ఆయుష్
అస్సాంలోని దిబ్రూఘర్‌లో రేపు అంతర్జాతీయ యోగా దినోత్సవం 2023 సన్నాహక కార్యక్రమంగా యోగా మహోత్సవ్ 75 రోజుల కౌంట్‌డౌన్ నిర్వహణ భారతదేశంలో ప్రముఖ యోగా కేంద్రంగా అభివృద్ధి సాధించడానికి అస్సాంలో సౌకర్యాలు ఉన్నాయి . శ్రీ సర్బానంద సోనోవాల్
Posted On:
06 APR 2023 5:17PM by PIB Hyderabad
అస్సాంలోని దిబ్రూఘర్‌లో రేపు (ఏప్రిల్7) అంతర్జాతీయ యోగా దినోత్సవం 2023 సన్నాహక కార్యక్రమంగా యోగా మహోత్సవ్ నిర్వహిస్తున్నట్లు కేంద్ర ఆయుష్, ఓడ రేవులు, నౌక రవాణా, జలమార్గాల శాఖ మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ తెలిపారు.గువాహటిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శ్రీ సర్బానంద సోనోవాల్ కార్యక్రమం వివరాలు తెలిపారు.
అస్సాంలోని దిబ్రూఘర్‌లోని దిబ్రూగర్ విశ్వవిద్యాలయ క్యాంపస్‌లో యోగా మహోత్సవ్ - 75 రోజుల అంతర్జాతీయ యోగా దినోత్సవం 2023 కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. వరుసగా రెండు సంవత్సరాలు (2022 లో శివసాగర్, 2023లో దిబ్రూగఢ్) రెండు ప్రధాన యోగా మహోత్సవాలు అస్సాంలో విజయవంతంగా జరిగాయని ఆయన అన్నారు. అస్సాంలో అభివృద్ధి సాధించడానికి అవకాశాలు ఉన్న రంగాలను ఆయుష్ మంత్రిత్వ శాఖ గుర్తించిందని మంత్రి తెలిపారు. యోగా అభివృద్ధికి రాష్ట్రంలో అవకాశాలు ఉన్నాయన్నారు. యోగా మహోత్సవ్ లాంటి కార్యక్రమాల నిర్వహణ వల్ల రాష్ట్రంలో యోగా అభ్యాసం పెరిగి ప్రాంత అభివృద్ధికి నూతన అవకాశాలు అందిస్తుందని అన్నారు.
ఆయుష్ అభివృద్ధికి అమలు చేస్తున్న చర్యలు వివరించిన శ్రీ సర్బానంద సోనోవాల్ ' అస్సాంలో ఆయుష్ అభివృద్ధికి అవకాశాలు ఉన్నాయి. దీనిని గుర్తించిన ప్రభుత్వం అభివృద్ధి సాధన కోసం చర్యలు ప్రారంభించింది. దీనిలో భాగంగా గౌహతిలోని సెంట్రల్ ఆయుర్వేద పరిశోధనా సంస్థ (CARI) వంటి సంస్థల సహకారంతో అనేక చర్యలు అమలు జరుగుతున్నాయి. ఒక ప్రత్యేక పంచకర్మ బ్లాక్ తో పాటు ఫార్మకాలజీ కెమిస్ట్రీ భవనం ఏర్పాటువుంటుంది. దీనిలో అత్యాధునిక సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. ఈశాన్య భారతదేశంలో లభిస్తున్న విలువైన మూలికా వైద్యం అభివృద్ధికి చర్యలు అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మూలికలను గుర్తించడానికి 8 ఈశాన్య రాష్ట్రాల్లో సర్వే నిర్వహించి వివరాలు నమోదు చేసి ప్రామాణికంగా అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అవసరమైన అన్ని చర్యలు అమలు చేసిన తర్వాత, మానవ వ్యాధుల చికిత్సకు వీటిని వినియోగిస్తారు' అని మంత్రి వివరించారు. దీనివల్ల ఈశాన్య ప్రాంతం వైద్య, ఫార్మా రంగాల్లో అభివృద్ధి సాధించడమే కాకుండా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పడి ఆర్థిక అభివృద్ధి సాధ్యమవుతుందని శ్రీ సోనోవాల్ అన్నారు.
యోగా మహోత్సవంలో త్రిపుర ముఖ్యమంత్రి ప్రొఫెసర్ (డా) మాణిక్ సాహా, అరుణాచల్ ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి చౌనా మెయిన్, మేఘాలయ ఉప ముఖ్యమంత్రి, ప్రెస్టన్ టిన్‌సాంగ్, విదేశాంగ శాఖ సహాయ మంత్రి రాజ్‌కుమార్ రంజన్ సింగ్,పెట్రోలియం, సహజ వాయువు శాఖ సహాయ మంత్రి శ్రీ రామేశ్వర్ తెలీ పాల్గొంటారు.
అస్సాం ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రి కేశబ్ మహంత, మణిపూర్ ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రి డాక్టర్ సనమ్ రంజన్ సింగ్, అస్సాం పరిశ్రమ వాణిజ్య మంత్రి శ్రీ బిమల్ బోరా, అరుణాచల్ ప్రదేశ్ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రి అలో లిబాంగ్, మేఘాలయ ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రి డాక్టర్ మజెల్ అంపరీన్ లింగ్డో, సిక్కిం పట్టణాభివృద్ధి మంత్రి శ్రీ ఎల్.బి. దాస్, మాజీ మంత్రి హౌసెఫెడ్ చైర్మన్ శ్రీ భబేష్ కలిత, అస్సాం, కార్మిక సంక్షేమ శాఖ మంత్రి శ్రీ సంజయ్ కిషన్, దిబ్రుఘర్ ఎమ్మెల్యే శ్రీ ప్రశాంత ఫుకాన్,ఆయుష్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి వైద్య రాజేష్ కోటేచాతో పాటు దిబ్రుఘర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జితేన్ హజారికా కూడా పాల్గొంటారు.
ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆయుష్ ఔషధాల ప్రాముఖ్యత తెలియజేసే విధంగా ఒక ప్రదర్శనను కూడా ఏర్పాటు చేసింది. ఆయుర్వేదం, యోగా నేచురోపతి, యునాని, సిద్ధ, సోవా రిగ్పా, హోమియోపతి వైద్య అంశాలపై ఏర్పాటైన ప్రదర్శన 2023 ఏప్రిల్ 6 నుంచి 7 వ తేదీ వరకు దిబ్రుఘర్ విశ్వవిద్యాలయం బిష్ణురభ రంగమంచలో జరుగుతుంది.
***
(Release ID: 1914512)
Visitor Counter : 165