ఉక్కు మంత్రిత్వ శాఖ
ఎం ఓ ఐ ఎల్ లిమిటెడ్ ఎఫ్ వై'23లో కంపెనీ స్థాపించిన నాటి నుండి 2వ అత్యధిక ఉత్పత్తిని నమోదు చేసింది
అత్యధిక మూలధన వ్యయం మరియు అన్వేషణ
ఈ ఎం డీ అమ్మకాలలో రికార్డ్ టర్నోవర్ ను సాధించింది
Posted On:
03 APR 2023 1:30PM by PIB Hyderabad
ఎం ఓ ఐ ఎల్ లిమిటెడ్ ప్రారంభమైనప్పటి నుండి దాని రెండవ అత్యధిక ఉత్పత్తిని నమోదు చేసింది, 2022-23 ఆర్థిక సంవత్సరంలో 13.02 లక్షల టన్నుల మాంగనీస్ (Mn) ఖనిజ ఉత్పత్తితో మునుపటి సంవత్సరం రికార్డు కంటే 6% వృద్ధిని నమోదు చేసింది. ఎఫ్ వై'23లో రూ.245 కోట్ల మూలధన వ్యయం కూడా సాధించింది, ఇది 2021-22 ఆర్థిక సంవత్సరం కంటే 14% ఎక్కువ.
శ్రీ అజిత్ కుమార్ సక్సేనా, సీ ఎం డీ, ఎం ఓ ఐ ఎల్ లిమిటెడ్, ఎం ఓ ఐ ఎల్ విజయాలపై అభినందనలు తెలిపారు. ఎం ఓ ఐ ఎల్ రాబోయే సంవత్సరాల్లో మరింత అధిక స్థాయి ఉత్పత్తిని సాధించేందుకు సిద్ధంగా ఉందని, దాని కోసం వ్యూహాలు మరియు కార్యాచరణ ప్రణాళికను పటిష్టంగా అమలు చేయవచ్చని విశ్వాసం వ్యక్తం చేశారు.
అన్వేషణపై అత్యధిక ప్రాధన్యత తో, ఎఫ్ వై''23లో ఎం ఓ ఐ ఎల్ అత్యుత్తమ అన్వేషణాత్మక కోర్ డ్రిల్లింగ్‌ను ఎఫ్ వై '23లో నిర్వహించింది, ఇది గత 5 సంవత్సరాల్లో సాధించిన సగటు అన్వేషణ కంటే 2.7 రెట్లు. అదే దాని ప్రస్తుత గనుల నుండి మెరుగైన ఉత్పత్తికి ఆధారం మాత్రమే కాకుండా దేశంలో కొత్త మాంగనీస్ గనులను తెరవడానికి పునాది అవుతుంది.
విద్యుద్విశ్లేషణ మాంగనీస్ డయాక్సైడ్ (EMD) అమ్మకాల టర్నోవర్ కొత్త గరిష్ట స్థాయికి చేరుకుంది, ఇది మునుపటి సంవత్సరం కంటే 2 రెట్లు ఎక్కువ. ఈ ఎం డీ 100% దిగుమతి ప్రత్యామ్నాయ ఉత్పత్తి, ఇది ఎక్కువగా ఫార్మాస్యూటికల్స్ మరియు బ్యాటరీల తయారీకి ఉపయోగించబడుతుంది.
ఎం ఓ ఐ ఎల్ గురించి: ఎం ఓ ఐ ఎల్ లిమిటెడ్ భారత ప్రభుత్వ ఉక్కు మంత్రిత్వ శాఖ అడ్మినిస్ట్రేటివ్ నియంత్రణలో ఉండే షెడ్యూల్-ఏ, మినీరత్న కేటగిరీ-I కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ. ఎం ఓ ఐ ఎల్ దేశంలో మాంగనీస్ ధాతువు దేశీయ ఉత్పత్తిలో ~45% కలిగిన అతిపెద్ద ఉత్పత్తిదారుగా ఉంది. ఎం ఓ ఐ ఎల్ మహారాష్ట్ర మరియు మధ్యప్రదేశ్ లలో పదకొండు గనులను నిర్వహిస్తోంది. కంపెనీ 2030 నాటికి ఉత్పత్తిని రెట్టింపు కంటే ఎక్కువగా 3.00 మిలియన్ టన్నులకు పెంచాలనే ప్రతిష్టాత్మక దృష్టిని కలిగి ఉంది. ఎం ఓ ఐ ఎల్ గుజరాత్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ మరియు ఒడిశాలో వ్యాపార అవకాశాలను కూడా అన్వేషిస్తోంది.
***
(Release ID: 1913343)
Visitor Counter : 181