పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ

ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సిసిఈఏ)


సవరించిన దేశీయ గ్యాస్ ధర మార్గదర్శకాలకు మంత్రివర్గ ఆమోదం

Posted On: 06 APR 2023 9:21PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఓఎన్‌జీసి/అయిల్‌ అన్వేషణ లైసెన్సింగ్ పాలసీ (ఎన్‌ఈఎల్‌పి) బ్లాక్‌లు మరియు ప్రీ-ఎన్‌ఈఎల్‌పి బ్లాక్‌ల నుండి ఉత్పత్తి చేయబడిన గ్యాస్‌కు సంబంధించి సవరించిన దేశీయ సహజ వాయువు ధరల మార్గదర్శకాలను ఆమోదించింది. ఉత్పత్తి భాగస్వామ్య ఒప్పందం (పిఎస్‌సీ) ధరలకు ప్రభుత్వం ఆమోదం అందిస్తుంది. అటువంటి సహజ వాయువు ధర భారతీయ క్రూడ్ బాస్కెట్ నెలవారీ సగటులో 10% ఉండాలి మరియు నెలవారీ ప్రాతిపదికన తెలియజేయబడుతుంది.ఓఎన్‌జీసీ &ఆయిల్‌  నామినేషన్ బ్లాక్‌ల నుండి ఉత్పత్తి చేసే గ్యాస్ కోసం అడ్మినిస్టర్డ్ ప్రైస్ మెకానిజం (ఏపీఎం) ధర ఫ్లోర్ మరియు సీలింగ్‌కు లోబడి ఉంటుంది. కొత్త బావుల నుండి ఉత్పత్తి చేయబడిన గ్యాస్ లేదా ఓఎన్‌జీసీ&ఆయిల్‌ నామినేషన్ ఫీల్డ్‌లలో జోక్యం చేసుకుంటే ఏపీఎం ధర కంటే 20% ప్రీమియం అనుమతించబడుతుంది. వివరణాత్మక నోటిఫికేషన్ విడిగా విడుదల చేయబడుతోంది.

దేశీయ గ్యాస్ వినియోగదారులకు స్థిరమైన ధరల పాలనను నిర్ధారించడానికి కొత్త మార్గదర్శకాలు ఉద్దేశించబడ్డాయి. అదే సమయంలో ఉత్పత్తిని పెంచడానికి ప్రోత్సాహకాలతో ప్రతికూల మార్కెట్ హెచ్చుతగ్గుల నుండి ఉత్పత్తిదారులకు తగిన రక్షణను అందిస్తాయి.

2030 నాటికి భారతదేశంలో ప్రాథమిక ఇంధన మిశ్రమంలో సహజ వాయువు వాటాను ప్రస్తుత 6.5% నుండి 15%కి పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. సంస్కరణలు సహజ వాయువు వినియోగాన్ని విస్తరించడంలో సహాయపడతాయి. అలాగే ఉద్గార తగ్గింపు మరియు నికర సున్నా లక్ష్యాన్ని సాధించడంలో దోహదపడతాయి.

ఈ సంస్కరణలు నగర గ్యాస్ పంపిణీ రంగానికి దేశీయ గ్యాస్ కేటాయింపును గణనీయంగా పెంచడం ద్వారా భారతదేశంలో గ్యాస్ ధరలపై అంతర్జాతీయ గ్యాస్ ధరల పెరుగుదల ప్రభావాన్ని తగ్గించడం అలాగే వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించడానికి భారత ప్రభుత్వం తీసుకున్న వివిధ కార్యక్రమాల కొనసాగింపులో భాగం.

ఈ సంస్కరణల వల్ల గృహాలకు పైప్డ్ నేచురల్ గ్యాస్ (పిఎన్‌జీ) మరియు కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సిఎన్‌జీ) ధరలు గణనీయంగా తగ్గుతాయి. తగ్గిన ధరలు ఎరువుల సబ్సిడీ భారాన్ని కూడా తగ్గిస్తాయి. దేశీయ విద్యుత్ రంగానికి సహాయపడతాయి. గ్యాస్ ధరలలో ఫ్లోర్ సదుపాయంతో పాటు కొత్త బావుల కోసం 20% ప్రీమియం అందించడంతో పాటు ఈ సంస్కరణ ఓఎన్‌జీసీ మరియు ఆయిల్‌లను అప్‌స్ట్రీమ్ రంగంలో అదనపు దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టడానికి ప్రోత్సహిస్తుంది. ఇది సహజ వాయువు అధిక ఉత్పత్తికి దారి తీస్తుంది మరియు ఫలితంగా దిగుమతి తగ్గుతుంది. సవరించిన ధరల మార్గదర్శకాలు గ్యాస్ ఆధారిత ఆర్థిక వ్యవస్థ వృద్ధి ద్వారా తక్కువ కార్బన్ పాదముద్రను ప్రోత్సహిస్తాయి.

ప్రస్తుతం దేశీయ గ్యాస్ ధరలు 2014లో ప్రభుత్వం ఆమోదించిన కొత్త డొమెస్టిక్ గ్యాస్ ధరల మార్గదర్శకాలు, 2014 ప్రకారం నిర్ణయించబడ్డాయి. 2014 ధరల మార్గదర్శకాలు దేశీయ గ్యాస్ ధరల కోసం 6 నెలల వ్యవధిలో ఉన్న వాల్యూమ్ వెయిటెడ్ ధరల ఆధారంగా ప్రకటించడానికి అందించబడ్డాయి. నాలుగు గ్యాస్ ట్రేడింగ్ హబ్‌లు - హెన్రీ హబ్, అల్బెనా, నేషనల్ బ్యాలెన్సింగ్ పాయింట్ (యూకె) మరియు రష్యా.

4 గ్యాస్ హబ్‌లపై ఆధారపడిన మునుపటి మార్గదర్శకాలు గణనీయమైన సమయం ఆలస్యం మరియు చాలా ఎక్కువ అస్థిరతను కలిగి ఉన్నందున ఈ హేతుబద్ధీకరణ మరియు సంస్కరణ అవసరం భావించబడింది. సవరించిన మార్గదర్శకాలు ముడి చమురుతో ముడిపడి ఉంటాయి. ఇది ఇప్పుడు చాలా పరిశ్రమల ఒప్పందాలలో అనుసరించే పద్ధతి. ఇది మన వినియోగ బాస్కెట్‌కు మరింత సందర్భోచితంగా ఉంటుంది మరియు రియల్ టైమ్ ప్రాతిపదికన గ్లోబల్ ట్రేడింగ్ మార్కెట్‌లలో లోతైన ద్రవ్యతను కలిగి ఉంటుంది. ఇప్పుడు ఆమోదించబడిన మార్పులతో, గత నెలలోని భారతీయ క్రూడ్ బాస్కెట్ ధర డేటా ఏపీఎం గ్యాస్ ధర నిర్ణయానికి ఆధారం అవుతుంది.


 

***



(Release ID: 1914478) Visitor Counter : 180