలను గుర్తిస్తాయి. నిధుల లభ్యత, తగిన వివరణాత్మక ప్రాజెక్టు నివేదిక సమర్పణ, పథకం  మార్గదర్శకాలకు కట్టుబడి ఉండటం, ముందు విడుదల చేసిన నిధుల వినియోగం మొదలైన అంశాలను దృష్టిలో ఉంచుకుని పర్యాటక మంత్రిత్వ శాఖ   ప్రాజెక్టులు మంజూరు చేస్తుంది.  స్థిరమైన  బాధ్యతాయుతమైన పర్యాటక ప్రాంతాల అభివృద్ధి కోసం స్వదేశీ దర్శన్ పధకాన్ని స్వదేశీ దర్శన్ పథకం  2.0 గా అమలు జరుగుతోంది.  స్వదేశీ దర్శన్ పథకం  2.0 కింద అభివృద్ధి చేయడం కోసం ద్వారక  ఎంపిక చేయబడింది.

ఈశాన్య ప్రాంత అభివృద్ధి,  సాంస్కృతిక, పర్యాటక, అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ జి కిషన్ రెడ్డి నిన్న రాజ్యసభలో ఈ వివరాలు అందించారు. 

***



(Release ID: 1914606) Visitor Counter : 169